రూ.5000 నోటు వస్తుందా? RBI ఏం చెప్పిందో తెలుసా?
ఇండియాలో రూ.5000 నోటు చలామణిలోకి రానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2000 నోటు రద్దు నేపథ్యంలో ఈ వార్త మరింత వైరల్ గా మారింది. వీటిపై RBI స్పష్టతనిచ్చింది. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5000 నోటును తీసుకురానుందని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. రూ. 2000 నోటును చలామణి ఆగిపోవడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని వెనక్కు తీసుకోవడంతో ప్రస్తుతానికి పెద్ద నోటు లేకుండా ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో అతి పెద్ద నోటు ఏంటంటే అది రూ.500 మాత్రమే. అందుకే రూ.5000 నోటును ఆర్బీఐ తీసుకు వస్తుందని బాగా ప్రచారం జరుగుతోంది.
రూ.5000 నోటు చరిత్ర
అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లు భారతదేశానికి కొత్తవి కావు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రూ.5000, రూ.10000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 1954లో రూ.5000 నోటు ప్రవేశ పెట్టారు. 1978లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్ద నోట్లను ఉపసంహరించాలని నిర్ణయించడంతో రూ. 1000, రూ. 5000, రూ. 10000 నోట్లను క్యాన్సిల్ చేశారు. అంటే అప్పట్లోనే పెద్ద నోట్లు దాదాపు 24 సంవత్సరాలు చెలామణిలో ఉన్నాయన్న మాట.
ఇది పుకారు మాత్రమే: RBI
ఈ విషయం గురించి ఆల్ ఇండియా రేడియోలో RBI ప్రకటన చేసింది. కొత్త ఆకుపచ్చ నోటుగా రూ.5000 ప్రవేశపెడుతున్నారన్న విషయం కేవలం పుకారు మాత్రమేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీన్ని ఎవరూ నమ్మొద్దని కోరింది. దేశ బ్యాంకింగ్ నియమావళి సంస్థ అధిపతి శశికాంత్ దాస్ కూడా ఈ పుకార్లలో నిజం లేదని స్పష్టం చేశారు.
రూ.2000 నోటు ఉపసంహరణ
RBI రూ.2000 నోటును ఉపసంహరించుకోవాలని మాత్రమే నిర్ణయించిందని శశికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆకుపచ్చ రూ.5000 నోటు గురించి తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయని వాటిని నమ్మొద్దన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50, రూ. 20, రూ.10 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి.
అఫీషియల్ గా చెబితేనే నమ్మండి
డిజిటల్ చెల్లింపుల ప్రాముఖ్యత పెరుగుతోంది. ప్రభుత్వం ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. UPI, సైబర్‌స్పేస్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్‌లు నోట్ల స్థానాన్ని భర్తీ చేయడంలో ముఖ్యమైన అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా నోట్లు చలామణిలోకి రావడం అనేది సరైనది కాదు. ఒకవేళ ఏదైనా కొత్త కరెన్సీ లేదా నోటును విడుదల చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రమే ప్రకటిస్తుంది. ఇలా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తేనే నమ్మాలి. సోషల్ మీడియాలో వార్తలు నమ్మొద్దు.
ఇది కూడా చదవండి: