- Home
- Business
- Business Idea: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే మీరు లక్షాధికారి కావడం ఖాయం
Business Idea: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే మీరు లక్షాధికారి కావడం ఖాయం
Business Idea: కొత్తేడాది కోటి ఆశలను తీసుకొని వస్తుంది. సాధారణంగా కొత్తేడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుంటారు. మరి వచ్చే ఏడాది ఆర్థికంగా ఎదగాలనుకునే వారికి సెట్ అయ్యే ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సొంత వ్యాపారంపై ఆసక్తి
ఈ మధ్యకాలంలో ఉద్యోగం కంటే వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంచి చదువు ఉన్న యువత కూడా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచనతో ముందుకు వస్తోంది. తాము సంపాదించడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొత్త వ్యాపార మార్గాలను అన్వేషిస్తోంది. ఇలాంటి వారికి తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా ముత్యాల సాగు.
ముత్యాల వ్యాపారానికి పెరుగుతున్న డిమాండ్
ఆభరణాల రంగంలో ముత్యాలకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. దేశీయ మార్కెట్‌లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ముత్యాలకు మంచి గిరాకీ ఉంది. కానీ అవసరానికి తగ్గ ఉత్పత్తి లేకపోవడం వల్ల ధరలు నిలకడగా ఉంటున్నాయి. ఈ గ్యాప్‌ను అవకాశంగా మార్చుకుంటే ముత్యాల సాగు ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది.
ముత్యాల సాగు ఎప్పుడు మొదలుపెట్టాలి?
ముత్యాల సాగుకు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలం అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాపారం ప్రారంభించాలంటే సుమారు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీటి కొలను ఏర్పాటు చేయాలి. తర్వాత ఆయిస్టర్‌లను కొనుగోలు చేయాలి. బిల్డింగ్ పై ఉండే ఖాళీ స్థలంలో కూడా ఈ నీటి కొలనును ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్క ఆయిస్టర్ నుంచి ఒక ముత్యం లభించే అవకాశం ఉంటుంది. ఆయిస్టర్ ధరలు ఒక్కటికి రూ.15 నుంచి రూ.25 మధ్యలో ఉంటాయి.
పెట్టుబడి ఎంత? లాభాలు ఎలా ఉంటాయి?
ఉదాహరణకు 100 ఆయిస్టర్‌లతో వ్యాపారం మొదలుపెడితే దాదాపు రూ.20 వేల పెట్టుబడి సరిపోతుంది. ఆయిస్టర్‌లో ముత్యం తయారవ్వడానికి సగటున 15 నుంచి 20 నెలల సమయం పడుతుంది. మార్కెట్లో ముత్యం నాణ్యతను బట్టి ధర రూ.300 నుంచి రూ.1500 వరకు ఉంటుంది. మంచి క్వాలిటీ ఉన్న ముత్యాలకు విదేశీ మార్కెట్‌లో రూ.10 వేల వరకు కూడా ధర పలుకుతోంది. సగటున ఒక్క ముత్యం రూ.1000 చొప్పున విక్రయించినా లక్షల రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
శిక్షణ, మార్గనిర్దేశం కూడా అందుబాటులో
ముత్యాల సాగుపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ కూడా అందుబాటులో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఈ రంగంపై శిక్షణ ఇస్తోంది. సరైన శిక్షణ తీసుకుని ప్రారంభిస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం వచ్చే వ్యాపారంగా ముత్యాల సాగు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఈ వ్యాపారం మొదుల పెట్టాలనుకునే వారు ఇంతకుముందు ఈ రంగంలో అనుభవం ఉన్నవారిని నేరుగా సంప్రదించి లాభనష్టాలను తెలుసుకుంటే మంచిది.

