MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • SBI YONO: మీ ఫోన్‌లో యోనో యాప్ ఉందా.? అయితే ఈ మెసేజ్‌ను అస్స‌లు న‌మ్మ‌కండి

SBI YONO: మీ ఫోన్‌లో యోనో యాప్ ఉందా.? అయితే ఈ మెసేజ్‌ను అస్స‌లు న‌మ్మ‌కండి

SBI YONO: ప్ర‌భుత్వాలు, పోలీసులు ఎన్ని ర‌కాల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతోన్నా సైబ‌ర్ నేరాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. రోజుకో కొత్త మార్గంలో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి ఓ కొత్త ర‌కం మోసం వెలుగులోకి వ‌చ్చింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 09 2026, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆధార్ అప్‌డేట్ చేయకపోతే..
Image Credit : Getty

ఆధార్ అప్‌డేట్ చేయకపోతే..

ఇటీవల వాట్సాప్‌ సహా సోషల్ మీడియా వేదికల్లో ఒక మెసేజ్ తెగ‌ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్‌లో SBI ఖాతాదారులు తప్పనిసరిగా ఆధార్‌కు సంబంధించిన KYC వివరాలు అప్‌డేట్ చేయాలని, అందుకోసం ఒక APK ఫైల్ డౌన్‌లోడ్ చేయాలని చెబుతున్నారు. అలా చేయకపోతే SBI YONO యాప్ పని చేయదని హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఈ మెసేజ్ వల్ల చాలా మంది ఖాతాదారులు అయోమయంలో పడుతున్నారు.

25
వైరల్ మెసేజ్‌లో ఏం చెబుతున్నారంటే..
Image Credit : Bloomberg.com

వైరల్ మెసేజ్‌లో ఏం చెబుతున్నారంటే..

వైరల్ అవుతున్న మెసేజ్ ప్రకారం, SBI యూజర్లు వెంటనే ఒక లింక్ ద్వారా APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇది ఆధార్ అప్‌డేట్ కోసం అంటూ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అప్‌డేట్ చేయకపోతే YONO యాప్ పూర్తిగా బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. ఇది నిజమేనా అనే సందేహం చాలా మందిలో ఏర్పడింది.

Related Articles

Related image1
Viral Song: రూ. 3 ల‌క్ష‌ల‌తో తీస్తే కోటికి పైగా వ‌చ్చాయి.. ఏకంగా బిగ్‌బాస్‌కే కార్పెట్ వేసింది. ఇదీ పాట‌కున్న శ‌క్తి
Related image2
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..
35
PIB ఫ్యాక్ట్ చెక్ ఏమంటోంది?
Image Credit : Groww

PIB ఫ్యాక్ట్ చెక్ ఏమంటోంది?

ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార శాఖకు చెందిన PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టత ఇచ్చింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని ప్రకటించింది. SBI పేరుతో ఇలాంటి మెసేజ్‌లు పంపుతున్నారని, APK ఫైల్ డౌన్‌లోడ్ చేయమని కోరడం మోసానికి స్పష్టమైన సంకేతమని తెలిపింది. ఎవరూ అలాంటి ఫైల్‌లు డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించింది.

45
SBI బ్యాంక్ అధికారిక హెచ్చరిక
Image Credit : Freepik

SBI బ్యాంక్ అధికారిక హెచ్చరిక

SBI కూడా ఈ విషయంలో ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. SMS, WhatsApp లేదా ఈమెయిల్ ద్వారా లింక్ పంపి APK ఫైల్ డౌన్‌లోడ్ చేయమని తాము ఎప్పుడూ చెప్పమని స్పష్టం చేసింది. ఆధార్ లేదా KYC వివరాలను లింక్‌ల ద్వారా అడగడం SBI విధానం కాదని బ్యాంక్ వెల్లడించింది.

55
నకిలీ APK లింక్‌ల వల్ల ప్రమాదం ఏంటి?
Image Credit : Gemini

నకిలీ APK లింక్‌ల వల్ల ప్రమాదం ఏంటి?

బ్యాంక్ తెలిపిన ప్రకారం, నకిలీ APK ఫైల్‌లు ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే మీ బ్యాంక్ లాగిన్ వివరాలు, OTPలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రమాదం ఉంది. దీని వల్ల అనధికార లావాదేవీలు జరిగి ఆర్థిక నష్టం కలగవచ్చు. అందుకే బ్యాంకింగ్ యాప్‌లను కేవలం Play Store లేదా App Store నుంచే డౌన్‌లోడ్ చేయాలని SBI సూచిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Multibagger Stock : రూ. 2 షేరుతో జాక్‌పాట్.. లక్ష పెడితే రూ. 62 లక్షల లాభం ! ఎలాగో తెలుసా?
Recommended image2
బంగారం, వెండి కొన‌డం ఆపేయండి.. ఈ మెట‌ల్ ధ‌ర డ‌బుల్ కావ‌డం ఖాయం. అధ్య‌య‌నంలో సంచ‌ల‌న విష‌యాలు
Recommended image3
Cheapest family car: కేవలం రూ.4 లక్షలకే 33 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ఇది, ఇంతకన్నా చీపెస్ట్ కారు లేదు
Related Stories
Recommended image1
Viral Song: రూ. 3 ల‌క్ష‌ల‌తో తీస్తే కోటికి పైగా వ‌చ్చాయి.. ఏకంగా బిగ్‌బాస్‌కే కార్పెట్ వేసింది. ఇదీ పాట‌కున్న శ‌క్తి
Recommended image2
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved