- Home
- Business
- హోమ్ లోన్ తీసుకుంటున్నారా.? వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంక్, లాభమా.. నష్టమా.?
హోమ్ లోన్ తీసుకుంటున్నారా.? వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంక్, లాభమా.. నష్టమా.?
హోమ్ లోన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా.? అయితే మీకో బ్యాడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ వడ్డీ రేట్లను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఎస్‌బీఐ హోమ్ లోన్ రేట్లపై పెంపు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణగ్రహీతలకు కొత్త షాక్ ఇచ్చింది. తాజాగా హోమ్ లోన్లపై వడ్డీరేట్లు పెంచింది. ఆగస్టు 1 నుంచి ఈ సవరించిన రేట్లు అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
కొత్త రుణగ్రహీతలకు మాత్రమే వర్తింపు
ఈ మార్పులు కేవలం కొత్తగా గృహ రుణం తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటికే రుణం పొందిన కస్టమర్లపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టంగా తెలిపారు. వడ్డీరేట్లను నిర్ణయించడంలో సిబిల్ స్కోరు, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR) ఆధారంగా ఈ పెంపు అమలులోకి వచ్చింది.
వడ్డీరేట్ల తాజా పరిధి
ఇప్పటివరకు ఎస్‌బీఐలో గృహ రుణాల వడ్డీరేట్లు కనిష్ఠంగా 7.50% నుంచి గరిష్ఠంగా 8.45% వరకు ఉన్నాయి. కానీ కొత్త సవరణల ప్రకారం గరిష్ఠ రేటు 8.70%కి పెరిగింది. అంటే క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్న వారికి ఇకపై అధిక వడ్డీ రేట్లు తప్పవు.
మార్పుల వెనుక కారణం
ఎస్‌బీఐ వర్గాల ప్రకారం, గృహ రుణాలపై మార్జిన్ పెంచుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, నిధుల ఖర్చు పెరుగుదల కారణంగా వడ్డీరేట్లు పెంచక తప్పలేదని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటివరకు ఎస్‌బీఐ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఇతర బ్యాంకులపై ప్రభావం
ఎస్‌బీఐ నిర్ణయంతో మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను పెంచే అవకాశముంది. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీరేట్లను 7.35% నుంచి 7.45%కి పెంచింది. దాంతో గృహ రుణాలపై దేశవ్యాప్తంగా వడ్డీ భారం మరింత పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.