MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Bank Rules : సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంచొచ్చు? ఈ లిమిట్ దాటితే ఐటీ నోటీస్ తప్పదా?

Bank Rules : సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంచొచ్చు? ఈ లిమిట్ దాటితే ఐటీ నోటీస్ తప్పదా?

సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చో చాలామందికి తెలియదు. పెద్ద మొత్తంలో క్యాష్ ట్రాన్సాక్షన్లు చేస్తే ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో పడి ఇబ్బందులు తప్పవు. అసలు సేవింగ్ అకౌంట్ లిమిట్ ఎంత? బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 27 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సేవింగ్స్ అకౌంట్ లిమిట్ ప్రచారం నిజమేనా?
Image Credit : Getty

సేవింగ్స్ అకౌంట్ లిమిట్ ప్రచారం నిజమేనా?

నెలనెలా శాలరీ తీసుకునే ఉద్యోగుల నుంచి చిన్నచిన్న వ్యాపారుల వరకు, అందరూ రోజువారీ లావాదేవీలకు సేవింగ్స్ ఖాతానే వాడతారు. విద్యార్థులు, రైతులు ఇలా చాలామంది వాడేది సేవింగ్ అకౌంటే. అయితే చాలామందికి ఈ ఈ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంచొచ్చు? ఎక్కువ ఉంటే ఐటీ శాఖ యాక్షన్ తీసుకుంటుందా? అని సందేహం ఉంటుంది. సేవింగ్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంచవచ్చనే దానిపై క్లారిటీ లేకపోవడంతో సోషల్ మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రజలు నిజమని నమ్ముతున్నారు. ఈ క్రమంలో అసలు ఈ సేవింగ్స్ అకౌంట్ గురించి బ్యాంక్, ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుందాాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సేవింగ్ అకౌంట్ లిమిట్ ఎంత?
Image Credit : Getty

సేవింగ్ అకౌంట్ లిమిట్ ఎంత?

నిజానికి బ్యాంకులో మనం డబ్బులు దాచుకునేందుకు ఉపయోగించే సేవింగ్స్ అకౌంట్‌ లో ఎంతయినా డబ్బు దాచుకోవచ్చు. ఆర్బిఐ రూల్స్, ఆదాయపు పన్ను చట్టంలో ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. అయితే ఆదాయానికి తగ్గట్టుగా ఆ డబ్బు ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసినా, మీ ఆదాయ వివరాలతో పొంతన లేని లావాదేవీలు జరిగినా ఆ సమాచారాన్ని బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు పంపే అవకాశం ఉంది. అప్పుడు ఐటీ అధికారులు మీ అకౌంట్ ప్రీజ్ చేయడంగానీ,  నోటీసులు ఇచ్చి వివరణ కోరడం గానీ చేస్తారు. ఇలాంటప్పుడు ఇబ్బందులు తప్పవు. 

Related Articles

Related image1
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
Related image2
Bank Rules: బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఫీజు ఎందుకు వసూలు చేస్తాయో తెలుసా.?
35
 ఐటీ నోటీసులు వస్తే..?
Image Credit : Gemini AI

ఐటీ నోటీసులు వస్తే..?

సేవింగ్ అకౌంట్లో ఇంత డబ్బు ఎలా వచ్చింది? అని ఆదాయపు పన్ను శాఖ అడిగితే తప్పకుండా సరైన ఆధారాలతో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. జీతం, వ్యాపార ఆదాయం, ఆస్తి అమ్మకం, బహుమతులు, ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ లేదా వారసత్వ ఆస్తి వంటి వాటికి సరైన ఆధారాలు చూపిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఆధారాలు చూపలేదో ఇబ్బందులు తప్పవు. అందుకే సేవింగ్ అకౌంట్ ద్వారా పెద్ద లావాదేవీల చేస్తుంటే సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

45
 సేవింగ్ అకౌంట్లోని డబ్బుపై నో ట్యాక్స్
Image Credit : Gemini AI

సేవింగ్ అకౌంట్లోని డబ్బుపై నో ట్యాక్స్

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సేవింగ్స్ అకౌంట్‌లో దాచుకునే అసలు డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు. కానీ ఆ డబ్బుకు బ్యాంకు చెల్లించే వడ్డీపై మాత్రం పన్ను వర్తిస్తుంది. ఇక్కడ కూడా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద, అర్హులైన వ్యక్తులు సేవింగ్స్ అకౌంట్ వడ్డీపై కొంత మొత్తం వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80TTB కింద అదనపు పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.

55
 సేవింగ్ అకౌంట్ ఎలా మెయింటేన్ చేయాలి?
Image Credit : ChatGPT

సేవింగ్ అకౌంట్ ఎలా మెయింటేన్ చేయాలి?

కాబట్టి సేవింగ్స్ అకౌంట్‌లో ఎక్కువ డబ్బు ఉందని పన్ను విధిస్తారనే ఆలోచన సరైనది కాదు. కానీ మీ ఆదాయానికి అనుగుణంగా అన్ని లావాదేవీలు చట్టబద్ధంగా, సరైన పత్రాలతో ఉండటం, ఐటీ రిటర్న్స్‌లో వాటిని సరిగ్గా చూపించడం చాలా అవసరం. ఇలా చేస్తే అనవసరమైన పన్ను చిక్కుల నుంచి సులభంగా బయటపడొచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: బంగారం కొనేముందు ఇవి తప్పక తెలుసుకోండి..ఈరోజు బిగ్ షాక్ ఇచ్చిన పసిడి, సిల్వర్
Recommended image2
EPF: మీకు నెలకు రూ. 3 వేల పీఎఫ్ కట్ అవుతుందా.? రిటైర్మెంట్ నాటికి ఎంత డ‌బ్బు జ‌మ‌ అవుతుందో తెలుసా.?
Recommended image3
ATM నుంచి డబ్బు రాలేదు కానీ.. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా.? బ్యాంకులు మీకు ఫైన్ చెల్లిస్తాయని తెలుసా.?
Related Stories
Recommended image1
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
Recommended image2
Bank Rules: బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఫీజు ఎందుకు వసూలు చేస్తాయో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved