MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • Stock Market: మార్కెట్ పడిపోతుందని భయపడకండి.! ఇలా మీ పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవచ్చు.. అదెలాగంటే.?

Stock Market: మార్కెట్ పడిపోతుందని భయపడకండి.! ఇలా మీ పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవచ్చు.. అదెలాగంటే.?

Stock Market: గ్లోబల్ మార్కెట్ ఉద్రిక్తతల సమయంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు అనుసరించాల్సిన వ్యూహాలను ఆర్థిక నిపుణులు వివరించారు. SIPలను ఆపకుండా కొనసాగించడం, పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్, భయాందోళనతో కూడిన అమ్మకాలకు.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 14 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు
Image Credit : Stock Market\Twitter

స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు భయాందోళనతో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలా లేక కొనసాగించాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే మార్కెట్ పతనం అనేది ఎప్పుడూ తాత్కాలికమేనని, సహనంతో ఉంటేనే సంపద సృష్టించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మార్కెట్ రికవరీ తప్పనిసరి
Image Credit : Stock Market\Twitter

మార్కెట్ రికవరీ తప్పనిసరి

గతంలో జరిగిన అనేక యుద్ధాలు లేదా సంక్షోభాల సమయంలో మార్కెట్లు పడిపోయినప్పటికీ, అతి తక్కువ కాలంలోనే తిరిగి కోలుకున్నాయని బిజినెస్ నిపుణులు గుర్తు చేశారు.

కార్గిల్ యుద్ధం: మార్కెట్ 20 శాతం పడిపోయినా, 3 నెలల్లోనే రికవరీ అయ్యింది.

కోవిడ్ క్రాష్: నిఫ్టీ 40 శాతం పడిపోయినా, 6 నెలల నుంచి ఏడాదిలోపే ఆల్ టైమ్ హైకి చేరింది.

ఇతర యుద్ధాలు: రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల సమయంలోనూ మార్కెట్లు కేవలం 4 నుంచి 5 నెలల్లోనే తిరిగి పుంజుకున్నాయి.

35
ఇన్వెస్టర్లు చేయాల్సినవి
Image Credit : Stock Market\Twitter

ఇన్వెస్టర్లు చేయాల్సినవి

SIP కంటిన్యూ చేయండి: మార్కెట్ పడిపోయినప్పుడు SIP ఆపడం అతిపెద్ద తప్పు. మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఇది దీర్ఘకాలంలో భారీ లాభాలను ఇస్తుంది.

అసెట్ అలొకేషన్: మీ వయస్సును బట్టి పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకోండి. యువత ఈక్విటీలో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు, కానీ రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారు డెట్ ఫండ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.

బంగారంలో పెట్టుబడి: పోర్ట్‌ఫోలియోలో 5-10 శాతం బంగారం(Gold ETFs/Funds) ఉండటం వల్ల మార్కెట్ అనిశ్చితి సమయంలో రక్షణ లభిస్తుంది.

STP మార్గం: లంసం(Lumpsum) పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఒకేసారి కాకుండా, లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్‌కు STP(Systematic Transfer Plan) ద్వారా మళ్లించడం ఉత్తమం.

45
చేయకూడనివి
Image Credit : Stock Market\Twitter

చేయకూడనివి

పానిక్ సెల్లింగ్: మార్కెట్ పడిపోతుందని భయపడి నష్టాల్లో ఉన్నప్పుడు అమ్మేయకండి. మీరు అమ్మితేనే అది మీకు నష్టంగా మారుతుంది, లేదంటే అది కేవలం పేపర్ లాస్ మాత్రమే.

వార్తలకు అతిగా స్పందించడం: వాట్సప్ ఫార్వర్డ్స్ లేదా టీవీ వార్తలను చూసి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దు.

స్మాల్ & మిడ్ క్యాప్ రష్: మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి తొందరపడొద్దు.

55
నిర్ణయం తీసుకునే ముందు..
Image Credit : Stock Market\Twitter

నిర్ణయం తీసుకునే ముందు..

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 72 గంటల పాటు వేచి చూడాలని, ఆ తర్వాత కూడా అవసరమనిపిస్తేనే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించి అడుగు ముందుకు వేయాలని సూచించారు. పెట్టుబడి అనేది కేవలం డబ్బుతో కూడినది మాత్రమే కాదు, అది మీ మైండ్‌సెట్‌పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
Stock Market: ఒకే ఒక్క సీక్రెట్.. రూ. 10 వేలతో లక్ష సంపాదించే ఐడియా.. సింప్లీ సూపర్బ్.!
Recommended image2
Stock Market: 8 రోజుల్లో రూ. 6 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ప్ర‌మాదంలో ఉన్నాయా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved