MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Reliance: జియో మ‌రో సంచ‌ల‌నం.. వైద్య రంగంలోకి, రూ. 10 వేల టెస్ట్, ఇక‌పై రూ. వెయ్యికే..

Reliance: జియో మ‌రో సంచ‌ల‌నం.. వైద్య రంగంలోకి, రూ. 10 వేల టెస్ట్, ఇక‌పై రూ. వెయ్యికే..

Reliance: టెలికం రంగంలో స‌రికొత్త ఒర‌వ‌డి సృష్టించింది జియో ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌వుతోంది. హెల్త్ కేర్ రంగంలోకి అడుగుపెట్ట‌నుంది. జినోమిక్ ప‌రీక్ష‌లు చేపేట్టే ప్రణాళిక‌ను అమ‌లు చేయ‌నుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 19 2025, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైద్య రంగంలోకి
Image Credit : Generated by google gemini AI

వైద్య రంగంలోకి

టెలికం రంగంలో జియోతో డేటా ధరలను భారీగా త‌గ్గించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు హెల్త్ కేర్ రంగంలో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ప్రాణాంతక వ్యాధులను ముందే గుర్తించే జినోమిక్ పరీక్షలను సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యంగా భారీ ప్రణాళికను అమలు చేయనుంది. ప్రస్తుతం రూ.10,000 వరకు ఉన్న క్యాన్సర్ ముందస్తు స్క్రీనింగ్ పరీక్షను కేవలం రూ.1,000 లోపు ధరకు అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జినోమిక్ టెస్టింగ్ అంటే ఏమిటి?
Image Credit : Generated by google gemini AI

జినోమిక్ టెస్టింగ్ అంటే ఏమిటి?

జినోమిక్ టెస్టింగ్ అంటే వ్యక్తి జన్యు నిర్మాణం ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను ముందే గుర్తించే వైద్య పరీక్ష. రక్తం, లాలాజలం లేదా శరీర కణజాల నమూనాలతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును ముందే అంచనా వేయడం ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. ఈ ప‌రీక్ష‌లు ఖ‌రీదైన‌వి కావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు సంపన్న వర్గాలకే పరిమితమయ్యాయి.

Related Articles

Related image1
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Related image2
Food: చికెన్ లివ‌ర్ వ‌ర్సెస్ మ‌ట‌న్ లివ‌ర్‌.. రెండింటీ మ‌ధ్య తేడా ఏంటి? ఆరోగ్యానికి ఏది మంచిది.?
35
స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ కీలక పాత్ర
Image Credit : Justdial

స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ కీలక పాత్ర

రిలయన్స్ ఇండస్ట్రీస్ నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సంస్థను రూ.393 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ ఆధునిక జినోమిక్ సైన్స్ టెక్నాలజీపై పరిశోధన చేస్తోంది. ఇప్పుడు అదే సంస్థ ద్వారా రిలయన్స్ డయాగ్నస్టిక్ సేవలను విస్తృత స్థాయిలో ప్రారంభించనుంది. తక్కువ ఖర్చుతో, వేగంగా ఫలితాలు ఇచ్చే పరీక్షలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.

45
‘క్యాన్సర్ స్పాట్’ ఏఐ మోడల్ ప్రత్యేకత
Image Credit : Getty

‘క్యాన్సర్ స్పాట్’ ఏఐ మోడల్ ప్రత్యేకత

స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన ‘క్యాన్సర్ స్పాట్’ అనే ఏఐ ఆధారిత జినోమ్ సీక్వెన్సింగ్ మోడల్ ఇప్పటికే వైద్య రంగంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కాలేయం, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాటిక్, రొమ్ము, ఉదర క్యాన్సర్లు సహా పది రకాల క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. పాజిటివ్ ఫలితం వస్తే కచ్చితమైన నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు అవసరం. ప్రస్తుతం ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిలో 20 నుంచి 30 శాతం మందికి క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది.

55
ధరల విప్లవం వెనుక అంబానీ వ్యూహం
Image Credit : ANI

ధరల విప్లవం వెనుక అంబానీ వ్యూహం

చౌక ధరలకే వైద్య పరీక్షలు అందించాలన్నది ముఖేశ్ అంబానీ దీర్ఘకాలిక లక్ష్యం. అందుకే ఈ ప్రాజెక్టుకు కఠినమైన టైమ్‌లైన్ పెట్టుకోలేదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసే ఖరీదైన డయాగ్నస్టిక్ కిట్‌ల స్థానంలో స్వదేశీ టెక్నాలజీ వినియోగం, ఏఐ ఆధారిత విశ్లేషణ ద్వారా ఖర్చును భారీగా తగ్గించాలని రిలయన్స్ భావిస్తోంది. ఇది వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, ప్రజారోగ్య రంగంలో పెద్ద మార్పున‌కు నాంది పలికే అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
భారత దేశం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?
Recommended image2
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image3
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Related Stories
Recommended image1
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Recommended image2
Food: చికెన్ లివ‌ర్ వ‌ర్సెస్ మ‌ట‌న్ లివ‌ర్‌.. రెండింటీ మ‌ధ్య తేడా ఏంటి? ఆరోగ్యానికి ఏది మంచిది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved