MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Ambani Ice Cream: రూ. 30 వేల కోట్ల మార్కెట్‌పై అంబానీ కన్ను.. రూ. 10లకే రియల్ మిల్క్ ఐస్‌క్రీమ్

Ambani Ice Cream: రూ. 30 వేల కోట్ల మార్కెట్‌పై అంబానీ కన్ను.. రూ. 10లకే రియల్ మిల్క్ ఐస్‌క్రీమ్

Mukesh Ambani Ice Cream: క్యాంపా కోలా తో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇప్పుడు 30 వేల కోట్లకు పైగా విలువైన భారత ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 24 2026, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ. 10లకే రియల్ మిల్క్ అంబానీ ఐస్‌క్రీమ్
Image Credit : Chatgpt

రూ. 10లకే రియల్ మిల్క్ అంబానీ ఐస్‌క్రీమ్

టెలికాం రంగంలో జియోతో సంచలనం సృష్టించి, ఆ తర్వాత క్యాంపా కోలాతో కూల్ డ్రింక్స్ మార్కెట్‌ను ఊపేసిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇప్పుడు ఎంతో మందికి ఇష్టమైన ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తమ కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్ బాంబే క్రీమరీ (Bombay Creamery) ని అధికారికంగా లాంచ్ చేసింది.

ఈ బ్రాండ్ ఐస్‌క్రీమ్‌ల ప్రారంభ ధర కేవలం రూ. 10 కావడం గమనార్హం. తక్కువ ధరకే క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను సామాన్యులకు అందించాలనే లక్ష్యంతో రిలయన్స్ ఈ అడుగు వేసింది. దేశంలో ఇప్పటికే దాదాపు రూ. 30,000 కోట్లుగా ఉన్న ఐస్‌క్రీమ్ మార్కెట్, 2028 నాటికి రూ. 50,000 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ భారీ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికే అంబానీ ఈ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒరిజినల్ మిల్క్ క్రీమ్‌తో ప్రీమియం టేస్ట్
Image Credit : Gemini

ఒరిజినల్ మిల్క్ క్రీమ్‌తో ప్రీమియం టేస్ట్

బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్‌లను ఎలాంటి ఫేక్ పదార్థాలు లేకుండా, అసలైన డెయిరీ క్రీమ్‌తో తయారు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారులకు క్వాలిటీ ఐస్‌క్రీమ్ అనుభూతిని అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ఈ బ్రాండ్ కింద కప్స్, కోన్స్, టబ్స్, బార్స్ అండ్ స్టిక్స్ వంటి పలు రకాల ఫార్మాట్లలో ఐస్‌క్రీమ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ లాంచ్ గురించి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ మాట్లాడుతూ, "డెయిరీ ఉత్పత్తుల తయారీలో ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండకూడదనే చిన్న ఆలోచనతో బాంబే క్రీమరీని నిర్మించాం. మేము కేవలం ఐస్‌క్రీమ్ కేటగిరీలోకి అడుగుపెట్టడం లేదు, ఇందులో సుదీర్ఘకాలం కొనసాగేందుకు బలమైన కట్టుబడి ఉన్నాం. ఒరిజినల్ డెయిరీ క్రీమ్‌తో తయారుచేసిన బాంబే క్రీమరీ, ప్రతి భారతీయ కుటుంబానికి అందుబాటులో ఉండే ధరకే అసలైన ఐస్‌క్రీమ్ రుచిని అందిస్తుంది" అని స్పష్టం చేశారు.

35
వెస్ట్రన్ ఇండియాలో స్టార్ట్.. త్వరలోనే ఆల్ ఓవర్ ఇండియా
Image Credit : AI Meta

వెస్ట్రన్ ఇండియాలో స్టార్ట్.. త్వరలోనే ఆల్ ఓవర్ ఇండియా

బాంబే క్రీమరీని ముందుగా పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. రిలయన్స్‌కు ఉన్న భారీ రిటైల్ నెట్‌వర్క్, వేలాది మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ బ్రాండ్‌ను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడనున్నారు.

ప్రస్తుతం ఆర్సిపిఎల్ బిజినెస్ నెట్‌వర్క్ చాలా బలంగా ఉంది. ఈ కంపెనీ వ్యాపార వ్యవహారాలను, విస్తరణ ప్రణాళికలను ఈషా అంబానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పర్యవేక్షిస్తున్నారు. గతంలో క్యాంపా కోలాను తక్కువ ధరకే మార్కెట్‌లోకి తెచ్చి సక్సెస్ సాధించినట్లే, ఇప్పుడు ఐస్‌క్రీమ్ రంగంలో కూడా అదే ఫార్ములాను వాడాలని రిలయన్స్ చూస్తోంది.

45
ఆర్‌సిపిఎల్ నుంచి ఇతర ప్రముఖ ప్రొడక్ట్స్
Image Credit : Getty

ఆర్‌సిపిఎల్ నుంచి ఇతర ప్రముఖ ప్రొడక్ట్స్

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే అనేక రకాల నిత్యావసర ఉత్పత్తులు ఉన్నాయి..

• కూల్ డ్రింక్స్: క్యాంపా కోలా (కోలా, ఆరంజ్, లెమన్ ఫ్లేవర్లు).

• ఆహార ధాన్యాలు, నూనెలు: ఇండిపెండెన్స్ (సన్‌ఫ్లవర్ ఆయిల్, గోధుమ పిండి, తాగునీరు), ఉధమ్, మానా (పప్పులు, బియ్యం).

• సాస్‌లు, బిస్కెట్లు: సిల్ (సాస్‌లు, జామ్‌లు, నూడుల్స్), మాలిబాన్ (బిస్కెట్లు).

• పర్సనల్ కేర్: గ్లిమ్మర్, ప్యూరిక్, గెట్ రియల్ సోప్‌లు, బ్రైల్‌క్రీమ్, టోనీ అండ్ గై హెయిర్ ప్రొడక్ట్స్.

• హోమ్ కేర్: డోజో (డిష్‌వాషింగ్ బాక్స్, లిక్విడ్స్), ఎంజో (డిటర్జెంట్), హోమ్‌గార్డ్ (ఫ్లోర్ క్లీనర్స్).

55
మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ తప్పదా?
Image Credit : Getty

మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ తప్పదా?

ప్రస్తుతం భారత ఐస్‌క్రీమ్ మార్కెట్‌లో అమూల్ అగ్రస్థానంలో ఉండగా, క్వాలిటీ వాల్స్, వాడిలాల్, మదర్ డెయిరీ, హ్యాట్సన్ అగ్రో, హావ్‌మోర్ వంటి బ్రాండ్లు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. వీటిలో అమూల్ మ్యాంగో స్టిక్ ఐస్‌క్రీమ్ అతి తక్కువగా రూ. 20కి లభిస్తోంది. కానీ రిలయన్స్ ఏకంగా రూ. 10లకే ఐస్‌క్రీమ్‌ను తేవడంతో మిగతా కంపెనీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయితే ఐస్‌క్రీమ్ బిజినెస్ చేయడం మిగతా కూల్ డ్రింక్స్ లాంటిది కాదు. దీనికి కోల్డ్ చైన్ నెట్‌వర్క్, నిరంతరం ఫ్రీజర్లు అందుబాటులో ఉండటం చాలా అవసరం. ప్రస్తుతం రిలయన్స్ దగ్గర ఉన్న భారీ క్యాపిటల్, డిస్ట్రిబ్యూషన్ బలంతో దుకాణదారులకు మంచి ఆఫర్లు ఇస్తే, మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొనడం ఖాయం. ఇది రాబోయే రోజుల్లో ఇతర కంపెనీల ప్రాఫిట్ మార్జిన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: బంగారం ధరలకు భారీ బ్రేక్.. 10 గ్రాములపై రూ.1,520 తగ్గుదల.. వెండి కూడా డౌన్
Recommended image2
భార‌త్‌లో అత్యంత వేగంగా న‌డిచే టాప్ 5 రైళ్లు ఇవే.. గంట‌కు ఏకంగా 160 కి.మీల వేగంతో
Recommended image3
DMart: డి-మార్ట్‌లో ఈ 5 వస్తువులు కొనే ముందు ఆలోచించండి.. తొందరపడకండి
Related Stories
Recommended image1
Best Mileage Cars: లీటరుకు 34 కిలోమీటర్ల మైలేజ్.. టాప్ 5 మారుతి సుజుకి కార్లు ఇవే
Recommended image2
Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved