MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • పోస్టాఫీసులోనూ రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు

పోస్టాఫీసులోనూ రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు

2,000 రూపాయల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్లు ఇప్పటికే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది. చాలా వరకు 2,000 రూపాయల నోట్లు వెనక్కు వచ్చేసినట్లే. అయితే ఇంకా కొంత మొత్తం ప్రజల దగ్గర ఉందని ఆర్బీఐ తెలిపింది. ఒకవేళ మీ దగ్గర కూడా 2,000 రూపాయల నోట్లు ఉంటే ఇప్పుడు పోస్టాఫీసుకు వెళ్లి ఆ నోట్లను ఆర్బీఐకి పోస్ట్ చేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 02 2025, 11:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారతదేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి 2016లో అప్పటి వరకు చెలామణిలో ఉన్న 1000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పెద్ద నోట్ల రద్దు సమయంలోనే దేశంలో కొత్తగా 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2,000 రూపాయల నోట్లు చెలామణిలో ఉండగా 2018-19 సంవత్సరాల్లో రూ.2,000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసింది. నల్ల ధనానికి అడ్డుకట్ట వేయలేకపోవడంతో 2000 నోట్లను కూడా వెనక్కు తీసుకోవాలని కేంద్రం భావించింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

రూ.2,000 నోట్ల ఉపసంహరణ

దీని తర్వాత 2023 మే 19 నుండి రూ.2,000 నోటును ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆ తర్వాత ఈ నోట్లను ప్రజల నుండి ఉపసంహరించుకునే ప్రక్రియ కొనసాగుతోంది. అంటే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంక్ ఖాతాలో జమ చేయడం లేదా బ్యాంకుల్లో మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు బ్యాంకులకు క్యూలు కట్టి మరీ 2000 నోట్లను మార్చుకున్నారు.  

 

34

ఎంత ఉపసంహరించారు?

దీని ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న 2,000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో జమ చేశారు. అయితే పూర్తి స్థాయిలో వెనక్కు రాలేదు. అందుకే ప్రజల నుండి ఎన్ని 2000 రూపాయల నోట్లు వెనక్కు వచ్చాయి? ఇంకా ఎన్ని నోట్లు చెలామణిలో ఉన్నాయి? ఇలాంటి సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా తెలియజేస్తూనే ఉంది.

2024 డిసెంబర్ 21 నాటికి 98.12 శాతం 2,000 రూపాయల నోట్లు ఉపసంహరించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇంకా రూ.6691 కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లు ప్రజల వద్ద ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మిగిలిన 2,000 రూపాయల నోట్లను కూడా ప్రజల నుండి పూర్తిగా వెనక్కు తీసుకుంటామని తెలిపింది.

44

ఎలా జమ చేయాలి?

మీ దగ్గర కూడా ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నట్లయితే వాటిని అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం నగరాల్లోని RBI కార్యాలయాల్లో జమ చేయవచ్చని RBI తెలిపింది.

అంతేకాకుండా మీ సమీపంలోని ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి RBI అకౌంట్ లో జమ చేయవచ్చని అధికారులు ప్రకటించారు. భారతదేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుండి RBI కార్యాలయాలకు పోస్ట్ ద్వారా రూ.2,000 నోట్లను పంపవచ్చని కూడా తెలియజేసింది.

ఇది కూడా చదవండి: 

https://telugu.asianetnews.com/gallery/business/rbi-clarifies-rumors-about-new-5000-rupee-note-in-india-sns-speqzc

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: బంగారం ధరలపై దిగుమతి సుంకం ఎఫెక్ట్...దిగొచ్చిన పసిడి
Recommended image2
September 1 Rule Changes: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ సిలిండర్, ఐటీఆర్, ఎఫ్‌డీపై బిగ్ అప్‌డేట్
Recommended image3
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved