MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Fact Check
  • RBI Rules : ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే రూ.10,000 ఫైన్..?

RBI Rules : ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉంటే రూ.10,000 ఫైన్..?

Fact Check : ఓ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగివుంటే రూ.10000 ఫైన్ పడుతుందా..? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి నిబంధన ఏమైనా తీసుకువచ్చిందా..? 

3 Min read
Author : Arun Kumar P
| Updated : May 22 2026, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీరు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ కలిగివున్నారా..?
Image Credit : Asianet News

మీరు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ కలిగివున్నారా..?

సాధారణ ప్రజలకు ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. కానీ ఎక్కువగా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే వ్యక్తులకు ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉండటం సహజం. ఉద్యోగులు కూడా శాలరీ అకౌంట్, సేవింగ్ అకౌంట్ వేరువేరుగా మెయింటేన్ చేస్తుంటారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ల్ కలిగినవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఫైన్ విధిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది... ఇదిచూసి చాలామంది కంగారుపడుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత..? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్బిఐ రూ.10000 జరిమానా..?
Image Credit : Ai Gemeni

ఆర్బిఐ రూ.10000 జరిమానా..?

భారతదేశ ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకింగ్ వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ((RBI) పర్యవేక్షిస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలను సక్రమంగా నడిపించేందుకు ఆర్బిఐ అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ కలిగివుండే కస్టమర్లకు RBI ఏకంగా రూ.10000 ఫైన్ వేస్తోందంటూ ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.

చివరకు ఈ ప్రచారం ఆర్బిఐ వరకు వెళ్లింది.. దీంతో వెంటనే అప్రమత్తమై క్లారిటీ ఇచ్చింది. ఇది తప్పుడు ప్రచారం అని... ఓ వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ కలిగివున్నా ఎలాంటి ఫైన్ ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్బీఐ నిబంధనల ప్రకారం... ఓ వ్యక్తి తన అవసరాలకు తగ్గట్లు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా కలిగివుండవచ్చు. బ్యాంక్ అకౌంట్స్ సంఖ్యపై ఎలాంటి పరిమితి గానీ, జరిమానా గానీ లేదని ఆర్బిఐ తేల్చింది.

35
ఆర్బిఐ ఫైన్ ప్రచారం ఎలా మొదలయ్యింది..?
Image Credit : Getty

ఆర్బిఐ ఫైన్ ప్రచారం ఎలా మొదలయ్యింది..?

భారతదేశంలో ఇప్పుడంతా ఆన్ లైన్ ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. చిన్నచిన్న కిరాణాషాపుల నుండి కార్పోరేట్ సంస్థల వరకు ఆన్ లైన్ ఫేమెంట్స్ వాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతిఒక్కరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. అయితే ఇలా టెక్నాలజీ ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు జరపడం సౌకర్యమంతంగా ఉన్నా దీనివల్ల సైబర్ ప్రాడ్స్ పెరిగిపోయాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఆర్బిఐ సరికొత్త ఆలోచన చేస్తోంది.

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ఓ కొత్త భద్రతా ఫీచర్‌ను పరిశీలిస్తోంది. ఓ యూజర్ తనకు తెలియని కొత్త వ్యక్తి ఖాతాకు మొదటిసారి రూ.10,000 కంటే ఎక్కువ (UPI, IMPS, NEFT ద్వారా) పంపితే ఆ లావాదేవీ గంటపాటు హోల్డ్‌లో ఉంటుంది. పొరపాటున డబ్బులు పంపితే రద్దు చేసుకునేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది. సైబర్ నేరాల సమయంలో కూడా వెంటనే అలర్ట్ అయితే డబ్బులు కాపాడుకునే అవకాశం ఉంటుంది.

ఇలా ఆన్ లైన్ పేమెంట్స్ పై రూ.10,000 పరిమితిని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు... 'ఎక్కువ ఖాతాలుంటే ఫైన్' అంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించారు. కానీ ఆర్బిఐ మాత్రం అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది. కాబట్టి ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ కలిగినవారు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.

45
ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే నష్టాలు...
Image Credit : Getty

ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే నష్టాలు...

ఇండియాలో ఓ వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా కలిగివుండవచ్చు... ఆర్బిఐ ఎలాంటి పరిమితి విధించలేదు. కానీ అవసరానికి మించి అకౌంట్స్ కలిగివుంటే కొన్నిసార్లు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.

మినిమం బ్యాలెన్స్  

ఎక్కువ అకౌంట్స్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటేన్ చేయడంవల్ల ఎక్కువమొత్తంలో డబ్బు నిలిచిపోతుంది. కొన్నిబ్యాంకుల్లో కేవలం రూ.1000, మరికొన్ని బ్యాంకుల్లో రూ.10,000 వరకు మినిమం బ్యాలెన్స్ ఉంచాలి... ఈ డబ్బులు మనం వాడుకోడానికి ఉండదు. ఒకవేళ మినిమం బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు ఫైన్స్ విధిస్తాయి.

మెయింటెనెన్స్ ఛార్జీలు...

బ్యాంక్ అకౌంట్ కలిగివుంటే చాలు ఏటిఎం (ATM) కార్డ్ ఛార్జీలు, ఎస్‌ఎంఎస్ (SMS) ఛార్జీలు, సర్వీస్ ట్యాక్సులు పడతాయి. అంటే ఎన్ని ఎక్కువ అకౌంట్లు కలిగివుంటే అన్నిసార్లు ఛార్జీలు పడతాయి. ఇవి మీ అకౌంట్ బ్యాలెన్స్ నుండి కట్ అవుతాయి. ఇలా డబ్బులు కట్ అయి మినిమం బ్యాలెన్స్ కంటే తగ్గితే అదో ఫైన్ ఎక్స్ట్రా. 

ఆదాయపు పన్ను (IT) సమస్యలు..

ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు అనుమానాస్పద లావాదేవీలు జరిగితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది… ఒక్కోసారి చర్యలు కూడా తప్పకపోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాల్లో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ప్రత్యేక నిఘా ఉంటుంది.

సిబిల్ స్కోర్ (CIBIL Score)

మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అకౌంట్ బ్యాలెన్స్ మైనస్‌కు వెళితే, అది మీ సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీరు బ్యాంకుల నుండి రుణాలు పొందడం కష్టతరం అవుతుంది.

55
ఆర్థిక నిపుణుల సూచన ఇదే..
Image Credit : Getty

ఆర్థిక నిపుణుల సూచన ఇదే..

ఇలా ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ కలిగివుంటే అనేక ఇబ్బందులు ఉంటాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే ఒకే అకౌంట్ వాడటం ఉత్తమం... మరీ అవసరం అనుకుంటే కేవలం 2 నుండి 3 అకౌంట్లను మాత్రమే కలిగి ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వాడని పాత అకౌంట్లు ఉంటే వెంటనే వాటిని ఖాతా మూసివేత (Account Closure) ప్రక్రియ ద్వారా క్లోజ్ చేసుకోవడం మంచిది.. లేదంటే అనవసరంగా డబ్బులు వృధా అవుతాయి… ఇతర ఇబ్బందులు కూడా ఉంటాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fact Check: ఎస్‌బీఐ పీఎన్‌బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక అసలు నిజం ఇదే !
Recommended image2
Mumbai Facts: అక్కడ రాత్రి 8 తర్వాతే వ్యాపారాలు మొదలవుతాయి..కారణమేంటో తెలుసా?
Recommended image3
Zero Watt Bulb : జీరో వాట్ బల్బ్ వేస్తే కరెంట్ బిల్లు రాదా? అసలు కథేంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Related Stories
Recommended image1
Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పటినుంచో తెలుసా?
Recommended image2
Banking Rule: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచి రూల్స్ మారుతున్నాయ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved