- Home
- Business
- Business Plan: ఊరైనా, పట్టణమైనా హిట్టే..! నెలకు రూ. 2 లక్షలు.. ఇప్పుడిదే ఎవర్‌గ్రీన్ బిజినెస్
Business Plan: ఊరైనా, పట్టణమైనా హిట్టే..! నెలకు రూ. 2 లక్షలు.. ఇప్పుడిదే ఎవర్‌గ్రీన్ బిజినెస్
Business Plan: కోడిగుడ్ల హోల్‌సేల్ బిజినెస్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదించడం ఎలా.? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఈ బిజినెస్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు

ఎగ్స్ హోల్‌సేల్ బిజినెస్
నిత్యం డిమాండ్ ఉండే వ్యాపారాలలో కోడిగుడ్ల హోల్‌సేల్ బిజినెస్ ఒకటి. సామాన్యుడి నుంచి సంపన్నడి వరకు ప్రతిరోజూ ఆహారంలో గుడ్లను ఉపయోగిస్తారు కాబట్టి, ఈ వ్యాపారంలో నష్టపోయే అవకాశం చాలా తక్కువ.
పెట్టుబడి, ధరల వివరాలు
హోల్‌సేల్ ధర: ఒక ట్రే(30 గుడ్లు) మీకు హోల్‌సేల్ ధరలో సుమారు రూ. 120 నుంచి రూ. 150 వరకు లభిస్తుంది.
రిటైల్ ధర: అదే ట్రేని మీరు రిటైల్ మార్కెట్‌లో రూ. 150 నుంచి రూ. 180 వరకు విక్రయించవచ్చు.
ప్రతి ట్రేపై లాభం: ఒక్కో ట్రే విక్రయం మీద మీకు రూ. 30 నుంచి రూ. 40 వరకు నికర లాభం ఉంటుంది.
ఆదాయ అంచనా
ఒకవేళ మీరు మార్కెటింగ్ బాగా చేసి, రోజుకు సుమారు 300 ట్రేలు అమ్మగలిగితే:
రోజువారీ లాభం: రూ. 9 వేల నుంచి రూ. 12 వేల వరకు ఉంటుంది.
నెలవారీ ఆదాయం: అన్ని ఖర్చులు పోను నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది.
వ్యాపారాన్ని ఎక్కడెక్కడ చేయవచ్చు
ఈ వ్యాపారంలో రాణించాలంటే మీ నెట్‌వర్క్‌ను ఈ ప్రాంతాల్లో వృద్ది చేయాలి..
- హోటళ్లు, రెస్టారెంట్లు.
- బేకరీలు, స్వీట్ షాపులు.
- సూపర్ మార్కెట్లు, కిరాణా స్టోర్స్.
- స్కూల్, కాలేజీ హాస్టళ్లు.
- జిమ్స్, ఫిట్‌నెస్ సెంటర్లు.
తక్కువ రిస్క్, స్థిరమైన ఆదాయం
ఎగ్స్ హోల్‌సేల్ బిజినెస్ అనేది తక్కువ రిస్క్, స్థిరమైన ఆదాయం ఇచ్చే వ్యాపారం. సరైన మార్కెటింగ్, నాణ్యమైన సరఫరా ఉంటే, అతి తక్కువ కాలంలోనే ఈ వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకోవచ్చు.

