- Home
- Business
- Post Office: ఈ పథకంలో పెట్టుబడి పెడితే డబ్బులకు డబ్బులు కాస్తాయి.. డబుల్ పైసా వసూల్
Post Office: ఈ పథకంలో పెట్టుబడి పెడితే డబ్బులకు డబ్బులు కాస్తాయి.. డబుల్ పైసా వసూల్
Post Office: కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే రిస్క్ లేకుండా పక్కా రిటర్న్స్ వచ్చే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పత్ర (KVP) స్కీమ్ ఒకటి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ అంటే ఏంటి?
కిసాన్ వికాస్ పత్ర అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పొదుపు పథకం. ఈ స్కీమ్‌లో పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటుతో పెట్టిన మొత్తం 115 నెలల్లో డబుల్ అవుతుంది. రిస్క్ తీసుకోవాలనుకోని వారికి ఇది విశ్వసనీయమైన పథకం.
ఎంత పెట్టుబడి పెట్టొచ్చు.?
ఈ స్కీమ్‌లో రూ.1000తోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తం అవసరం లేదు. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా సమీప పోస్టాఫీస్‌కు వెళ్లి ఖాతా తెరవచ్చు. ఒక వ్యక్తి ఒంటరిగా పెట్టుబడి పెట్టవచ్చు. లేదా జాయింట్ అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు.
ముందస్తు విత్‌డ్రా అవకాశం
పెట్టుబడి అంటే డబ్బు లాక్ అవుతుందేమో అనే భయం చాలామందికి ఉంటుంది. ఈ విషయంలో KVP స్కీమ్ కొంత ఊరటనిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి చేసిన తేదీ నుంచి 30 నెలల తర్వాత అవసరం వస్తే ముందుగానే డబ్బు తీసుకోవచ్చు. దీంతో అకస్మాత్తుగా ఖర్చులు వచ్చినా పెట్టుబడిదారులకు ఇబ్బంది ఉండదు.
115 నెలల్లో డబ్బు డబుల్
ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం వడ్డీ ప్రకారం పెట్టిన మొత్తం 9 సంవత్సరాలు 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే 115 నెలల తర్వాత, డాక్ఘర్ నుంచి రూ. 10 లక్షలు పొందుతారు. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు.
ఎవరికి ఉపయోగపడుతుంది.?
భద్రత, గ్యారంటీ రిటర్న్, ప్రభుత్వ భరోసా కావాలనుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ సరైన మార్గం. రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల చదువు, భవిష్యత్తు అవసరాల కోసం ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా ఆదాయం పొందొచ్చు.

