Post Office Scheme: 5 ఏళ్లలో రూ.35 లక్షలు సంపాదించే ఛాన్స్!
Post Office Scheme: మీరు డబ్బులు పొదుపు చేయాలనుకుంటున్నారా? లేదా ఎలాంటి రిస్క్ లేకుండా కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్ చేసి భారీ మొత్తంలో రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ పోస్టాఫీస్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. ఇంతకీ ఆ పథకమేంటీ? వాటి వివరాలేంటీ?
- FB
- TW
- Linkdin
Follow Us

పోస్టాఫీస్ స్పెషల్ స్కీమ్
మీరు డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నారా? ఎలాంటి రిస్క్ లేని సేఫ్, సింపుల్ ప్లాన్ కోసం వెతుకుతుంటే? మీకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ బెస్ట్ ఆప్షన్. ఈ పథకంలో నెలవారీ క్రమ పద్ధతిలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని రిటర్న్స్ పొందవచ్చు. ఎటువంటి మార్కెట్ రిస్కు ఉండదు. 5 ఇయర్స్ టెన్యూర్‌తో, ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేటు కూడా లభిస్తుంది. ఈ స్కీమ్ వివరాలు మీ కోసం.
ఆర్థిక భద్రత
ఐదు సంవత్సరాల ఈ పథకంలో మీరు ఆర్థిక భద్రతను పొందవచ్చు. పోస్టాఫీస్ ఆర్డీకి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ప్రతి నెలా చిన్నమొత్తంలో పెట్టుబడి పెడితే.. 5 ఏండ్ల తర్వాత.. మీ పెట్టుబడిని వడ్డీతో పాటు తిరిగి పొందవచ్చు. గ్యారెంటీడ్ రిటర్న్స్ కోరుకునే అందరికీ ఇది బెస్ట్ ఆప్షన్.
మార్కెట్ ముప్పు లేకుండా
పోస్ట్ ఆఫీస్ RD పథకం 5 ఏళ్ల పొదుపు కాలానికి అందుబాటులో ఉంటుంది. ఇది తక్కువ మదుపుతో నెలనెలా పొదుపు చేయదలచిన వారికి అనువైన ఎంపిక. మార్కెట్ ముప్పు లేకుండా, భద్రమైన ఆదాయం అందించే ఈ పథకం ద్వారా భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చు.
స్థిరమైన ఆదాయం
నెలకు కేవలం ₹100తో పోస్ట్ ఆఫీస్ RD పథకాన్ని ప్రారంభించవచ్చు. మీ ఆర్థిక స్థోమతను బట్టి మీరు ఈ మొత్తం పొందవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి అవసరం లేకుండా, చిన్నచిన్న మొత్తాలను క్రమంగా పొదుపు చేయడానికి ఇది అద్భుతమైన మార్గం. జీతన జీవులు, గృహిణులు, చిన్న వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరికీ ఇది అనువైన పొదుపు పథకం. ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజలకు ఇది భద్రమైన, స్థిరమైన ఆదాయ మార్గం అవుతుంది.
ఎవరు అర్హులు?
పోస్ట్ ఆఫీస్ RD ఖాతాలో 10 ఏళ్ల పైబడిన వారు కూడా స్వయంగా పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ల కోసం తల్లిదండ్రులు లేదా వారి కస్టోడియన్లు సహాయంతో ఖాతా ప్రారంభించవచ్చు. వారు 18 ఏళ్లకు చేరిన తర్వాత, KYC వివరాలను అప్‌డేట్ చేసి స్వయంగా ఖాతాను కొనసాగించవచ్చు. RD అకౌంట్ ఓపెన్ చాలా సులభం. బెసిక్ డాక్యుమెంట్లతోనే ఖాతా ఓపెన్ చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ ఖాతాను మొబైల్ యాప్ లేదా ఇ-బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా కూడా నిర్వహించవచ్చు.
డిపాజిట్ రూల్స్
పోస్టాఫీస్ ఆర్డీ (RD) అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. అకౌంట్ తెరిచేటప్పుడు మీరు మొదటి వాయిదాను డిపాజిట్ చేయాలి. మీరు నెల 16వ తేదీకి ముందు అకౌంట్‌ను తెరిస్తే, తర్వాతి వాయిదాలు 15వ తేదీ లోపు చెల్లించాలి. 16 తేదీకి ముందు అకౌంట్‌ను తెరిస్తే, తదుపరి వాయిదా ప్రతి నెల 15వ తేదీలోపు చెల్లించాలి. పొదుపుతో పాటు అవసరమైన సమయాల్లో డిపాజిట్‌పై 50% వరకు లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉంది. ఇది అత్యవసర నిధుల అవసరాన్ని తీర్చడంలో ఉపయుక్తంగా ఉంటుంది.
ఆదాయం ఎలా పొందుతారు ?
పోస్ట్ ఆఫీస్ ఆర్డీ (Recurring Deposit)పై వడ్డీ ఆదాయాన్ని ఎలా పొందవచ్చంటే? ఉదాహరణకు.. నెలకు రూ.50,000 చొప్పున 5 సంవత్సరాలు రెగ్యులర్‌గా డిపాజిట్ చేస్తే, మొత్తం పెట్టుబడి రూ.30 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై సుమారు రూ.5.68 లక్షల వడ్డీ లభించి, మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.35.68 లక్షలుగా అందుతుంది.