MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Post Office Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 411 కడితే.. రూ. 43 లక్షలు!

Post Office Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 411 కడితే.. రూ. 43 లక్షలు!

Post Office PPF Scheme: మీరు సురక్షితమైన, పన్ను మినహాయింపు గల, స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే PPF స్కీమ్ బెస్ట్ ఛాయిస్. ఈ పథకంలో రోజుకు కేవలం ₹411పెట్టుబడి పెడితే  43.60 లక్షలు పొందవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు. 

2 Min read
Author : Rajesh K
Published : Aug 02 2025, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గేమ్‌చేంజర్ ప్లాన్..
Image Credit : Getty

గేమ్‌చేంజర్ ప్లాన్..

Post Office PPF Scheme: మీరు సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి కోసం చూస్తున్నారా? పన్ను మినహాయింపు కలిగిన దీర్ఘకాలిక పెట్టుబడి కోసం వెతుకుతున్నవారికి పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ బెస్ట్ ఆప్షన్. భారత ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఈ పథకంలో రోజుకు కేవలం ₹411, అంటే నెలకు ₹12,500 పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తర్వాత ₹43.60 లక్షల మెచ్యూరిటీ అమౌంట్ పొందే అవకాశముంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిపిఎఫ్ పథక విశేషాలు:
Image Credit : Getty

పిపిఎఫ్ పథక విశేషాలు:

PPF ఖాతా 15 ఏళ్ల సంవత్సరాల పాటు నడుస్తుంది. ప్రస్తుతం 7.9% వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. సంవత్సరానికి రూ. 500 నుండి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టండి. ఉదాహరణకు సంవత్సరానికి రూ. 1.5 లక్షలు (నెలవారీగా రూ. 12,500 లేదా రోజుకు రూ. 411) డిపాజిట్ చేయడం వల్ల స్కీమ్ మెచ్యూరిటీ సమయానికి ఏకంగా రూ. 43.60 లక్షలు మీ ఖాతాలో జమ అవుతుంది. ఇందులో వడ్డీ రూ. 21.10 లక్షలు. ఈ మొత్తం పూర్తిగా పన్ను రహితమైనదిగా సెక్షన్ 80C కింద లభిస్తుంది

35
మూలధన భద్రత
Image Credit : Getty

మూలధన భద్రత

 పిపిఎఫ్ పథకం పెట్టుబడిదారులకు పూర్తి భద్రత కల్పిస్తుంది. ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకం మూలధన నష్టానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు డిపాజిట్ చేసిన మొత్తం, సంపాదించిన వడ్డీ రెండూ పన్ను మినహాయింపు పొందవచ్చు. జీతం పొందేవాళ్లు, చిన్న వ్యాపారులు, లేదా పిల్లల భవిష్యత్తు లేదా పదవీ విరమణ కోసం ముందస్తు ప్రణాళిక వేసుకునే వారికి బెస్ట్ స్కీమ్ ఇది.

45
వినియోగదారుల సౌలభ్యం:
Image Credit : our own

వినియోగదారుల సౌలభ్యం:

PPF ఖాతాను తెరవడం, నిర్వహించడం చాలా సులభం. డబ్బును ఏకకాలంలో లేదా నెలవారీగా/వార్షికంగా (గరిష్ఠంగా 12 వాయిదాలలో) చెల్లించవచ్చు. అయితే ఖాతాను యాక్టివ్‌గా ఉండాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. ఒక వ్యక్తి తన పేరుపై మాత్రమే ఖాతా తెరవచ్చు. ఉమ్మడి ఖాతాలు అనుమతించబడవు. ప్రత్యేక రుణ సౌకర్యం పొందడం ఈ ప్లాన్ ప్రత్యేకత. అత్యవసర సమయాల్లో అంటే 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం మధ్యకాలంలో రుణ సౌకర్యం పొందవచ్చు.

55
నిమిషాల్లో డిజిటల్ డిపాజిట్:
Image Credit : our own

నిమిషాల్లో డిజిటల్ డిపాజిట్:

సులభమైన లావాదేవిల కోసం పోస్ట్ ఆఫీస్ IPPB (ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) యాప్ లేదా DakPay ద్వారా ఆన్‌లైన్ డిపాజిట్స్ చేయవచ్చు. మీ ఖాతాను లింక్ చేయండి, మీ PPF వివరాలను నమోదు చేయండి. కేవలం కొన్ని క్లిక్‌లలో నిధులను బదిలీ చేయవచ్చు. మీరు మంచి రాబడి, పన్ను ప్రయోజనాలతో సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడిని కోరుకుంటే.. PPF పథకంలో పెట్టుబడి పెట్టడం మేలు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Post Office Plan: ఈ పోస్టాఫీసు పథకం ద్వారా రూ. 16 లక్షలు పొందే అవకాశం..ఏం చేయాలో తెలుసుకోండి..?
Recommended image2
Post Office Scheme: 5 ఏళ్లలో రూ.35 లక్షలు సంపాదించే ఛాన్స్‌!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved