MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate: మళ్లీ యుద్ధ మేఘాలు...సోమవారం పసిడి ప్రియులకు భారీ షాక్ తప్పదా?

Today Gold Rate: మళ్లీ యుద్ధ మేఘాలు...సోమవారం పసిడి ప్రియులకు భారీ షాక్ తప్పదా?

Today Gold Rate: మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్‌కు చేరగా... బంగారం ధరలు మాత్రం ఊహించని విధంగా తగ్గాయి. సోమవారం మార్కెట్లు తెరుచుకున్నాక మళ్లీ భారీ షాక్ తప్పదా?

2 Min read
Author : Nandini Arava
Published : Aug 01 2026, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
Image Credit : Getty

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య... దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. సాధారణంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధరలు పెరగడం చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం శనివారం మార్కెట్‌లో ధరలు కొద్దిగా దిగివచ్చాయి. ముందుగా తాజా ధరల విషయానికి వస్తే...శనివారం ఉదయం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,220గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.380 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,32,200గా ఉంది. ఇది కూడా రూ.350 తగ్గింది. ఈ తగ్గుదల పెద్దది కాకపోయినా... మార్కెట్ దృష్టి మాత్రం ఇప్పుడు పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలపైనే ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత
Image Credit : iSTOCK

ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. సముద్ర మార్గాల భద్రత, చమురు రవాణా, సైనిక కదలికలు... ఇవన్నీ ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలుగా మారాయి. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... అమెరికా ఇరాన్‌లోని విద్యుత్ మౌలిక సదుపాయాలు, పవర్ ప్లాంట్లు, రిఫైనరీలపై లక్ష్యిత దాడుల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు.

Related Articles

Related image1
Gold Price Hike: ఇంకా చల్లారని యుద్ధ మంటలు..బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు
Related image2
Gold Price Hike: పరుగులు పెడుతున్న బంగారం..పూర్తిగా తగ్గని అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
34
చూస్తూ ఊరుకోం
Image Credit : iSTOCK

చూస్తూ ఊరుకోం

అమెరికా తీసుకునే ఏకపక్ష చర్యలకు తాము ప్రతిస్పందిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో ప్రపంచ మార్కెట్లు మరింత అప్రమత్తంగా మారాయి.అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బంగారం ధరలు ఎందుకు తగ్గాయి అనే సందేహం చాలా మందికి వస్తోంది. దీనికి ప్రధాన కారణం... శనివారం దేశీయ బులియన్ మార్కెట్‌లో సాధారణ ట్రేడింగ్ మాత్రమే ఉండటం, అలాగే అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం. పెట్టుబడిదారులు కూడా సోమవారం మార్కెట్లు తెరుచుకునే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

44
అందుకే ప్రస్తుతం ధరల్లో పెద్ద మార్పు కనిపించలేదు
Image Credit : x.com/IDF

అందుకే ప్రస్తుతం ధరల్లో పెద్ద మార్పు కనిపించలేదు

కానీ ఒకవేళ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే... ప్రపంచవ్యాప్తంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పైకి వెళ్లే అవకాశాన్ని విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. అదే సమయంలో... పరిస్థితులు చర్చల ద్వారా సద్దుమణిగితే లేదా పెద్ద ఎత్తున సైనిక చర్యలు జరగకపోతే... ధరల్లో స్థిరత్వం లేదా స్వల్ప మార్పులు కనిపించే అవకాశం కూడా ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే
Recommended image2
Gold Price Hike: పరుగులు పెడుతున్న బంగారం..పూర్తిగా తగ్గని అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
Recommended image3
Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే
Related Stories
Recommended image1
Gold Price Hike: ఇంకా చల్లారని యుద్ధ మంటలు..బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు
Recommended image2
Gold Price Hike: పరుగులు పెడుతున్న బంగారం..పూర్తిగా తగ్గని అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved