- Home
- Business
- Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
పీఎంఎఫ్ఎంఈ ((Pradhan Mantri Formalisation of Micro Food Processing Enterprises)) స్కీమ్ ద్వారా పచ్చళ్లు, స్నాక్స్, మసాలా వంటి ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలు చేసేందుకు 35% సబ్సిడీ (రూ.10 లక్షల వరకు) పొందవచ్చు.

ఇకపై వ్యాపారం మొదలుపెట్టడం చాలా ఈజీ..!
భారతీయ వంటకాలు, ఫుడ్ ఐటమ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ముఖ్యంగా తెలుగువాళ్ళ పచ్చళ్లు, మసాలా పొడులు, స్నాక్స్ వంటివాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. ఇప్పటికే అనేకమంది ఈ బిజినెస్ లో చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు.
అయితే చాలామంది మహిళలు, యువతకు వంటలు చేసే నైపుణ్యం ఉన్నా.. పెట్టుబడి, సరైన గైడెన్స్ లేక వ్యాపారం చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. ఈ పరిస్థితిని మార్చి చిన్న తరహా ఫుడ్ బిజినెస్ చేసేవారిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్' (PMFME) అనే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఫుడ్ బిజినెస్‌పై ఆసక్తి ఉన్నవారికి ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక సాయం, టెక్నికల్ సపోర్ట్ అందిస్తోంది మోదీ సర్కార్.
PMFME స్కీమ్ ద్వారా ఆర్థిక సాయం
పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా వ్యాపారులకు పెట్టుబడి కష్టాలు తప్పుతాయి. ప్రాజెక్ట్ ఖర్చులో 35% సబ్సిడీని (గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు) కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ సబ్సిడీ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
లబ్ధిదారులు కేవలం 10% పెట్టుబడి పెడితే చాలు…. మిగతా మొత్తాన్ని జాతీయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే ప్రభుత్వం లోన్‌గా ఇప్పిస్తుంది. అంతేకాదు ఈ స్కీమ్‌ను క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌లతో అనుసంధానం చేసింది... కాబట్టి బ్యాంకులు అడిగే కఠినమైన ష్యూరిటీలు, తాకట్టు నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది. లోన్ కూడా ఈజీగా వస్తుంది.
PMFME స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తుంది?
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆసక్తి ఉన్న ఎవరికైనా ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తోంది. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులు ఈ స్కీంకి అప్లై చేసుకోవచ్చు. వీరితో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs), ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (FPOs), కో-ఆపరేటివ్ సొసైటీలకు ఈ స్కీమ్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా పల్లెలు, పట్టణాల్లో ఇప్పటికే చిన్న స్థాయిలో ఫుడ్ బిజినెస్ చేస్తున్న భార్యాభర్తలు, మహిళలు, యువత తమ వ్యాపారాన్ని అధికారికంగా రిజిస్టర్ చేసుకుని పెద్ద స్థాయికి తీసుకెళ్లడానికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది.
ఎలాంటి వ్యాపారాలు మొదలుపెట్టొచ్చు?
ఈ PMFME స్కీమ్ కింద రకరకాల ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు. మార్కెట్లో మన సంప్రదాయ వంటకాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఈ కింది వ్యాపారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
- నోరూరించే మామిడి, నిమ్మకాయ పచ్చళ్లు, వడియాల తయారీ.
- రకరకాల మసాలా పొడులు, గరం మసాలా, ఇంట్లో వాడే మసాలా మిక్స్‌ల తయారీ.
- మురుకులు, చెక్కలు, మిక్చర్ లాంటి సంప్రదాయ స్నాక్స్ తయారీ.
- బేకరీ ఐటమ్స్, బ్రెడ్, బిస్కెట్ల తయారీ.
- పాలు, పాల ఉత్పత్తులైన పన్నీర్, నెయ్యి, కోవా తయారీ.
- చిరుధాన్యాలతో (మిల్లెట్స్) చేసే మోడ్రన్, హెల్తీ ఫుడ్ ఐటమ్స్ తయారీ.
PMFME స్కీమ్ అదనపు ప్రయోజనాలు, టెక్నికల్ సపోర్ట్
ఈ పిఎంఎఫ్ఎమ్ఈ స్కీమ్ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, వ్యాపారాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడపడానికి కావాల్సిన చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్లు (FSSAI Registration/License) పొందడానికి సహాయం చేస్తుంది… బ్రాండ్ నేమ్, ప్యాకేజింగ్ డెవలప్ చేసుకోవడానికి గైడెన్స్ ఇస్తుంది. మోడ్రన్ మిషన్లు ఎలా వాడాలో టెక్నికల్ ట్రైనింగ్ కూడా ప్రభుత్వం అందిస్తుంది. దీనివల్ల మనం తయారు చేసే ప్రొడక్ట్స్ లోకల్ మార్కెట్‌లోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈజీగా అమ్ముకునేలా క్వాలిటీ పెరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
PMFME స్కీమ్‌కు అప్లై చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు.ముందుగా www.pmfme.mofpi.gov.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ (Project Report) లాంటి డాక్యుమెంట్లతో అప్లికేషన్ ఫిల్ చేయాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏవైనా డౌట్స్ ఉంటే, దగ్గర్లోని జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) లేదా జిల్లా మేనేజ్‌మెంట్ ఆఫీస్‌ను సంప్రదించి సరైన గైడెన్స్ తీసుకోవచ్చు. మీకు వంట చేయడం వచ్చినా, ఫుడ్ బిజినెస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నా.. దాన్ని కేవలం చిన్న పనిగా వదిలేయకండి. ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని వాడుకుని మీ సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని ఈరోజే మొదలుపెట్టండి!

