MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold ETF: రిస్క్ లేకుండా ఎక్కువ లాభాలు కావాలంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయండి. ఇవిగో టిప్స్

Gold ETF: రిస్క్ లేకుండా ఎక్కువ లాభాలు కావాలంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయండి. ఇవిగో టిప్స్

Gold ETF: మీరు రిస్క్ లేకుండా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే బంగారం ధర బాగా పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల స్టాక్ మార్కెట్ కంటే బంగారమే ఇన్వెస్టర్లకు బాగా నచ్చుతోంది. ఇది రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ అని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. గోల్డ్  ETFలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 09 2025, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) అంటే ఏంటి?

గోల్డ్ ఈటీఎఫ్ (Gold Exchange-Traded Fund) అనేది స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అయ్యే ఒక ప్రత్యేకమైన మ్యూచువల్ ఫండ్. ఇది ఫిజికల్ గోల్డ్‌ను ప్రత్యామ్నాయ పెట్టుబడి రూపంగా అందిస్తుంది. దీన్ని ఈజీగా కొనొచ్చు, అమ్మొచ్చు. గోల్డ్ ETFని స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైనా కొని, ఎప్పుడైనా అమ్మేసి లాభం పొందొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్ ఎందుకంటే..

ఫిజికల్ గోల్డ్‌ను బ్యాంకులో లేదా లాకర్‌లో పెడితే ఫీజు కట్టాలి. ఇంట్లో పెడితే దొంగల భయం. కానీ గోల్డ్ ETFకి అలాంటి ఇబ్బందేం లేదు. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ యూనిట్స్‌కు స్టోరేజ్ కాస్ట్ ఏమీ ఉండదు. ఇది డీమాట్ అకౌంట్‌తో లింక్ అయి ఉంటుంది. దీనివల్ల వచ్చే లాభాన్ని ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్‌కు మార్చుకోవచ్చు.

35

మేకింగ్ ఛార్జెస్ అవసరం లేదు

మీరు ETF రూపంలో డిజిటల్ బంగారం కొన్నప్పుడు, బంగారు నగల మేకింగ్ ఛార్జ్ గురించి టెన్షన్ పడక్కర్లేదు. జనరల్‌గా బంగారు నగల మేకింగ్ కాస్ట్ 15-20% వరకు ఉండొచ్చు. గోల్డ్ ETFలో ఇది ఉండదు. అందువల్ల డబ్బులు కలిసి వస్తాయి. ఆ డబ్బులను మళ్లీ గోల్డ్ ETFలోనే ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి.

45

తక్కువ డబ్బులతోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు

మీ దగ్గర తక్కువ డబ్బులున్నా గోల్డ్ ETF కొనొచ్చు. చిన్న చిన్న యూనిట్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు 1 గ్రామ్ ఫిజికల్ బంగారం కొనాలంటే దాదాపు 8,500 రూపాయలు ఇవ్వాలి. కానీ గోల్డ్ ETF 500-1,000 రూపాయలు లేదా 100-200 రూపాయల్లో కూడా కొనొచ్చు. ధర పెరిగినప్పుడు వెంటనే అమ్మేసుకోవచ్చు. 

55

బంగారం ధర చెక్ చేసుకుంటూ ఉంటే చాలు

బంగారం ధరను కనిపెట్టడం చాలా ఈజీ. మీరు గోల్డ్ ETFలో ఇన్వెస్ట్ చేస్తే, ప్రతిరోజు దీని పర్ఫార్మెన్స్ చూడొచ్చు. అది ఎంత పైకి లేదా కిందకు వస్తుందో చూడొచ్చు. దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుందో మీకు తెలుస్తుంది. ఇది ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చాలా క్లియర్‌గా ఉంటుంది. మీ అవసరాలు, తగిన సమయంలో అమ్ముకుంటే మంచి లాభాలు పొందొచ్చు. 

ఇది కూడా చదవండి  మీ పాత బంగారు నగలు కొత్త వాటిలా మెరవాలంటే.. ఇంట్లోనే ఇలా చేయండి

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image2
Post Office MIS: ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే ప్రతీ నెల మీ ఖాతాల్లోకి రూ. 16,650 వస్తాయి.. ఏం చేయాలంటే.?
Recommended image3
Foot Massager: మ‌సాజ్ కోసం ఎక్క‌డికి వెళ్లాల్సిన ప‌నిలేదు.. జ‌స్ట్ రూ. 4 వేల‌తో ఇంట్లోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved