MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Nita Ambani: నీతా అంబానీ సొంత ఆస్తులు ఏంతో తెలుసా? ఊహకు కూడా అందదు, ప్రపంచంలోనే రిచ్‌ లేడీ

Nita Ambani: నీతా అంబానీ సొంత ఆస్తులు ఏంతో తెలుసా? ఊహకు కూడా అందదు, ప్రపంచంలోనే రిచ్‌ లేడీ

ఇండియాలోనే నెంబర్‌ కుభేరుడు ముఖేష్‌ అంబానీ భార్య నీతా అంబానీకి సొంతంగా ఆస్తులున్నాయి. లావిష్ లైఫ్‌ ఆమె సొంతం. మరి ఆమెకి ఉన్న ఆస్తులు ఎంతో తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 14 2026, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచ కుభేరుడి భార్య నీతా అంబానీ
Image Credit : instagram/@officenitaambani

ప్రపంచ కుభేరుడి భార్య నీతా అంబానీ

భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో అంబానీ కుటుంబం ఒకటి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిగానే కాకుండా, విద్య, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ వంటి రంగాల్లోనూ ఆమె యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ ఆస్తులు, ఆదాయ వనరులు, ఆమె నిర్వహిస్తున్న సంస్థల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఆస్తులకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. అవి ఆశ్చర్యపరుస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రిలయన్స్ ఫౌండేషన్‌తో ప్రత్యేక గుర్తింపు
Image Credit : instagram/@officenitaambani

రిలయన్స్ ఫౌండేషన్‌తో ప్రత్యేక గుర్తింపు

నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, క్రీడలు, విపత్తుల సమయంలో సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌తో పాటు విద్యారంగంలోనూ ఆమెకు కీలక పాత్ర ఉంది.

ముఖేష్‌ అంబానీ వ్యాపారాల్లో దూసుకుపోతుంటే, నీతా అంబానీ మాత్రం సర్వీస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అదే సమయంలో డౌన్‌ టూ ఎర్త్ ఉంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మరి నీతా అంబానీకి ఆస్తులు ఎంత? ఆమె సొంతంగా ఆస్తులున్నాయా? అనేది చూస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

35
నీతా అంబానీ సొంత ఆస్తులు
Image Credit : instagram/@officenitaambani

నీతా అంబానీ సొంత ఆస్తులు

నీతా అంబానీకి సొంతంగా వేల కోట్ల ఆస్తులున్నాయి. ఆమె వేసుకొనే నెక్లెస్‌ ధరనే ఐదు వందల కోట్లు ఉండటం విశేషం. ఆమె ఈవెంట్లలో, ఫంక్షన్స్ లో ధరించే ఎమరాల్డ్ నెక్లెస్‌ ధరనే ఏకంగా రూ.400-500కోట్లు ఉంటుందని సమాచారం. అంతేకాదు సొంతంగా ప్రైవేట్‌ జెట్‌ కూడా ఉంది. ఎయిర్‌ బస్‌ ఏ319 విమానం ఉంది. దీని విలువ ఏకంగా రూ.240కోట్లు ఉంటుందట. అలాగే పది కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్‌ కుల్లినన్‌ కారు ఉంది.

రూ.2.6కోట్ల హిమాలయ బిర్కిన్‌, కోటిన్నర విలువ చేసే నోరిటాకే టీ సెట్‌ ఇలా చాలా ఉన్నాయట. అలాగే పింక్‌ డైమాండ్ తో ఫాల్కన్‌ సూపర్‌నోవా ఐ ఫోన్‌ 6 ఉంది. దీని విలువ రూ.396కోట్లు ఉంటుందట. అలాగే ఐపీఎల్‌ ముంబయి టీమ్‌కి కో హోనర్‌గా ఉన్నారు. వీటితోపాటు ఇతర వ్యాపారాలు కలుపుకొని సొంతంగా నీతా అంబానీకి ఏకంగా రూ.2510కోట్ల వరకు ఆస్తులుంటాయట. మొత్తంగా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనికమైన లేడీగా నిలిచారు.

45
క్రీడలు, కళలు, వ్యాపార రంగాల్లోనూ..
Image Credit : instagram/@officenitaambani

క్రీడలు, కళలు, వ్యాపార రంగాల్లోనూ..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు సహ యజమానిగా నీతా అంబానీ గుర్తింపు పొందారు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ అభివృద్ధిలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. 2016లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2024లోనూ ఆమె ఐఓసీ సభ్యురాలిగా తిరిగి ఎన్నికయ్యారు.

55
నీతా అంబానిలోని అదర్‌ సైడ్‌
Image Credit : instagram/@officenitaambani

నీతా అంబానిలోని అదర్‌ సైడ్‌

కళలు, భారతీయ సంస్కృతిని అంతర్జాతీయంగా ప్రోత్సహించడంలోనూ ఆమె ఆసక్తి చూపుతున్నారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు తొలి భారతీయ గౌరవ ట్రస్టీగా గుర్తింపు పొందడం ఆమె ప్రయాణంలో మరో ముఖ్యమైన అంశం.

ఖరీదైన దుస్తులు, ఆభరణాలు, ప్రత్యేక కార్యక్రమాలతో నీతా అంబానీ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఆమెను కేవలం విలాసవంతమైన జీవనశైలితో మాత్రమే చూడలేం. విద్య, ఆరోగ్యం, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో నిర్వహిస్తున్న బాధ్యతలు కూడా ఆమె వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగంగా చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉంది?
Recommended image2
Indian Rupee: ఇండియా కాకుండా రూపాయి చెల్లే ఇతర దేశాలు ఏవో తెలుసా?
Recommended image3
జెన్‌జీలు ఇలాంటి సిప్ప‌ర్‌ల‌లో నీళ్లు ఎందుకు తాగుతున్నారు.? అస‌లు వీటి ఉప‌యోగం ఏంటి?
Related Stories
Recommended image1
Chiranjeevi: నాకు కులపిచ్చి ఉంటే చిరంజీవి మెగాస్టార్‌ అయ్యేవాడు కాదు.. సీనియర్‌ హీరో సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved