MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Nikhil Kamath: పర్‌ప్లెక్సిటీ ఏఐలో ఇంటర్న్‌షిప్ చేస్తానంటున్న నిఖిల్ కామత్

Nikhil Kamath: పర్‌ప్లెక్సిటీ ఏఐలో ఇంటర్న్‌షిప్ చేస్తానంటున్న నిఖిల్ కామత్

Nikhil Kamath: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ నిఖిల్ కామత్ తన సోదరుడు నితిన్ కామత్‌తో కలిసి జెరోధా (Zerodha) అనే ఆన్‌లైన్ స్టాక్ బ్రోకరేజ్ సంస్థను స్థాపించాడు. ఇది భారత్ లో అత్యంత విజయవంతమైన బ్రోకరేజ్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 27 2025, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

Nikhil Kamath: జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ WTF ఆన్‌లైన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ పర్‌ప్లెక్సిటీ AIలో ఇంటర్నింగ్‌పై తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. తన ప్రస్తుత రోజువారి ప‌నుల‌కు మించి మరింత నేర్చుకోవాలనే కోరికను వ్య‌క్తంచేస్తూ కృత్రిమ మేధస్సు రంగంలో మ‌రింత నేర్చుకోవ‌డానికి మూడు నెలల పాటు జీతం లేకుండా పని చేయడానికి సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు.

నిఖిల్ కామత్ స్వయంగా హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో పర్‌ప్లెక్సిటీ AI సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ ఉన్నారు. తాను మూడు నెల‌ల పాటు ఉచితంగానే పర్‌ప్లెక్సిటీలో ఇంటర్న్ చేయడం విష‌యం పై స్పందించాడు. తన ప్రస్తుత ప్రయత్నాలలో తగినంతగా నేర్చుకోవడం లేదని తాను భావిస్తున్నాననీ, AIలో మ‌రింత‌ లోతుగా వెళ్లాల‌నుకుంటున్న‌ట్టు చెప్పాడు.

కామత్ ఆసక్తిని అభినందిస్తూ, శ్రీనివాస్ ఈ ఆలోచనను స్వాగతించారు, ఆయనను ఇందులో చేర్చుకోవడం గౌరవంగా ఉంటుందని అన్నారు. కామత్ తన సిగ్నేచర్ హాస్యంతో, రాబోయే 30 రోజుల్లో పర్‌ప్లెక్సిటీలో  శ్రీనివాస్‌ను ప్రతిరోజూ "పీస్టర్" చేయడానికి హాజరు కావచ్చని అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

ఈ క్ర‌మంలోనే శ్రీనివాస్ బెంగళూరులో తన ఇంటర్న్‌షిప్ విష‌యాలు కూడా గుర్తుచేసుకున్నాడు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జిల్లాల్లో ఒకటైన కోరమంగళలో మూడు వారాలు పనిచేశాడు. నగరంలో ఎంతో హడావిడి ఉంటున్న‌ప్ప‌టికీ తన దృష్టి పూర్తిగా పనిపైనే ఉన్నందున అతను పెద్దగా అన్వేషించలేదని ఒప్పుకున్నాడు. ఆ సమయాన్ని గుర్తుచేసుకుంటూ, బెంగళూరును మరింత పూర్తిగా అనుభవించే అవకాశాన్ని తాను కోల్పోయానని చెప్పాడు. ట్రాఫిక్ అప్ప‌ట్లో కూడా ఇప్ప‌టిలాగే ఉండేద‌ని అన్నాడు. ఇంట్లోనే ఉండి పని చేయడం తెలివైన ఎంపిక కావచ్చు అని కూడా చ‌మ‌త్క‌రించాడు. 

అలాగే, చెన్నైలోని వేడి, తేమతో కూడిన పరిస్థితులతో పోలిస్తే బెంగళూరులోని వాతావరణం తనపై సానుకూల ప్ర‌భావం చూపింద‌ని శ్రీనివాస్ పేర్కొన్నాడు. చెన్నై కంటే ఇక్క‌డి వాతావరణం ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంద‌ని అన్నాడు. 

ఏఐ రంగంలో పెరుగుతున్న అవ‌కాశాలు, పోటీని ప్ర‌స్తావించారు. AI పోటీ దారుల మ‌ధ్య వేగ‌వంత‌మైన ప్ర‌గ‌తి, పోటీ ఉన్న‌ప్ప‌టికీ  ChatGPT, ఆంత్రోపిక్, జెమిని, గ్రోక్, మెటా AI, పర్‌ప్లెక్సిటీ AIతో సహా చాలా ప్రముఖ చాట్‌బాట్‌ల ప్రధాన సామర్థ్యాలు చాలా సారూప్యంగా ఉన్నాయన్నారు. సెర్చ్ భాగం మినహా చాలా AI మోడల్‌లు సాధారణ మూల్యాంకన కొలమానాలు, బెంచ్‌మార్క్‌లపై దృష్టి పెట్టడం వల్ల ఇలాంటి సమాధానాలను అందిస్తున్నాయని శ్రీనివాస్ వివరించారు. ప్రస్తుతం ప్రధాన పోటీదారుల మ‌ధ్య ఎక్కువ గుణాత్మక వ్యత్యాసం లేదన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పర్సనల్ పైనాన్స్
సాంకేతిక వార్తలు చిట్కాలు
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved