Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • New Financial year: ఏప్రిల్‌ 1 నుంచి భారీగా మార్పులు.. మన రోజువారి జీవితంపై చూపే ప్రభావం ఏంటంటే

New Financial year: ఏప్రిల్‌ 1 నుంచి భారీగా మార్పులు.. మన రోజువారి జీవితంపై చూపే ప్రభావం ఏంటంటే

ఏప్రిల్‌ నెలలోకి ఎంట్రీ ఇచ్చేశాం. అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా పలు మార్పులు చేర్పులు జరుగుతాయని తెలిసిందే. మరి ఈసారి ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.? ఇవి మన రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

Narender Vaitla | Published : Apr 01 2025, 10:08 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

ఆదాయపు పన్ను:

* రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు.

* ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు రూ.75,000 వర్తిస్తుంది, దీంతో రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించనుంది. ఈ పరిమితిని మించి ఉన్న వారికి పన్ను శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు.

గృహ రుణాలు :

* ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పెద్ద నగరాల్లో రూ.50 లక్షల వరకు, మధ్య తరహా నగరాల్లో రూ.45 లక్షల వరకు, చిన్న పట్టణాల్లో రూ.35 లక్షల వరకు రుణాలు ప్రాధాన్య రంగ రుణాలుగా అందించనున్నారు. 
 

23
Asianet Image

యూపీఐ  మొబైల్ నంబర్ మార్పు:

గత 12 నెలలుగా ఉపయోగించని మొబైల్ నంబర్లకు అనుసంధానంగా ఉన్న యూపీఐ ఐడీలు నేటి నుంచి పనిచేయవు. కొత్త నంబరు కోసం బ్యాంకులో లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

వడ్డీ ఆదాయంపై టీడీఎస్: 

సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్ష వరకు టీడీఎస్ వర్తించదు.

ఆధార్ - పాన్ లింకింగ్ ప్రభావం: 

ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయకపోతే ఏప్రిల్‌ 1 నుంచి డివిడెండ్ల రూపంలో ఆదాయం అందదు. టీడీఎస్‌ రేటూ పెరుగుతుంది. పన్ను వసూలు చేసినప్పటికీ, అది ఫామ్‌ 26 ఏఎస్‌లో కనిపించదు.

విదేశీ ప్రయాణం:

విదేశీ ప్రయాణం, పెట్టుబడులపై టీసీఎస్‌ పరిమితి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరిగింది. 
 

33
Asianet Image

కేవైసీ, నామినీ వివరాలు:

డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్లకు కేవైసీ వివరాలను మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది. నామినీ వివరాలు ధృవీకరించాలి.

హోటళ్లు, రెస్టారెంట్లు: 

రూ.7,500 కంటే ఎక్కువ గది అద్దె ఉన్న హోటళ్లలో రెస్టారెంట్ సేవలపై 18% జీఎస్టీ వర్తిస్తుంది. 

ఆదాయపు పన్ను రిటర్న్ గడువు: 

అప్‌డేటెడ్‌ రిటర్నుల గడువు 12 నెలల నుంచి 48 నెలలకు పెరిగింది. 

చెక్కు చెల్లింపులు: 

రూ.50,000కు మించి చెక్కు చెల్లింపులకు ఎలక్ట్రానిక్ విధానంలో వివరాలు సమర్పించాలి. బ్యాంకు ధృవీకరణ తర్వాత మాత్రమే చెక్కు చెల్లింపు జరుగుతుంది. 

యులిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ): 

రూ.2.5 లక్షలకు పైగా ప్రీమియం చెల్లించిన యులిప్‌ను వెనక్కి తీసుకున్నప్పుడు వచ్చిన లాభంపై పన్ను చెల్లించాలి. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
పర్సనల్ పైనాన్స్
జీవనశైలి
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 
Recommended Stories
Top Stories