MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Government Schemes పెట్టుబడికి ఇవే టాప్ ప్రభుత్వ పథకాలు.. ఇంతకు మించి వడ్డీ మరెక్కడా దొరకదు!

Government Schemes పెట్టుబడికి ఇవే టాప్ ప్రభుత్వ పథకాలు.. ఇంతకు మించి వడ్డీ మరెక్కడా దొరకదు!

పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్మును అధిక రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు జనం. దాంతోపాటు పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండాలని కూడా  కూడా కోరుకుంటారు. అందుకు అనువుగా ఉండే 10 ప్రభుత్వ పథకాల పూర్తి వివరాలు మీకందిస్తున్నాం. వీటిపై పూర్తి అవగాహన ఉంటే పొదుపులో మీరు దూసుకెళ్లిపోవచ్చు.

2 Min read
Author : Anuradha B
Published : Apr 05 2025, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది చాలా మంచిది. స్థిరమైన రాబడి ఉంటుంది. చాలా మంది దీని మీద ఆధారపడతారు. 7-8% వడ్డీ అందిస్తారు. ఈ రాబడిపై పన్ను ఉండదు. ఎంత ఎక్కువ కాలం మదుపు చేస్తే కంపౌండింగ్ వడ్డీ అంత ఎక్కువగా వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
సుకన్య సమృద్ధి యోజన (SSY)

సుకన్య సమృద్ధి యోజన (SSY)

ఈ పథకం ఆడపిల్లలకు ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ప్రారంభించారు. 7.6% వరకు వడ్డీ ఇస్తారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇది చాలా ముఖ్యమైనది. అమ్మాయిలు  చిన్న వయసు ఉన్నప్పటి నుంచే దీన్ని మొదలు పెట్టొచ్చు.

310
అటల్ పెన్షన్ యోజన (APY)

అటల్ పెన్షన్ యోజన (APY)

పదవీ విరమణ చేసిన వారినుద్దేశించి ఈ పథకం ప్రారంభించారు. ఇది రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇస్తుంది. డబ్బులు కట్టేవాళ్ళు 60 ఏళ్ళు వచ్చాక నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. మలి వయసులో ఆర్థిక భరోసానిచ్చే పథకం ఇది. 

410
జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)

జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)

దీర్ఘకాలంలో మంచి రాబడి పొందాలంటే ఈ పథకంలో డబ్బులు పెట్టవచ్చు. పైగా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో ఈక్విటీ, డెట్ పెట్టుబడులు ఉంటాయి. ఎక్కువ రాబడి వస్తుంది. ఇన్వెస్టర్లు తమకు నచ్చినట్లు డబ్బులు పెట్టొచ్చు. దీని ద్వారా 10-12% రాబడి వస్తుంది. 

510
కిసాన్ వికాస్ పత్ర (KVP)

కిసాన్ వికాస్ పత్ర (KVP)

ఎలాంటి రిస్కు లేకుండా పదేళ్లలో పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావాలంటే దీన్ని  ఎంచుకోవచ్చు. ఇది ఫిక్స్‌డ్ రిటర్న్ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్టర్లు పెట్టిన డబ్బు 10 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. ఇది చాలా మంచి పెట్టుబడి. టెన్షన్ ఫ్రీగా ఉంటుంది.

610
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మంచి రాబడి కావాలంటే ఈ పథకం ఎంచుకోవచ్చు. రిటైర్ అయిన వాళ్లకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. దీనిలో 8.2% వడ్డీ ఇస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ తీసుకోవచ్చు. ఇది రిటైర్ అయిన వాళ్లకి చాలా ఉపయోగపడుతుంది.

710
ప్రధానమంత్రి వయా వందన యోజన (PMVVY)

ప్రధానమంత్రి వయా వందన యోజన (PMVVY)

భారతీయ జీవిత బీమా సంస్థ నిర్వహించే స్కీమ్ ఇది.  సీనియర్ సిటిజన్స్ కోసం ఉద్దేశించి ప్రారంభించారు. 60 ఏళ్లు పైబడిన ఎవరికైనా ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది.  దీనిలో 7.4% వడ్డీ ఇస్తారు. నెలకి, మూడు నెలలకి లేదా ఏడాదికి పెన్షన్ తీసుకోవచ్చు. కనీసం 15 లక్షలు పెట్టాలి అనేది నియమం.

810
లాడ్లీ లక్ష్మి యోజన

లాడ్లీ లక్ష్మి యోజన

లాడ్లీ లక్ష్మి యోజన ప్రత్యేకంగా  ఆడపిల్లల కోసం ప్రారంభించారు. ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్, హర్యానాలో ఉంది. అమ్మాయిల చదువు, పెళ్లి సమయంలో డబ్బులు అందేలా ఈ పథకం ఉంటుంది.

910
పోస్టాఫీస్ నెలసరి ఆదాయ పథకం (POMIS)

పోస్టాఫీస్ నెలసరి ఆదాయ పథకం (POMIS)

నెలకు కొంత ఆదాయం కావాలనుకునే వాళ్లకి ఇది మంచిది. దీనిలో 7.4% వడ్డీ ఇస్తారు. మనం పెట్టిన పెట్టుబడి ఆధారంగా వడ్డీ అందుతుంది.

1010
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)

ఇది మహిళల కోసం ప్రత్యేకంగా మొదలైన పథకం. కేవలం  2 ఏళ్లలో పూర్తవుతుంది. దీనిలో 7.5% వడ్డీ ఇస్తారు. స్వల్పకాలంలో ఇది చాలా మంచి పెట్టుబడిగా  భావిస్తారు. 

గమనిక: ఈ రిపోర్ట్ సమాచారం కోసం మాత్రమే. మీరు డబ్బులు పెట్టే ముందు ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు
పర్సనల్ పైనాన్స్
జీవనశైలి
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image2
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Recommended image3
Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved