7 Seater Cars: 7 సీటర్ కార్లలో బెస్ట్ కార్లు ఇవే. పెద్ద కుటుంబాలు పర్ఫెక్ట్ సెలక్షన్
Top 7 Seater Cars: పెద్ద ఫ్యామిలీనా? 7 సీటర్ కారు కొనేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న నాలుగు 7 సీటర్ కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సమాచారం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓసారి పరిశీలించండి.

7 సీట్ల కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కుటుంబంలో కనీసం ఆరుగురు ఉంటున్నాయి. అందుకే బడ్జెట్ లో లభించే 7 సీట్ల కార్లు కొనేందుకు ఎక్కువమంది ఆస్తకి చూపిస్తున్నారు. ఎక్కువ మంది ప్రయాణీకులతో తరచుగా ప్రయాణించే వారికి MPV సెగ్మెంట్ కార్లు పర్ఫెక్ట్ గా ఉంటాయి. భారతదేశంలో ఎక్కువ సేల్స్ అవుతూ వినియోగదారులకు ఫేవరేట్ గా ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా బొలెరో నియో, కియా కారెన్స్, రెనాల్ట్ ట్రైబర్ వంటి కార్ల ఫీచర్స్, ధరలు ఇప్పుడు తెలుసుకుందాం.
రెనాల్ట్ ట్రైబర్
మీరు గాని తక్కువ బడ్జెట్ లో కారు కొనాలని అనుకుంటే రెనాల్ట్ ట్రైబర్ కరెక్ట్ సెలక్షన్ అవుతుంది. ఇది 999cc పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 72 bhp, 96 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, AMT ఎంపికలతో ట్రైబర్ లభిస్తుంది. కారులో చివరి వరుసను మడిచినప్పుడు 625 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, నాలుగు ఎయిర్‌బ్యాగులు, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి. ఈ కారు ధర రూ.6.10 లక్షల నుండి రూ.9.02 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.
మహీంద్రా బొలెరో నియో
బొలెరో నియో స్టైలిష్ లుక్ కలిగిన 7 సీటర్ కారు. మహీంద్రా కంపెనీ రిలీజ్ చేసిన ఈ మోడల్ 100 bhpచ 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5L డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పని చేస్తుంది. కారు లోపల 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు తదితర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. EBDతో కూడిన ABS, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర రూ.9.95 లక్షల నుండి ప్రారంభమై రూ.12.16 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయి.
కియా కారెన్స్
కియా కారెన్స్ కారు 6,7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజన్ ఎంపికలను అందిస్తుంది. కారు లోపల 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సింగిల్ ప్యానెల్ సన్‌రూఫ్, తదితర చక్కటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయానికొస్తే ఆరు ఎయిర్‌బ్యాగులు, TPMS, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని ధర రూ.10.60 లక్షల నుండి ప్రారంభమై రూ.19.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఎర్టిగా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన MPV లలో ఒకటి. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 101.6 bhp, 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభిస్తుంది. ఎర్టిగా CNG వేరియంట్‌లో కూడా అందించబడుతుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 6 స్పీకర్ ఆడియో సిస్టమ్, నాలుగు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ముఖ్యమైన భద్రతా ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ.8.84 లక్షల నుండి రూ.13.13 లక్షల వరకు ఉంది.