Money:ఈ సింపుల్ ట్రిక్ మీ జీవితాన్నే మార్చేస్తుంది
Money:డబ్బు సంపాదిస్తున్నారు, కానీ డబ్బు చేతిలో నిలవడం లేదా? జీతం పెరుగుతోంది.. కానీ ఆర్థిక భద్రతపెరగడం లేదా? డబ్బు ఎక్కడ పోతోంది? ఇదే చాలామందికి తెలియడం లేదు. అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

సంపాదన ఉంది… ప్లానింగ్ లేదు
మనదేశంలో కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు . జీతాలు తీసుకుంటున్నారు. అయినా నెలాఖరుకు డబ్బు సరిపోవడం లేదని చాలా మంది సతమతమైపోతారు. సమస్య సంపాదనలో కాదు, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా దాచుకోవాలి, ఎలా రెట్టింపుచేసుకోవాలనే విషయం మనకు ఎవ్వరూ సరిగా నేర్పకపోవడమే. చదువుకునే సమయంలో డబ్బు ఎలా సంపాదించాలో చెప్పారు కానీ... దాన్ని ఖర్చు చేయాలో చెప్పలేదు. అంతేకాదు చెప్పే పాఠాల్లోనూ దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ లోపమే ఈరోజు మన ఆర్థిక భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపిస్తోంది.
ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు ముఖ్యం?
డబ్బును ఎలా ఖర్చుపెట్టాలన్నదానిపై చాలా మందికి క్లారిటీ. వచ్చిన జీతాన్నంతా EMI, Loan,సేవింగ్స్, గ్రోసరీస్ పేరుతో ఖర్చుపెడతారు. అలా చేస్తే..డబ్బు వృథా కావడం ఖాయం. దానికి కూడా ఓ పద్ధతి, ఓ విజన్, ఓ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ప్రకారమే డబ్బు ఉపయోగిస్తున్నామంటే పప్పులో కాలేసినట్లే. అందుకే ఎక్కువమంది ప్రజలు Money విషయంలో ఈ 7 పాఠాలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇవి గనుక మీరు నేర్చుకుంటే...మీ భవిష్యత్తుకు తిరుగులేదు.
పిల్లలకు మనీ ప్లానింగ్ పాఠాలు నేర్పించండి
మొదట మీరు చేయాల్సిన పని నేర్చుకోవడం, More Money విషయంలో మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలి. తర్వాత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి. రిస్క్ తో కూడిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం కంటే ముందు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌తో మొదలుపెట్టడం మంచిది.
రెండోది తర్వాత మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ నేర్పాలి. డబ్బు అలవాట్లు నేర్పించడానికి ఇదే వాళ్లకు బెస్ట్ టైమ్. ఒకవేళ మీరు పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నట్లైతే.. ఈ చిన్న ఫార్ములా పాటించండి. వాళ్లకు ఇచ్చిన డబ్బును 3 భాగాలుగా విభజించండి. 33% ఖర్చు కోసం, 33% దాచుకోవడానికి, 33% భవిష్యత్తు అవసరాల కోసం..ఇలా స్ప్లిట్ చేయండి. ఈ చిన్న ట్రిక్ వాళ్ల ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది.
50/30/20 రూల్ ఏం చెప్తోంది?
మరో విషయం ఏంటంటే..50/30/20 బడ్జెట్ రూల్. మీ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించండి. 50% అవసరాలకు అంటే ఇల్లు, భోజనం, ఇంటి బిల్లుల కోసం ఉపయోగించండి. 30% షాపింగ్, ట్రావెలింగ్ కోసం ఉపయోగించండి. 20% సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, రిటైర్ మెంట్ ప్లానింగ్ కోసం పెట్టుకోండి. ఈ చిన్న ట్రిక్.. డబ్బు కంట్రోల్‌లో ఉంచడానికి, భవిష్యత్తుకు ప్లాన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.అయితే చాలా మంది ఈ ట్రిక్ ఫాలో అవ్వరు. చివరకు డబ్బు ఎక్కడ పోయిందో అని కంగారు పడతారు.
ఈ తేడా మీరే గమనించండి
రాహుల్ అనే వ్యక్తి 2016లో రూ.18.50లక్షలకు కారు కొన్నాడు. డౌన్ పేమేంట్ రూ.లక్షా50వేలు పెట్టారు. ఆరేళ్లలో నెలకు రూ.20వేలు చొప్పున EMI కట్టారు. అదే అమన్ అనే వ్యక్తి రూ. లక్షా50వేలకు సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఆరేళ్లలో నెలకు రూ. 20వేలు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. పెరిగిన కారు ధరల వల్ల రాహుల్ కు రూ.4.50లక్షలు మిగిలింది. కానీ అమన్ మాత్రం ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల ఈ ఆరేళ్లలో ఆయన చేతికి రూ.16లక్షలు వచ్చాయి. పెద్ద లాభం చూశారు.
అయితే రాహుల్ ఉండేది అద్దె ఇల్లు, దానికి నెలకు రూ. 25 వేలు చొప్పున పే చేస్తున్నాడు. ఏడాదికి 5 శాతం అద్దె పెరిగేది. అలా రెంట్ కడుతూ ఉండటం వల్ల పదేళ్లలో అద్దె కోసమే రూ.39లక్షలు కట్టారు..రాహుల్. కానీ కునాల్ అనే వ్యక్తి మాత్రం రూ. 60లక్షల విలువైన ఇంటిని కొన్నాడు, దానికి నెలకు రూ.48వేలు చొప్పున పదేళ్లు EMI కట్టారు. మొత్తం పదేళ్లలో రూ.57, 60,000 EMI పే చేశారు. ఇప్పుడదే పదేళ్ల తర్వాత కొన్న ఇంటి విలువ రెట్టింపు అయింది. రూకోటి 20లక్షలు అయింది. పదేళ్లకు ముందు ఇంటిని రూ.60లక్షలకు కొనడం వల్ల ఇప్పడు కునాల్ రూ.62,40,000 సంపాదించుకోగలిగారు. రాహుల్ మాత్రం రూ.39 లక్షలు నష్టపోయారు.
ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్ ఉండాలి మరి..
సో మనం తెలుసుకోవల్సింది ఏంటంటే...డబ్బు ఎలా ఖర్చుపెడుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. అందుకే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. విద్యార్థి దశలోనే పిల్లలకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించాలి. ఆదాయమార్గాలే కాకుండా పొదుపు, పెట్టుబడులు, స్టాక్స్ వంటివి నేర్పించాలి. అదే వారికి బలమైన పునాది. భవిష్యత్ నిర్ణయాలు సులువుగా తీసుకోగలుగుతారు. మీ పిల్లలకు ఇప్పటినుంచే నేర్పిస్తారు కదూ.
గమనిక: ఈ కథనం సాధారణ ఆర్థిక అవగాహన కోసం మాత్రమే. ఎందులో అయినా పెట్టుబడులు పెట్టేముందు.. నిపుణులను సంప్రదించండి

