ఒక్క రోజు EMI మిస్ అయితే ఏం జరుగుతుంది.? వేలల్లో నష్టం తప్పదు..
EMI: బ్యాంక్ ఖాతాలో సరిపడ బ్యాలెన్స్ లేకపోవడం, లేదా తేదీ మరిచిపోవడం వల్ల EMI పేమెంట్ మిస్ అవుతుంటాయి. కానీ ఈ చిన్న తప్పు మీ క్రెడిట్ స్కోర్‌పై భారీ ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒకరోజు ఆలస్యం కూడా క్రెడిట్ స్కోర్‌ను పడేస్తుంది
రాజుకి హౌసింగ్ లోన్ ఉంది. అప్పటి వరకు సమయానికి ఈఎమ్ఐ చెల్లిస్తూ వచ్చాడు. అయితే ఒక నెలలో EMI చెల్లింపులో జాప్యం రావడంతో అతని CIBIL స్కోర్ 799 నుంచి 772కు పడిపోయింది. అంటే 27 పాయింట్ల నష్టం. తర్వాతి నెలలో సమయానికి EMI చెల్లించినా స్కోర్ మళ్లీ పెరగలేదు. అంటే ఒకరోజు తప్పిదం కూడా స్కోర్‌పై దీర్ఘకాల ప్రభావం చూపుతుంది.
వడ్డీ ఎక్కువవుతుంది
EMI మిస్ అయితే బ్యాంకు వెంటనే జరిమానా వేస్తుంది. అయితే ఈ పెనాల్టీ తక్కువగానే ఉన్నా.. ఒక్కసారి పెనాల్టీ పడిందంటే దాని ప్రభావం క్రెడిట్ స్కోర్‌పై పడుతుంది. దీంతో భవిష్యత్తులో తీసుకునే రుణాల వడ్డీపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఎస్‌బీఐలో టాప్ అప్ హోమ్‌లోన్‌కు CIBIL 760 ఉంటే వడ్డీ రేటు 9.10%గా ఉంటుంది. అదే సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉంటే వడ్డీ 9.30% పడుతుంది. ఈ చిన్న మార్పు వల్ల మీరు వేల రూపాయాల్లో అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎక్కువ రోజుల ఆలస్యమైతే మరింత నస్టం
ఈఎమ్ఐ చెల్లించడం ఆలస్యమైనకొద్దీ ప్రభావం మరింత పెరుగుతుంది. ఎన్ని చెల్లింపులు స్కిప్ అయ్యాయి, ఎన్ని రోజులు ఆలస్యమయ్యాయి, మొత్తం ఎంత బకాయి ఉంది. వటి అంశాలు స్కోర్‌ను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఒక నెల ఈఎమ్ఐ చెల్లించకపోతే సిబిల్ స్కోర్ 65 పాయింట్లు మరింత తగ్గి 707కి పడిపోతుంది. అంటే ఒక నెలలో మొత్తం 92 పాయింట్ల పతనం అన్నమాట.
EMI మిస్ అయితే వెంటనే ఏమి చేయాలి?
బ్యాంకులు సాధారణంగా SMS, ఇమెయిల్ ద్వారా వెంటనే అలర్ట్ పంపుతాయి. కొన్నిసార్లు స్పెషల్ లింక్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేసే అవకాశం కూడా ఇస్తారు.
* EMI మిస్ అయ్యిందంటే తక్షణమే చెల్లించాలి
* లేట్ ఫీజు ఉందో లేదో చెక్ చేయాలి
* లెండర్‌కు సమాచారం ఇవ్వాలి
* భవిష్యత్తులో మిస్ కాకుండా ఆటో డెబిట్ లేదా రిమైండర్‌లు పెట్టుకోవాలి
డిఫాల్ట్ నుంచి స్కోర్ రికవరీకి ఎంత సమయం?
రికవరీ సమయం పూర్తిగా నష్టంపైనే ఆధారపడి ఉంటుంది.
చిన్న డిఫాల్ట్ అయితే 1 నెల
ఎక్కువ ప్రభావం అయితే 6–12 నెలల వరకు పడుతుంది
CRIF నిపుణుల ప్రకారం, స్కోర్ చివరి 36 నెలల క్రెడిట్ చరిత్ర ఆధారంగా లెక్కిస్తారు. కాబట్టి ఒక EMI మిస్ కూడా దీర్ఘకాలంగా రికార్డులో ఉంటుంది.