MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • మహీంద్రా స్కార్పియో కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్: రూ.65,000 వరకు డిస్కౌంట్

మహీంద్రా స్కార్పియో కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్: రూ.65,000 వరకు డిస్కౌంట్

మహీంద్రా స్కార్పియోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. ఇది కొనాలని చాలా మంది లక్ష్యంగా కూడా పెట్టుకుంటారు. మీరు కూడా స్కార్పియో కొనాలనుకుంటే ఇదే మంచి టైమ్. స్కార్పియో ఎన్, క్లాసిక్ మోడళ్లపై రూ.65,000 వరకు డిస్కౌంట్స్ ను మహీంద్రా ప్రకటించింది. ఇది కూడా లిమిటెడ్ ఆఫర్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా? 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 17 2025, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గణాంకాల ప్రకారం మే నెలలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ మహీంద్రా స్కార్పియో. అందుకే మహీంద్రా స్కర్పియో మోడల్స్ పై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్లు ప్రకటించింది.

2024, 2025 మోడల్స్ కు వివిధ తగ్గింపులను కంపెనీ అందిస్తోంది. ఈ నెలలో మీరు స్కార్పియోను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే రూ.65,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మే 31 వరకే ఈ ఆఫర్

గత నెలలో అంటే ఏప్రిల్‌లో 15,534 స్కార్పియోలు అమ్ముడయ్యాయి. మరింత సేల్స్ పెంచుకోవాలని మహీంద్రా కంపెనీ మే 31 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. స్కార్పియో ఎక్స్ షోరూమ్ ధర రూ.13.99 లక్షల నుండి రూ.24.89 లక్షల వరకు ఉంది.

మహీంద్రా స్కార్పియోలో మహీంద్రా థార్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 లాంటి ఇంజిన్ ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ రెండు రకాల ఇంజిన్లు ఉన్నాయి. స్కార్పియో N హై ఎండ్ మోడల్‌లో నాలుగు చక్రాల డ్రైవ్ (4WD) సిస్టమ్ ను కలిగి ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో స్కార్పియో ఐదు స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

Related Articles

Related image1
రూ.20,000 జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 3 కార్లు ఇవే
Related image2
CNG Car: ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లలో టాప్ 5 కార్లు ఇవే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి
35

మహీంద్రా స్కార్పియో స్టైలిష్ డిజైన్..

స్కార్పియో Nలో కొత్త సింగిల్ గ్రిల్ ఉంది. దానిపై క్రోమ్ ఫినిషింగ్ ఉంది. కంపెనీ కొత్త లోగో గ్రిల్‌పై ఉంది. దీనివల్ల ముందు భాగం అందంగా కనిపిస్తుంది. కొత్త డిజైన్ లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్, C-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెక్సాగోనల్ లోయర్ గ్రిల్ ఇన్సర్ట్‌తో కూడిన వైడ్ సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ ఉన్నాయి.

ఈ SUVకి కొత్త డిజైన్ చేయబడిన డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూఫ్ రెయిల్స్, సైడ్ మౌంటెడ్ డోర్లతో కూడిన కొత్త బోనెట్, బూట్‌లిడ్, కొత్త రియర్ బంపర్, కొత్త వర్టికల్ LED టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. 

45

సేఫ్టీ ఫీచర్లు ఇవే..

స్కార్పియోలో కొత్త డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, కొత్త సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, రూఫ్ మౌంటెడ్ స్పీకర్లు, లెదర్ సీట్లు, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, సెంటర్ మౌంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

భద్రత కోసం సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ డిస్క్ బ్రేక్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

55

నోట్: పైన పేర్కొన్న డిస్కౌంట్లు వివిధ వెబ్‌సైట్ల నుండి సేకరించినవి. ఈ తగ్గింపులు రాష్ట్రం, ప్రాంతం, నగరం, డీలర్‌షిప్, లభ్యత, రంగు, వేరియంట్ ను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి కారు కొనుగోలు చేసే ముందు మీ స్థానిక డీలర్‌ను సంప్రదించి కచ్చితమైన డిస్కౌంట్, ఇతర సమాచారాన్ని తెలుసుకోండి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?
Recommended image2
Subhash Chandra: రూ. 22,000 కోట్ల బాకీ రూ. 6 కోట్లకు క్లియర్ ! జీ సుభాష్ చంద్ర కేసులో ఏం జరిగింది?
Recommended image3
Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !
Related Stories
Recommended image1
రూ.20,000 జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 3 కార్లు ఇవే
Recommended image2
CNG Car: ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లలో టాప్ 5 కార్లు ఇవే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved