MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Mahindra: మహీంద్రాకు ఇక తిరుగులేదు.. ఇండియాలో కొత్త డిజైన్ స్టూడియో ప్రారంభం

Mahindra: మహీంద్రాకు ఇక తిరుగులేదు.. ఇండియాలో కొత్త డిజైన్ స్టూడియో ప్రారంభం

Mahindra: భారతదేశ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన కొత్త డిజైన్ స్టూడియోను అధికారికంగా ప్రారంభించింది. దీని ద్వారా ముఖ్యంగా మహీంద్రా కంపెనీ నుంచి మరిన్ని కొత్త మోడల్స్, బెస్ట్ అవుట్‌‌పుట్‌తో వస్తాయని కంపెనీ ప్రకటించింది. కొత్త డిజైన్ స్టూడియో ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 08 2025, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మహీంద్రా అండ్ మహీంద్రా ముంబైలో తన కొత్త డిజైన్ స్టూడియోను అధికారికంగా ప్రారంభించింది. మహీంద్రా ఇండియా డిజైన్ స్టూడియో (MIDS)గా పేరుగాంచిన ఈ యూనిట్ మహీంద్రా నుంచి తయారవుతున్న కొత్త మోడల్స్ మరింత నాణ్యతగా, కొత్త టెక్నాలజీతో తయారయ్యేలా పనిచేస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మహీంద్రా ఇండియా డిజైన్ స్టూడియోను (MIDS)ఇండియాలో 2015లో స్థాపించారు. ఇప్పుడు దీన్ని కొత్త టెక్నాలజీతో అప్ డేట్ చేశారు. ప్రస్తుతం ఇందులో 100 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్త స్టూడియో పరిమాణం, విస్తీర్ణం రెట్టింపు అయింది. దీన్ని బట్టి వెహికల్ డిజైనింగ్ లో టెక్నాలజీ, సౌకర్యాలు కూడా రెట్టింపు అవుతాయని కంపెనీ ప్రకటించింది. ఎందుకంటే కొత్త డిజైన్ స్టూడియోలో వంద మందికి పైగా డిజైన్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా కొత్త మోడల్ వెహికల్ డిజైనింగ్ పైనే పనిచేస్తారు. 
 

34

ముంబైలోని MIDS, UKలోని మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్‌ యూనిట్ తో కలిసి పనిచేస్తుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. 

మహీంద్రా ఇండియా డిజైన్ స్టూడియో ఎందుకోసం పనిచేస్తుంది?

వాణిజ్య, ప్రైవేట్ ఆటో విభాగాలు రెండింటికీ సేవ చేయడానికి కొత్త డిజైన్ స్టూడియో పనిచేస్తుంది. మహీంద్రా వెహికల్స్ కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వ్యాపార విస్తరణలో భాగంగా కొత్త డిజైన్ స్టూడియోను ఆవిష్కరించారు. 

MIDS వాణిజ్య వాహనాలు, చిన్న ట్రాక్టర్లు, ట్రక్కులు, బస్సుల డిజైనింగ్ కూడా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో ట్రక్ క్యాబిన్‌లను నిర్వహించడానికి తగినంత పెద్ద డిజైనింగ్ విభాగం ఉంది. 
 

44

ప్రారంభోత్సవంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డిజైన్, MIDS హెడ్ అజయ్ శరణ్ శర్మ, మహీంద్రా చీఫ్ డిజైన్, క్రియేటివ్ ఆఫీసర్ ప్రతాప్ బోస్  మాట్లాడుతూ కొత్త డిజైన్ యూనిట్ ఇంటర్నల్, ఎక్సటర్నల్ డిజైన్ నుంచి టెక్ HMI డిజైన్ వరకు అన్ని MIDSలోనే చేయవచ్చని తెలిపారు. క్లే మోడల్స్, బాడీ ప్యానెల్స్ కోసం ఇతర కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, సొంత పెయింట్ షాపు ఏర్పాటు చేశామని తెలిపారు. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
భారత దేశం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved