MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్

LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్

Gas Cylinder Rules October 1: అక్టోబర్ 1 నుండి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూల్స్ మారనున్నాయి. బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే డొమెస్టిక్ సిలిండర్‌కు కమర్షియల్ రేట్లు వర్తిస్తాయి. కొత్తగా మారే టాప్ 10 ఎల్పీజీ రూల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 29 2026, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్: కొత్తగా 10 మార్పులు
Image Credit : Chatgpt

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్: కొత్తగా 10 మార్పులు

ప్రతి నెలా లాగే అక్టోబర్ లో కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, పీఎన్‌జీ వినియోగదారులకు సంబంధించిన అనేక కీలక నిబంధనల్లో మార్పులు రాబోతున్నాయి. గ్యాస్ ధరల సమీక్ష నుండి బుకింగ్, రీఫిల్ రూల్స్ వరకు అన్నీ మారనున్నాయి. ఇండియన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ వాడే ప్రతి ఒక్కరిపై ఈ ప్రభావం పడనుంది. ముఖ్యంగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను అక్టోబర్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అంశంగా మార్చింది. ఇది ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులతో పాటు సాధారణ వినియోగదారులకూ వర్తిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కమర్షియల్ రేట్లే
Image Credit : Asianet News

ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే కమర్షియల్ రేట్లే

పీఎమ్‌యువై లబ్ధిదారులు, సాధారణ వినియోగదారులు ఇద్దరూ తమ ఎల్పీజీ కనెక్షన్‌కు ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను పూర్తి చేయాలి. దీనికి పొడిగించిన కొత్త డెడ్‌లైన్ సెప్టెంబర్ 30, 2026తో ముగిసింది. ఎవరైనా ఈ డెడ్‌లైన్ మిస్ అయితే, వారి గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను కమర్షియల్ రేట్ల ప్రకారం అమ్మకానికి ఉంచుతారు.

ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసినవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా జూన్ 30, 2026 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఆ తర్వాత జూలై 31, ఆగస్టు 7, ఆగస్టు 15, ఆగస్టు 23, ఆగస్టు 31, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 14 వరకు పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చారు. చివరికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 19 నాటికి దేశంలోని 274.3 మిలియన్ల (89.9%) మంది యాక్టివ్ వినియోగదారులు బయోమెట్రిక్ పూర్తి చేశారు.

36
పాకెట్‌పై పడే భారం ఎంత? సిలిండర్ ధరల లెక్కలు ఇవే
Image Credit : Chat Gpt

పాకెట్‌పై పడే భారం ఎంత? సిలిండర్ ధరల లెక్కలు ఇవే

సెప్టెంబర్ 30 నాటికి ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే డొమెస్టిక్ సిలిండర్‌కు కూడా కమర్షియల్ ధర చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల మీ బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందో ఈ క్రింది లెక్కల ద్వారా చూడవచ్చు..

• డొమెస్టిక్ ఎల్పీజీ ధరలు (14.2 కేజీలు): ప్రస్తుతం ఢిల్లీలో రూ. 942, ముంబైలో రూ. 941.50, కోల్‌కతాలో రూ. 968, చెన్నైలో రూ. 957.50 గా, హైదరాబాద్ లో రూ. 994.00 గా ఉన్నాయి.

• కమర్షియల్ ఎల్పీజీ ధరలు (19 కేజీలు): ఢిల్లీలో రూ. 2,747.50, ముంబైలో రూ. 2,701, కోల్‌కతాలో రూ. 2,884, చెన్నైలో రూ. 2,916.50 గా ఉన్నాయి.

ఒకవేళ మీరు ఈ-కేవైసీ పూర్తి చేయడంలో విఫలమైతే, ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్‌పై దాదాపు రూ. 1,805.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది (కమర్షియల్ రేటు రూ. 2,747.50 లో నుండి డొమెస్టిక్ రేటు రూ. 942 తీసివేస్తే). అన్ని ప్రధాన నగరాల్లోనూ వినియోగదారులపై ఇదే తరహా భారం పడనుంది.

46
ధరల మార్పులు.. సబ్సిడీ రూల్స్
Image Credit : Gemini AI

ధరల మార్పులు.. సబ్సిడీ రూల్స్

ప్రతి నెలా మొదటి తారీఖున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. సెప్టెంబర్ 2026లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్లపై రూ. 9.50 నుండి రూ. 11.50 వరకు ధరలను పెంచాయి. అంతకుముందు జూలై, ఆగస్టులలో ధరలను తగ్గించారు. అయితే, జూన్ 7 నుండి డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

అక్టోబర్ 1 నుండి బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి కాని వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనాలను నిలిపివేయాలని ఆయిల్ మంత్రిత్వ శాఖ ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలను ఆదేశించింది. సబ్సిడీ నిజమైన అర్హులకు మాత్రమే అందాలని, గృహ వినియోగ సిలిండర్లు కమర్షియల్ అవసరాలకు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులు అథెంటికేషన్ పూర్తి చేసిన వెంటనే సబ్సిడీతో కూడిన రీఫిల్ బుకింగ్ మళ్లీ ప్రారంభమవుతుంది. గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోదు కానీ సబ్సిడీ లేని మార్కెట్ ధరకే లభిస్తుంది.

ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్‌పై సెప్టెంబర్ 2026 నాటికి రూ. 210 సబ్సిడీ ప్రయోజనం ఉంది. జూన్‌లో ఇది రూ. 721 గా ఉండేది. వినియోగదారులకు సరసమైన ధరల్లో గ్యాస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు 2022-23లో రూ. 22,000 కోట్లు, 2025-26, 2026-27 సంవత్సరాలకు రూ. 30,000 కోట్ల పరిహారం ఇస్తోంది. అయినా కూడా ఆగస్టు 31 నాటికి కంపెనీల భారం రూ. 62,000 కోట్లు దాటింది.

ఈ-కేవైసీ ని తిరస్కరించే లేదా చేయలేని వినియోగదారులు కంపెనీల డిజిటల్ పోర్టల్స్, ఆప్, వాట్సాప్ చాట్‌బాట్ లేదా ఐవీఆర్‌ఎస్ ద్వారా తమ ఆప్షన్‌ను నమోదు చేసుకుని, లభ్యతను బట్టి 5 కేజీలు లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్ ధరకు పొందవచ్చు.

56
సిలిండర్ బుకింగ్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల రూల్స్
Image Credit : ANI

సిలిండర్ బుకింగ్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల రూల్స్

గ్రామీణ ప్రాంత వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. రీఫిల్ బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస సమయాన్ని 45 రోజుల నుండి 25 రోజులకు తగ్గించింది. పట్టణ ప్రాంత వినియోగదారులకు మాత్రం బుకింగ్ వ్యవధిని 25 రోజులుగానే ఉంచారు. మరోవైపు, పీఎన్‌జీకి మారే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సెప్టెంబర్ 1న ప్రారంభించిన ప్రోత్సాహక పథకం అక్టోబర్‌లోనూ కొనసాగుతుంది. పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న గృహ వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్‌ను రద్దు చేసుకోవడానికి 30 రోజుల సమయం ఇస్తారు. భవిష్యత్తులో ఒకవేళ పీఎన్‌జీ లేని ప్రాంతానికి మారితే మళ్లీ ఎల్పీజీ కనెక్షన్ పొందేలా ట్రాన్స్‌ఫర్ వోచర్ సదుపాయం కూడా ఇచ్చారు.

మిడిల్ ఈస్ట్ ఆంక్షల వల్ల గ్యాస్ కొరతను నివారించేందుకు మార్చి 2026 నుండి కొత్త ఎల్పీజీ కనెక్షన్లపై విధించిన నిషేధం ఇంకా కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీలు 14.2 కేజీల కొత్త కనెక్షన్లను ఇవ్వడం లేదు.

66
బుకింగ్ అడ్వైజరీ.. ఆధార్ అథెంటికేషన్ ఎలా చేయాలి?
Image Credit : ANI

బుకింగ్ అడ్వైజరీ.. ఆధార్ అథెంటికేషన్ ఎలా చేయాలి?

మార్చి 2026 నుండి అమల్లో ఉన్న "వన్ హౌస్‌హోల్డ్, వన్ కుకింగ్ గ్యాస్" నిబంధన అక్టోబర్‌లోనూ అమల్లో ఉంటుంది. అలాగే, గ్యాస్ డెలివరీ సమయంలో నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్తేనే డెలివరీ పూర్తవుతుంది.

ఈ-కేవైసీ పూర్తి చేయడానికి 3 మార్గాలు ఉన్నాయి..

1. డెలివరీ సమయంలో: గ్యాస్ డెలివరీ బాయ్ వద్ద ఉన్న ఆయిల్ కంపెనీ యాప్ ద్వారా అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు.

2. డిస్ట్రిబ్యూటర్ వద్ద: నేరుగా మీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌కు వెళ్లి ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

3. మొబైల్ యాప్ ద్వారా: ఇండియన్ గ్యాస్ వినియోగదారులు 'IndianOil ONE', భారత్ గ్యాస్ వినియోగదారులు 'HelloBPCL', హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు 'HP PAY' యాప్‌ల ద్వారా స్వయంగా చేసుకోవచ్చు.

వినియోగదారులు అధికారిక యాప్‌లు, ఛానెళ్లను మాత్రమే ఉపయోగించాలి. తెలియని వ్యక్తులు లేదా ఏజెంట్లతో ఆధార్ ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని ప్రభుత్వం హెచ్చరించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్
Recommended image2
Notional Increment: ‘నోషనల్ ఇంక్రిమెంట్’ అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?
Recommended image3
Share Market: ఈ వారం షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు? హెచ్చరిస్తున్న 7 కీలక గ్లోబల్ అంశాలు ఇవే
Related Stories
Recommended image1
Top Selling Cars: ఇండియాలో ఎక్కువగా నడిచే కార్లు ఏవి? ఎందుకు ఈ కార్లను ఎక్కువగా కొంటున్నారు?
Recommended image2
US High Paying Jobs: అమెరికాలో ఏ ఉద్యోగాలకు అత్యధిక జీతం వస్తుంది? భారతీయులకు టాప్ 7 ఆప్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved