MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Share Market: ఈ వారం షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు? హెచ్చరిస్తున్న 7 కీలక గ్లోబల్ అంశాలు ఇవే

Share Market: ఈ వారం షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు? హెచ్చరిస్తున్న 7 కీలక గ్లోబల్ అంశాలు ఇవే

Indian Stock Market: ఈ వారం భారత షేర్ మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్, యూఎస్ బాండ్ ఈల్డ్ సహా 7 గ్లోబల్ ఫ్యాక్టర్లు మార్కెట్‌ను శాసించనున్నాయి.

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 28 2026, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
షేర్ మార్కెట్ బ్యాడ్ న్యూస్.. ఈ వారం భారీగా పడిపోనుందా?
Image Credit : Chatgpt

షేర్ మార్కెట్ బ్యాడ్ న్యూస్.. ఈ వారం భారీగా పడిపోనుందా?

ఈ వారం అంటే సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే ట్రేడింగ్ వారంలో భారత షేర్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురై, నష్టాల్లోకి జారుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, అంతర్జాతీయ సంకేతాలు భారత మార్కెట్ దిశను నిర్దేశించబోతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, దాని వల్ల రికార్డు స్థాయిలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల వంటి ప్రధాన అంశాలు ఈ వారం మన మార్కెట్‌ను శాసించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్‌ఎస్‌ఈ (NSE) విడుదల చేసిన ట్రేడింగ్ క్యాలెండర్ ప్రకారం, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, శుక్రవారం నాడు భారత షేర్ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. గడిచిన వారంలో భారత స్టాక్ మార్కెట్ గత ఆరేళ్లలోనే అత్యంత సుదీర్ఘమైన వారపు నష్టాలను నమోదు చేసింది. క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణం భయాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ వారం భారత షేర్ మార్కెట్ గమనాన్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేయబోతున్న ఆ 7 ముఖ్యమైన కారణాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
105 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్.. యూఎస్-ఇరాన్ తీవ్ర ఉద్రిక్తతలు
Image Credit : AI

105 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్.. యూఎస్-ఇరాన్ తీవ్ర ఉద్రిక్తతలు

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతుండటం భారత మార్కెట్ కు పెద్ద దెబ్బగా మారింది. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన చమురు సరఫరా మార్గమైన హోర్ముజ్ జలసంధి చుట్టూ వివాదం ముదరడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బారెల్‌కు 105 నుంచి 106 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఒకవేళ రెండు దేశాల మధ్య చర్చలు సఫలమై శాంతి లభిస్తే, చమురు ధరలు తగ్గి భారత దిగుమతి బిల్లు భారం తగ్గుతుంది. ఇది రూపాయికి, షేర్ మార్కెట్‌కు ఊరటనిస్తుంది. కానీ ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు మంటల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి మార్కెట్‌లో ఒడిదుడుకులు తారాస్థాయికి చేరుకుంటాయి.

37
ఎఫ్‌ఐఐల మార్కెట్ ఎగ్జిట్.. రూ. 26,000 కోట్ల షేర్ల విక్రయం
Image Credit : stockPhoto

ఎఫ్‌ఐఐల మార్కెట్ ఎగ్జిట్.. రూ. 26,000 కోట్ల షేర్ల విక్రయం

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత క్యాష్ మార్కెట్ నుంచి భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆగస్టు 25 నాటికి ఉన్న గణాంకాల ప్రకారం, ఎఫ్‌ఐఐలు క్యాష్ మార్కెట్‌లో ఏకంగా రూ. 26,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే ప్రాథమిక మార్కెట్ (IPO) పై వారికి నమ్మకం అలాగే ఉంది. అందుకే వారు ప్రైమరీ మార్కెట్‌లో రూ. 8,551 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం గమనార్హం.

మరొకవైపు స్వదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు కొండంత అండగా నిలుస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం..

• డీఐఐ కొనుగోళ్లు: లేటెస్ట్ సెషన్‌లో రూ. 2,838 కోట్లు కాగా, గత 7 రోజుల్లో రూ. 13,601 కోట్లు, గత 30 రోజుల్లో మొత్తం రూ. 57,206 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

• ఎఫ్‌ఐఐ అమ్మకాలు: లేటెస్ట్ సెషన్‌లో రూ. -3,694 కోట్లు నెగెటివ్‌గా ఉండగా, గత 7 రోజుల్లో రూ. -10,914 కోట్లు, గత 30 రోజుల్లో ఏకంగా రూ. -26,517 కోట్ల నిధులను విక్రయించారు.

47
ఐఐపీ, ఫిస్కల్ డెఫిసిట్ డేటా విడుదల
Image Credit : Asianet News

ఐఐపీ, ఫిస్కల్ డెఫిసిట్ డేటా విడుదల

దేశ ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని తెలిపే కీలక గణాంకాలు ఈ వారం వెలువడనున్నాయి. ఆగస్టు నెల పరిశ్రమల ఉత్పత్తి రంగానికి సంబంధించిన ఐఐపీ డేటా, ప్రభుత్వ ఫిస్కల్ డెఫిసిట్ వివరాలను వెల్లడించనున్నారు. దీంతో పాటు 'హెచ్‌ఎస్‌బిసి ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ' డేటా కూడా బయటకు రానుంది.

ఐఐపీ గణాంకాల ద్వారా దేశంలోని తయారీ, మైనింగ్ రంగాల అసలు వేగం ఎంతో తెలుస్తుంది. దీని ఆధారంగానే ఇండస్ట్రియల్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల కదలికలు ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం ఫిస్కల్ డెఫిసిట్ లోటును నియంత్రణలో ఉంచగలిగితే విదేశీ ఇన్వెస్టర్లకు నమ్మకం పెరిగి, భారత మార్కెట్లోకి తిరిగి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

57
5.2 శాతానికి యూఎస్ బాండ్ ఈల్డ్స్.. భారత్ నుంచి విదేశీ నిధుల తరలింపు?
Image Credit : Asianet News

5.2 శాతానికి యూఎస్ బాండ్ ఈల్డ్స్.. భారత్ నుంచి విదేశీ నిధుల తరలింపు?

యూఎస్ బాండ్ మార్కెట్ వేగం భారత మార్కెట్‌కు పెద్ద ముప్పుగా పరిణమించింది. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్ ఏకంగా 5.2 శాతం సమీపానికి చేరుకుంది. అమెరికాలో బాండ్ ఈల్డ్స్, డాలర్ రెండు బలపడటం అంటే విదేశీ ఇన్వెస్టర్లకు ఏ విధమైన రిస్క్ లేకుండా అమెరికాలోనే ఎక్కువ రాబడి లభిస్తుంది.

దీనివల్ల వారు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని స్వదేశానికి తరలిస్తారు. ఎఫ్‌ఐఐల ఈ విక్రయాల ఒత్తిడి కారణంగానే భారత స్టాక్ మార్కెట్ పై తీవ్రమైన నెగెటివ్ ప్రభావం పడవచ్చు.

67
రూపాయి కదలికలు, గ్లోబల్ ఎకనామిక్ డేటా
Image Credit : Asianet News

రూపాయి కదలికలు, గ్లోబల్ ఎకనామిక్ డేటా

డాలర్‌తో పోలిస్తే రూపాయి 24 పైసలు బలపడి 95.75 వద్ద ముగిసింది. అయితే చమురు కంపెనీల నుంచి డాలర్లకు ఉన్న విపరీతమైన డిమాండ్, ఎఫ్‌ఐఐల అమ్మకాల వల్ల రూపాయిపై మళ్లీ ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకపోతే ఆర్‌బీఐ (RBI) సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల కొంతవరకు మార్కెట్‌లో తీవ్రమైన హెచ్చుతగ్గులు అదుపులోకి వచ్చాయి.

దీంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి అమెరికా నుంచి వచ్చే కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ JOLTS జాబ్ ఓపెనింగ్స్ గణాంకాలు, యూరోజోన్ సెప్టెంబర్ ద్రవ్యోల్బణ డేటా ఈ వారం విడుదల కానున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల దిశను స్పష్టం చేయడానికి సాయపడతాయి.

77
ఐపీఓల పండగ: మార్కెట్ నుంచి రూ. 1,292 కోట్లు సమీకరించనున్న 20 కంపెనీలు
Image Credit : ChatGPT

ఐపీఓల పండగ: మార్కెట్ నుంచి రూ. 1,292 కోట్లు సమీకరించనున్న 20 కంపెనీలు

ప్రైమరీ మార్కెట్ ఈ వారం చాలా సందడిగా ఉండబోతోంది. మొత్తం 20 కంపెనీలు ఐపీఓ ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టి రూ. 1,292 కోట్లను సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. మెయిన్‌బోర్డ్ విభాగంలో ఎస్‌ఆర్‌ఐటి ఇండియా, విశాల్ నిర్మితి, నిత్యాస్ జెమ్స్ అండ్ జ్యువెలరీ, షా ఇన్వెస్టర్స్ హోమ్ కంపెనీలు కలిసి రూ. 595 కోట్లు సేకరించనున్నాయి. ఇక ఎస్‌ఎమ్‌ఈ విభాగంలో 16 చిన్న తరహా కంపెనీలు మార్కెట్ నుంచి దాదాపు రూ. 697 కోట్లను సమీకరించడానికి ప్లాన్ చేస్తున్నాయి.

శుక్రవారం ముగింపు ఎలా ఉందంటే?

గత వారంలోని చివరి ట్రేడింగ్ రోజైన సెప్టెంబర్ 25, శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 315 పాయింట్లు లాభపడి 73,896 వద్ద క్లోజ్ అయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 77 పాయింట్లు పుంజుకుని 23,141 వద్ద ముగిసింది. గత వారం ముగింపు సానుకూలంగా ఉన్నప్పటికీ, ఈ కొత్త వారంలో పైన చెప్పుకున్న 7 అంతర్జాతీయ అంశాల వల్ల మార్కెట్‌లో హెచ్చుతగ్గులు తప్పవని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. రూ.2,500కు పైగా తగ్గిన బంగారం
Recommended image2
Price Hike: పండుగ సీజన్‌లో షాకింగ్ న్యూస్.. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలకు రెక్కలు.. అసలు కారణం ఇదే
Recommended image3
Bank Strike: కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకుల సమ్మె వాయిదా.. అక్టోబర్ 2న కొత్త తలనొప్పి
Related Stories
Recommended image1
Price Hike: పండుగ సీజన్‌లో షాకింగ్ న్యూస్.. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలకు రెక్కలు.. అసలు కారణం ఇదే
Recommended image2
Bank Strike: కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకుల సమ్మె వాయిదా.. అక్టోబర్ 2న కొత్త తలనొప్పి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved