MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Business Idea : కేవలం సాయంత్రం రెండుమూడు గంటలే వ్యాపారం.. అయినా నెలకి రూ.30 వేలు సంపాదించవచ్చు

Business Idea : కేవలం సాయంత్రం రెండుమూడు గంటలే వ్యాపారం.. అయినా నెలకి రూ.30 వేలు సంపాదించవచ్చు

ఉడికించిన పప్పులు (సెనగలు, బెబ్బర్లు, పెసర్లు వంటివి) అమ్మే వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చిపెట్టే ఒక మంచి స్వయం ఉపాధి. సరైన ప్లానింగ్, ప్రత్యేకమైన మసాలాతో నెలకు రూ.30,000 వరకు సులభంగా సంపాదించవచ్చు.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 02 2026, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ బిజినెస్ ఐడియా
Image Credit : Gemini AI

సూపర్ బిజినెస్ ఐడియా

చాలామంది సాయంత్రంపూట సరదాగా కుటుంబసభ్యులు లేదంటే పిల్లలతో బయటకు వెళుతుంటారు. ఇలా విశాఖపట్నం వంటి నగరాల్లో అయితే బీచ్ కు, హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే పార్కులకు వెళుతుంటారు. ఈ సమయంలో ఓ చిన్న టేబుల్ పై ఉడికించిన పప్పులు (గుడాలు లేదా మొలకెత్తిన విత్తనాలు) అమ్ముతూ కొంతమంది యువత కలిపిస్తుంటారు. అయితే ఇది చూడటానికి చిన్న వ్యాపారంలా అనిపించినా, తక్కువ పెట్టుబడితో రోజూ మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. సరిగ్గా ప్లాన్ చేసి ఈ బిజినెస్‌తో నెలకు రూ.30,000 వరకు సంపాదించేవాళ్లు ఉన్నారు. మీరుకూడా చిన్నగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఈ బిజినెస్ ట్రై చేయవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తక్కువ పెట్టుబడి... ఎక్కువ లాభాలు
Image Credit : Gemini AI

తక్కువ పెట్టుబడి... ఎక్కువ లాభాలు

ఉడికించిన పప్పుల వ్యాపారంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ తక్కువ పెట్టుబడే. 

ప్రారంభ పెట్టుబడి : ఒక చిన్న తోపుడు బండి లేదా టేబుల్, స్టీల్ గిన్నెలు, స్టవ్, ముడిసరుకులకు (శనగలు, బఠాణీ, మసాలాలు) కలిపి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు చాలు. 

లాభం :  పప్పుల ఉడికించడానికి (మసాలా, గ్యాస్ ఖర్చులతో కలిపి) సుమారు రూ.80 నుంచి రూ.100 ఖర్చవుతుంది. దాన్ని చిన్న ప్లేట్లలో అమ్మితే రూ.300 నుంచి రూ.400 వరకు వస్తుంది. అంటే ఇందులో 60% నుంచి 70% నికర లాభమే ఉంటుంది.

Related Articles

Related image1
Business Ideas : మీరు సొంతూళ్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించాలా..? ఈ 5 బిజినెస్ లలో ఏదో ఒకటి ట్రై చేయండి
Related image2
Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్
35
ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా?
Image Credit : Getty

ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా?

రోజుకు సగటున 50 ప్లేట్ల ఉడికించిన పప్పులు అమ్ముతున్నారనుకోండి. ఒక ప్లేట్ ధర రూ.30 అనుకుంటే..

రోజువారీ ఆదాయం: 50 x రూ.30 = రూ.1,500. 

రోజువారీ లాభం (60%): రూ.900 

నెలవారీ లాభం: రూ.900 x 30 రోజులు = రూ.27,000 నుంచి రూ.30,000 వరకు. 

సాయంత్రం 4 నుంచి రాత్రి 7-8 గంటల వరకు అంటే రోజుకి 3-4 గంటలు కష్టపడితే ఈ ఆదాయం సంపాదించవచ్చు.

45
వ్యాపార ప్రదేశం చాలా ముఖ్యం
Image Credit : Freepik

వ్యాపార ప్రదేశం చాలా ముఖ్యం

సాయంత్రం పూట జనం ఎక్కువగా ఉండే బస్టాండ్లు, పార్కులు, స్కూళ్లు/కాలేజీలు లేదా థియేటర్ల దగ్గర బండి పెట్టాలి. 

శుభ్రత: ఈ రోజుల్లో జనం రుచి కన్నా శుభ్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. చేతులకు గ్లౌజులు, తలకు క్యాప్ పెట్టుకుని, ఈగలు వాలకుండా ఉడికించిన పప్పులు అమ్మాలి. మూసివుంచిన గాజు బాక్సులో వీటిని పెట్టి అమ్మవచ్చు… దీంతో కస్టమర్లకు కూడా పప్పులు శుభ్రంగా ఉన్నాయనే నమ్మకం వస్తుంది. ఇది మీ వ్యాపారానికి విలువను పెంచుతుంది.

55
చిన్న వ్యాపారంతో మంచి లాభాలు..
Image Credit : Getty

చిన్న వ్యాపారంతో మంచి లాభాలు..

ఉడికించిన పప్పుల వ్యాపారం పెట్టుబడిలో చిన్నది, కానీ లాభంలో పెద్దది. "వ్యాపారం చేయడానికి సిగ్గుపడకూడదు" అనే ఆలోచన, కస్టమర్లను నవ్వుతూ పలకరించే గుణం ఉంటే చాలు. ఈ చిన్న వ్యాపారమే మిమ్మల్ని ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మారుస్తుందనడంలో సందేహం లేదు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Related Stories
Recommended image1
Business Ideas : మీరు సొంతూళ్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించాలా..? ఈ 5 బిజినెస్ లలో ఏదో ఒకటి ట్రై చేయండి
Recommended image2
Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved