MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Business Ideas : మీరు సొంతూళ్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించాలా..? ఈ 5 బిజినెస్ లలో ఏదో ఒకటి ట్రై చేయండి

Business Ideas : మీరు సొంతూళ్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించాలా..? ఈ 5 బిజినెస్ లలో ఏదో ఒకటి ట్రై చేయండి

మీకు వచ్చే జీతంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందా? అయితే పెద్దగా పోటీ లేని 5 కొత్త వ్యాపారాలతో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో, కొత్తవాళ్లు కూడా ఈజీగా సక్సెస్ అవ్వొచ్చు.

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 15 2026, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నెలకు లక్షలు సంపాదించే సింపుల్ బిజినెస్ లు
Image Credit : Gemini

నెలకు లక్షలు సంపాదించే సింపుల్ బిజినెస్ లు

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఒక్క ఉద్యోగం, దాని నుంచి వచ్చే జీతం మీద ఆధారపడటం చాలా కుటుంబాలకు కష్టంగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, కుటుంబ అవసరాల నేపథ్యంలో అదనపు ఆదాయం సంపాదించడం తప్పనిసరి అయింది. చాలామంది ఫుడ్ బిజినెస్, యూట్యూబ్ ఛానల్, ఫ్రీలాన్సింగ్ వంటి పాత పద్ధతులనే ఎంచుకుంటున్నారు. కానీ వీటిలో పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో కొత్తవాళ్లు వెంటనే లాభాలు చూడటం కష్టం. అందుకే పోటీ తక్కువగా ఉండి, మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న 5 కొత్త వ్యాపారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటి ద్వారా మీరు నెలకు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు సులభంగా సంపాదించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 సోలార్ ప్యానల్ క్లీనింగ్
Image Credit : Pinterest

సోలార్ ప్యానల్ క్లీనింగ్

తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, ఫ్యాక్టరీలు, వ్యవసాయ పంపుసెట్లపై సోలార్ ప్యానెళ్ల వాడకం వేగంగా పెరుగుతోంది. ఈ ప్యానెళ్లపై దుమ్ము, పక్షుల రెట్టలు పేరుకుపోతే విద్యుత్ ఉత్పత్తి సగానికి పడిపోతుంది. అందుకే వీటిని సరిగ్గా శుభ్రం చేయాల్సిన అవసరం కస్టమర్లకు ఉంది. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. కొన్ని బేసిక్ క్లీనింగ్ బ్రష్‌లు, వాటర్ స్ప్రేయర్, సేఫ్టీ పరికరాలు ఉంటే చాలు. ఒక ఇంటికి సర్వీస్ చేయడానికి రూ.500 నుంచి రూ.2,000 వరకు ఛార్జ్ చేయవచ్చు. కేవలం వీకెండ్స్‌లో పనిచేసినా నెలకు 30 నుంచి 40 మంది కస్టమర్లను సంపాదిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.

Related Articles

Related image1
Business Ideas: క్లాత్ బిజినెస్‌తో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఇంటి నుండే ఇలా ప్రారంభించండి!
Related image2
Village Business: కొంచెం కష్టపడితే గ్రామాల్లోనూ నెలకు లక్ష రూపాయల ఆదాయాన్నిచ్చే బిజినెస్‌లు ఇవి
36
మైక్రోగ్రీన్స్ వ్యాపారం
Image Credit : Asianet News

మైక్రోగ్రీన్స్ వ్యాపారం

ధాన్యాలు లేదా ఆకుకూరల విత్తనాలు మొలకెత్తిన 7 నుంచి 15 రోజుల్లోపు కోసే చిన్నపాటి మొక్కలనే 'మైక్రోగ్రీన్స్' అంటారు. సాధారణ ఆకుకూరల కంటే వీటిలో పోషకాలు చాలా రెట్లు ఎక్కువ. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవాళ్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు, పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది.ఇవి పెంచడానికి వ్యవసాయ భూమి అవసరం లేదు. మీ ఇంట్లోని ఒక చిన్న గదిలో లేదా టెర్రస్‌పై చిన్న ప్లాస్టిక్ ట్రేల సహాయంతో చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మార్కెట్లో ఒక కిలో మైక్రోగ్రీన్స్ క్వాలిటీని బట్టి రూ.500 నుంచి రూ.2,000 వరకు అమ్ముడవుతోంది. అపార్ట్‌మెంట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దీనికి మంచి మార్కెట్ ఉంటుంది.
46
EV ఛార్జింగ్ బిజినెస్
Image Credit : X

EV ఛార్జింగ్ బిజినెస్

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల అమ్మకాలు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ వాటికి తగ్గట్టుగా ఛార్జింగ్ స్టేషన్లు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ గ్యాప్‌ను వాడుకుంటే మంచి లాభాలు చూడొచ్చు. మీకు రోడ్డు పక్కన సొంతంగా దుకాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు లేదా ఖాళీ స్థలాలు ఉంటే, అక్కడ చిన్నపాటి EV ఛార్జింగ్ పాయింట్ పెట్టడం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు వేరే పనిలో ఉన్నా, మీ స్థలంలో ఉన్న ఛార్జింగ్ పాయింట్‌లో ప్రజలు తమ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకుని డబ్బులు చెల్లిస్తారు. కస్టమర్లు పెరిగేకొద్దీ, శ్రమ లేకుండానే మీకు స్థిరమైన ఆదాయం వస్తుంది.

56
ఆన్లైన్ అప్లికేషన్స్
Image Credit : Getty

ఆన్లైన్ అప్లికేషన్స్

ప్రభుత్వ పథకాలు, సర్టిఫికెట్లు అన్నీ డిజిటల్ అయినా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం ఇప్పటికీ ఒక సవాలుగానే ఉంది. పాన్ కార్డ్ (PAN), ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు వంటి వాటి కోసం ప్రజలు ఇప్పటికీ టెక్నాలజీ తెలిసిన వారి సహాయాన్నే కోరుతున్నారు.ఒక కంప్యూటర్ (Laptop/PC), మంచి ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మీ ఇంట్లో నుంచే లేదా ఒక చిన్న దుకాణంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రతి అప్లికేషన్‌కు లేదా సేవకు కొంత సర్వీస్ ఛార్జ్ వసూలు చేయవచ్చు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో దీన్ని ప్రారంభిస్తే, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం సంపాదించవచ్చు.
66
 టెర్రస్ ఫార్మింగ్ కు సహాయం
Image Credit : chat gpt

టెర్రస్ ఫార్మింగ్ కు సహాయం

నగరాల్లో నివసించేవారు తమకు కావాల్సిన కూరగాయలను తమ టెర్రస్‌పైనే సేంద్రియ పద్ధతిలో పండించుకోవాలని ఆశపడుతున్నారు. కానీ దాన్ని ఎలా ప్రారంభించాలి, ఏ మట్టి మిశ్రమం వాడాలి, మొక్కలను ఎలా చూసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. వారి ఈ అవసరాన్నే మనం ఒక వ్యాపారంగా మార్చుకోవచ్చు. కస్టమర్ల అవసరానికి తగ్గట్టుగా 'గ్రో బ్యాగ్స్' (Grow Bags), నాణ్యమైన మట్టి, సేంద్రియ ఎరువులు, కూరగాయల విత్తనాలను అందించి, వారి టెర్రస్‌పై ఒక పూర్తిస్థాయి తోటను ఏర్పాటు చేసి ఇవ్వాలి. తోటను ఏర్పాటు చేయడమే కాకుండా, వారానికి ఒకసారి లేదా నెలవారీ మెయింటెనెన్స్ సర్వీస్‌ను కూడా అందించవచ్చు. ఒక టెర్రస్ గార్డెన్ సెటప్‌కు, దాని సైజును బట్టి రూ.5,000 నుంచి రూ.50,000 వరకు లాభం సంపాదించవచ్చు.

ఏ వ్యాపారంలోనైనా మొదట్లోనే సక్సెస్ అవ్వాలంటే, మార్కెట్లో పోటీ తక్కువగా ఉన్న కొత్త రంగాలను ఎంచుకోవడమే తెలివైన పని. పైన చెప్పిన 5 వ్యాపారాలు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పుట్టుకొచ్చిన కొత్త మార్కెట్లు. మీ ప్రాంతంలో దేనికి డిమాండ్ ఉందో ఆలోచించి, వాటిలో ఏదైనా ఒకదాన్ని పూర్తి శ్రద్ధతో ప్రారంభిస్తే, 'జీతం సరిపోవట్లేదు' అనే బాధ పోయి, నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించే బాస్‌గా మీరూ మారొచ్చు!

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Business Ideas: క్లాత్ బిజినెస్‌తో నెలకు లక్షల్లో సంపాదన.. తక్కువ పెట్టుబడితో ఇంటి నుండే ఇలా ప్రారంభించండి!
Recommended image2
Village Business: కొంచెం కష్టపడితే గ్రామాల్లోనూ నెలకు లక్ష రూపాయల ఆదాయాన్నిచ్చే బిజినెస్‌లు ఇవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved