MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్

Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్

ఇడ్లీ వ్యాపారం… తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే సులభమైన బిజినెస్. నాణ్యమైన పిండి, సరైన లొకేషన్, ఖర్చుల నిర్వహణ లాంటి సీక్రెట్స్ తెలిస్తే చాలు. నెలకు రూ.50,000 పైగా ఈజీగా సంపాదించవచ్చు. ఈ బిజినెస్ సీక్రెట్స్ ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 30 2026, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ బిజినెస్ ఐడియా.. క్లిక్ అయ్యిందో సాప్ట్ వేర్ ఉద్యోగుల స్థాయిలో ఆదాయం
Image Credit : Gemini AI

సూపర్ బిజినెస్ ఐడియా.. క్లిక్ అయ్యిందో సాప్ట్ వేర్ ఉద్యోగుల స్థాయిలో ఆదాయం

ఈ కాలంలో చదువుకు, సంపాదనకు సంబంధం ఉండటంలేదు... ప్రతి ఒక్కరు 'డిగ్నిట్ ఆఫ్ లేబర్' ను కోరుకుంటున్నారు. అంటే చేసే పని ఏదైనా సరే దాన్ని పర్ఫెక్ట్ గా చేస్తే చాలు… ఇది తక్కువ, అది ఎక్కువనే భావన ఉండటంలేదు. అందుకే బాగా చదువుకున్నవారు కూడా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్నారు... చాలామంది సక్సెస్ కూడా అవుతున్నారు. ఇలా నామోషీగా భావించకుండా చిన్నచిన్న బిజినెస్ లు చేస్తూ నెలకు సంపాదించేవారు ఉన్నారు... ఇలా మీరుకూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే.

చాలామంది సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగాల కోసం తిరుగుతుంటే, కొందరు ఇంట్లోంచే లేదా చిన్న దుకాణంతో చిరు వ్యాపారాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి ఒక సింపుల్ లాభసాటి వ్యాపారమే ఇడ్లీల అమ్మకం. ఇది అందరికీ తెలిసిన వ్యాపారమే అయినా, దీని అసలు రహస్యాలు తెలిసిన వాళ్లే నెలకు రూ.50,000 పైగా లాభం పొందుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇడ్లీ బిజినెస్ కు ఎందుకంత క్రేజ్?
Image Credit : Gemini AI

ఇడ్లీ బిజినెస్ కు ఎందుకంత క్రేజ్?

ఇడ్లీ అనేది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనే ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. దీని రుచి దక్షిణాది నుండి ఉత్తర భారతదేశం, విదేశాలకు పాకింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్.. ఇలా అన్ని వేళలా దీనికి డిమాండ్ ఉంటుంది. 

ఒక సాధారణ రోజు ఒక ఇడ్లీ బండిపై 300-500 ఇడ్లీలు అమ్ముడయినా మంచి ఆదాయమే ఉంటుంది. ఒక్కో ఇడ్లీ రూ.10-15 అనుకున్నా, రోజువారీ ఆదాయం రూ.4,000-7,000 వరకు ఉంటుంది. నెలలో 25 రోజులు అమ్మితే, మొత్తం ఆదాయం రూ.1,00,000 నుంచి రూ.1,75,000 వరకు సంపాదించొచ్చు. ఖర్చులు పోను నెలకు రూ.50,000 పైగా లాభం గ్యారెంటీ.

35
ఇడ్లీ అమ్మకాలు పెరగాలంటే ఏం చేయాలి?
Image Credit : Gemini AI

ఇడ్లీ అమ్మకాలు పెరగాలంటే ఏం చేయాలి?

చాలామంది ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టి ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం నాణ్యత లేకపోవడమే. రుచికరమైన ఇడ్లీల తయారీ రహస్యం ఏంటంటే… పాత బియ్యం, మినపప్పును సరైన నిష్పత్తిలో (4:1 లేదా 3:1) నానబెట్టి, కరెక్ట్‌గా పులిసిన తర్వాత రుబ్బాలి. కొందరు రుచి కోసం తవుడు బియ్యం కూడా కలుపుతారు. పిండిలో కొద్దిగా ఉప్పు, వంటసోడా సరిగ్గా వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. చట్నీ, సాంబార్, కారంపొడిలో ప్రత్యేకత చూపిస్తే కస్టమర్లు మనల్ని వదలరు. ఇంట్లో చేసిన రుచిని అమ్మే చోట అందించడమే అసలైన సీక్రెట్.

మంచి లొకేషన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. బస్టాండ్, ఆఫీసులు, కాలేజీల దగ్గర లేదా జనాలు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అమ్మకాలు జోరుగా ఉంటాయి. ఇడ్లీల అమ్మకానికి మొబైల్ బండి లేదా చిన్న దుకాణం సరిపోతుంది. ప్రారంభంలో రూ.20,000-50,000 పెట్టుబడి (ఇడ్లీ కుక్కర్, స్టవ్, గిన్నెలు, టేబుల్) చాలు. WhatsApp, Instagram ద్వారా 'హోమ్ స్టైల్ ఇడ్లీ' అని ప్రచారం చేసుకోవచ్చు. దగ్గర్లోని ఇళ్లకు ఫ్రీ డెలివరీ లేదా అందరూ ప్లేట్ కు 4 ఇడ్లీలు ఇస్తే మీరు 5 ఇడ్లీలు ఇవ్వడం… ఇలాంటి ఆఫర్లతో కస్టమర్లను పెంచుకోవచ్చు. నాణ్యత ఉంటే ఒక్కసారి కొన్నవాళ్లు మళ్లీ మళ్లీ మీ దగ్గరకే వస్తారు.

45
ఒక్క ఇడ్లీపై ఇంత లాభమా..!
Image Credit : Gemini

ఒక్క ఇడ్లీపై ఇంత లాభమా..!

ఒక ఇడ్లీ తయారీకి బియ్యం, పప్పు, గ్యాస్, పనివాళ్ల ఖర్చు అన్నీ కలిపి సుమారు రూ.4-6 అవుతుంది. దాన్ని రూ.12-15కి అమ్మితే ప్రతి ఇడ్లీపై రూ.6-9 లాభం వస్తుంది. రోజుకు 500 ఇడ్లీలు అమ్మితే, రోజువారీ లాభం రూ.3,000-4,500. అంటే నెలకు రూ.75,000-1,00,000 వరకు లాభం సంపాదించొచ్చు. ఖర్చులు తగ్గించుకోవడానికి పిండిని పెద్దమొత్తంలో రుబ్బుకోవడం, ఎలక్ట్రిక్ ఇడ్లీ మేకర్ వాడటం లాంటివి చేయాలి. ఆ తర్వాత దోశ, ఉప్మా, పొంగల్, వడ కూడా అమ్మడం మొదలుపెడితే ఆదాయం ఇంకా పెరుగుతుంది.

అయితే ఇడ్లీ బిజినెస్ చేసేవాళ్లు రోజూ ఉదయాన్నే లేచి పనిచేయాలి.. ఇంది కొంచెం కష్టమే. కానీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటే సులభం అవుతుంది. శుభ్రత, FSSAI లైసెన్స్, GST (అవసరమైతే) లాంటివి తప్పనిసరిగా చూసుకోవాలి. నాణ్యతను ఎప్పుడూ ఒకేలా మెయింటెయిన్ చేయడమే దీర్ఘకాలిక విజయానికి ఆధారం. ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చనడానికి ఇడ్లీ వ్యాపారం ఒక మంచి ఉదాహరణ.

55
మీ భవిష్యన్ ను మార్చే బిజినెస్
Image Credit : Gemini

మీ భవిష్యన్ ను మార్చే బిజినెస్

ఇడ్లీ అమ్మకం అనేది సాధారణ వ్యాపారం కాదు. ఇది కష్టం, నాణ్యత, తెలివితేటల కలయిక. సరైన ప్లానింగ్‌తో మొదలుపెడితే నెలకు రూ.50,000 లాభం అనేది కల కాదు, నిజం. చాలామంది యువత, మహిళలు ఈ వ్యాపారంలో సక్సెస్ అవుతున్నారు. మీకు కూడా ఆసక్తి ఉంటే వెంటనే ఇడ్లీ బిజినెస్ మొదలుపెట్టండి. మీ చేతులతో చేసే ఇడ్లీలే మీ భవిష్యత్తును మారుస్తాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Related Stories
Recommended image1
Business Idea : షాపు, పెట్టుబడి అక్కర్లేదు.. మీ ఇంట్లో కూర్చునే చేతినిండా డబ్బులు సంపాదించండి
Recommended image2
Village Business: కొంచెం కష్టపడితే గ్రామాల్లోనూ నెలకు లక్ష రూపాయల ఆదాయాన్నిచ్చే బిజినెస్‌లు ఇవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved