MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అంబానీ అంత నష్టాల్లో ఉన్నారా? ఫోర్బ్స్ టాప్ 10 బిలియనీర్ల లిస్టు నుంచి అంబానీ అవుట్

అంబానీ అంత నష్టాల్లో ఉన్నారా? ఫోర్బ్స్ టాప్ 10 బిలియనీర్ల లిస్టు నుంచి అంబానీ అవుట్

ప్రపంచ కుబేరుల్లో ఎప్పుడూ టాప్ 10 లో ఉండే ముఖేష్ అంబానీ ఇప్పుడు ఆ జాబితాలో లేరు. ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025లో ముఖేష్ అంబానీ స్థానం కిందకు పడిపోయింది. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల లిస్టులో ఇప్పుడు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 03 2025, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025 విడుదలైంది. ఇండియాలో మొత్తం బిలియనీర్ల సంఖ్య లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పెరిగింది. గతంలో 200 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 205కి పెరిగింది. వీళ్లందరి దగ్గర ఉన్న ఆస్తుల నికర విలువ ఏకంగా 941 బిలియన్ డాలర్లు. అయితే లాస్ట్ ఇయర్ ఈ జాబితాలో ఉన్న 200 మంది బిలియనీర్ల ఆస్తుల నికర విలువ 954 బిలియన్ల డాలర్లు. ఈ ఏడాది బిలియనీర్ల సంఖ్య పెరిగినా వారి మొత్తం ఆస్తుల నికర విలువ మాత్రం తగ్గింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఫోర్బ్స్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియాలో ఇప్పుడు 205 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇందులో ముఖేష్ అంబానీ భారతదేశానికి చెందిన ముకేష్ అంబానీ టాప్ 10 లిస్టులో లేరు. ముఖేష్ అంబానీ కంపెనీల షేర్లు పడిపోవడం వల్ల ఆయన ఆస్తి 20 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ తగ్గిపోయింది. 

అంబానీ రూ.7.85 లక్షల కోట్ల ఆస్తులతో 18వ స్థానంలో ఉన్నారు. ఇండియాలో మాత్రం ఆయనే నంబర్ వన్ ధనవంతుడిగా కొనసాగుతున్నారు.

 

35

ఎప్పటిలాగే నంబర్ వన్ ఎలాన్ మస్క్

2025వ సంవత్సరంలో కూడా ఎలాన్ మస్క్ టాప్ లో ఉన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ 342 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 2025వ సంవత్సరం కోసం ఫోర్బ్స్ బిలియనీర్ల లిస్టులో ప్రపంచవ్యాప్తంగా నుంచి 3,028 మంది ఉన్నారు. చరిత్రలో ఫస్ట్ టైమ్ ఈ సంవత్సరంలోనే బిలియనీర్ల సంఖ్య 3,000 దాటింది. వాళ్ల మొత్తం ఆస్తుల విలువ 16.1 ట్రిలియన్ డాలర్లుగా రికార్డ్ అవడం మరో విశేషం. 

45

సెకండ్ ప్లేస్ లో జుకర్ బర్గ్

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫస్ట్ టైమ్ సెకండ్ ప్లేస్‌కి ఎదిగారు. అతని ఆస్తుల నికర విలువ 216 బిలియన్ డాలర్లు. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉన్న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను, ఫోర్త్ ప్లేస్ లో ఉన్న ఒరాకిల్ లారీ ఎలిసన్‌ను అతను దాటేశారు.

55

ఫోర్బ్స్ లిస్టులో 10 మంది ధనవంతులైన భారతీయులు వీరే..

ముఖేష్ అంబానీ (నికర విలువ $92.5 బిలియన్లు)
గౌతమ్ అదానీ (నికర విలువ $56.3 బిలియన్లు)
సావిత్రి జిందాల్ & కుటుంబం (నికర విలువ $35.5 బిలియన్లు)
శివ్ నాడార్ (నికర విలువ $34.5 బిలియన్లు)
దిలీప్ షాంగ్వి (నికర విలువ $24.9 బిలియన్లు)
సైరస్ పూనవల్లా (నికర విలువ $23.1 బిలియన్లు)
కుమార్ బిర్లా (నికర విలువ $20.9 బిలియన్లు)
లక్ష్మి మిట్టల్ (నికర విలువ $19.2 బిలియన్లు)
రాధాకిషన్ దమాని (నికర విలువ $15.4 బిలియన్లు)
కుశాల్ పాల్ సింగ్ (నికర విలువ $14.5 బిలియన్లు)

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
స్టాక్ మార్కెట్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ప్రపంచం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image2
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Recommended image3
Post Office MIS: ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే ప్రతీ నెల మీ ఖాతాల్లోకి రూ. 16,650 వస్తాయి.. ఏం చేయాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved