Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Currency: ఈ కరెన్సీ విలువ డాలర్‌ కంటే మూడు రెట్లు అధికం.. అయినా అమెరికానే తోపు, కారణం ఏంటంటే..

Currency: ఈ కరెన్సీ విలువ డాలర్‌ కంటే మూడు రెట్లు అధికం.. అయినా అమెరికానే తోపు, కారణం ఏంటంటే..

ప్రపంచంలో ప్రతీ దేశానిని ఒక సొంత కరెన్సీ ఉంటుంది. అయితే ఇతర దేశాలతో వ్యాపారం చేయాలంటే మాత్రం డాలర్‌ను ప్రామాణికంగా ఉపయోగిస్తుంటారు. అమెరికా డాలర్ ఉన్న విలువ అలాంటిది. అయితే డాలర్ కంటే విలువైన కరెన్సీ ప్రపంచంలో ఉందని తెలుసా.? ఇంతకీ ఏంటా దేశం, అక్కడి కరెన్సీ విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..   

Narender Vaitla | Published : Mar 09 2025, 03:46 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
currency

currency

ప్రపంచంలో ప్రతి దేశానికి త‌న‌కంటూ ఒక ప్రత్యేక కరెన్సీ ఉంటుంది. భారత్‌లో రూపాయి, పాకిస్థాన్‌లో పాకిస్థాన్‌ రూపాయి, బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశీ టాకా, అమెరికా డాలర్‌ ఇలా ఎన్నో కరెన్సీలు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా వినిపించే పేరు డాలర్‌ మాత్రమే. అమెరికా కరెన్సీ అయిన డాలర్‌లో ప్రపంచంలోని దేశాలు వ్యాపారం చేస్తాయి. ఉదాహరణకు భారత్‌లో డాలర్‌ కరెన్సీ కాదు, చైనాలో కరెన్సీ డాలర్‌ కాదు కానీ ఈ రెండు దేశాల మధ్య జరిగే లావాదేవీలు డాలర్‌ రూపంలో జరుగుతాయి. 

24
Asianet Image

అమెరికా డాలర్‌కు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో చెప్పేందుకు ఇదొక సాక్ష్యంగా చెప్పొచ్చు. ఇలా డాలర్‌ ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రస్తుతం ఒక డాలర్‌ విలువ రూ. 87.15తో సమానంగా ఉంది. అయితే ప్రపంచంలో డాలర్‌ కంటే విలువైన కరెన్సీ ఉందని మీకు తెలుసా.? డాలర్‌తో పోల్చితే ఏకంగా మూడు రెట్లు అధికం కావడం విశేషం. ఇంతకీ ఆ కరెన్సీ ఏంటంటే కువైట్‌ దినార్‌. 
 

34
Asianet Image

కువైట్‌ దినార్‌ అమెరికా డాలర్‌ కంటే మూడు రెట్లు అధికంగా. ఒక్క కువైట్‌ దినార్‌ మన రూ. 282.87తో సమానం. ఈ లెక్కన చూస్తే దినార్‌తో పోల్చితే డాలర్‌ ఎంత బలహీనమైందో అర్థమవుతోంది. అయితే ఇంత విలువైన కువైట్‌ దినార్‌ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఎందుకు కాలేదు.? అమెరికా డాలర్‌ ఎందుకు డామినేట్‌ చేస్తోంది.? అనే ప్రశ్నలు రావడం సర్వసాధారణం. 
 

44
Asianet Image

అయితే దీనికి కారణం ఏంటంటే. అమెరికా జీడీపీలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుంది. కువైట్‌ విషయానికొస్తే జీడీపీ విషయంలో చాలా చిన్న దేశం. అంతేకాకుండా కువైట్ దీనార్ కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ అమెరికా డాలర్‌ మాత్రం ప్రపంచ కరెన్సీగా పరిగణిస్తారు. అమెరికా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగిలిన దేశాలు తమ విదేశీ మారక నిల్వలలో ఎక్కువ భాగాన్ని డాలర్లలో ఉంచుతాయి. డాలర్‌తో పోలిస్తే బలంగా ఉన్నప్పటికీ కువైట్ దినార్ శక్తివంతమైన దేశం కాకపోవడానికి ఇదే కారణం. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Tatkal Ticket: ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి: ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసా?
Tatkal Ticket: ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి: ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసా?
AI Image Editing Apps: మీరు AI ద్వారా ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? టాప్ 6 ఎడిటింగ్ యాప్స్ ఇవిగో
AI Image Editing Apps: మీరు AI ద్వారా ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? టాప్ 6 ఎడిటింగ్ యాప్స్ ఇవిగో
BSNL: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ అదుర్స్: రూ.599కే 84 రోజుల వ్యాలిడిటీ
BSNL: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ అదుర్స్: రూ.599కే 84 రోజుల వ్యాలిడిటీ
Top Stories
Telugu news live updates: Hyderabad - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమం… ఐసీయూలో చికిత్స
Telugu news live updates: Hyderabad - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమం… ఐసీయూలో చికిత్స
Telangana Cabinet meet: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Telangana Cabinet meet: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Trump travel ban : మరో షాకిచ్చిన ట్రంప్.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. ఎందుకంటే?
Trump travel ban : మరో షాకిచ్చిన ట్రంప్.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. ఎందుకంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Fact Check
  • Life Style
  • Sports
  • Entertainment
  • International News
  • District News
  • Visakhapatnam News
  • Guntur News
  • Vijayawada News
  • Hyderabad News
  • Nellore News
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved