జియో, ఎయిర్‌టెల్, వీఐ ధరలు తగ్గాయోచ్.. కొత్త ప్లాన్స్ ఇవే..
భారీగా పెరిగిన రీఛార్జ్ ధరల నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ట్రాయ్ తీసుకొచ్చిన సూచనల మేరకు జియో, ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరల్ని సవరించాయి. కొత్త ధరలేంటి? సవరించిన జాబితా గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ట్రాయ్ కఠిన నియమాలు జారీ చేస్తుండటంతో టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌లు, ఆఫర్‌లను మారుస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వీఐలు తాజాగా ప్లాన్‌లను సవరించాయి. ట్రాయ్ సూచనలతో వాయిస్ కాల్, SMS ప్లాన్‌లను ఇటీవల ప్రకటించాయి.
డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాల్స్, SMS లకోసం మాత్రమే మొబైల్ ఫోన్స్ ను ఉపయోగించే వారిని దృష్టిలో పెట్టుకొని రీఛార్జ్ ప్లాన్స్ తీసుకురావాలని ట్రాయ్ సూచించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొచ్చారు.
గత వారం రోజులుగా ట్రాయ్ వాయిస్, SMS ప్లాన్ లకు సంబంధించి కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో రియలన్స్ జియో రూ. 1748తో 336 రోజుల వ్యాలిడిటీ అందించారు. అంతకు ముందు ఈ ప్లాన్ ధర రూ. 1958 గా ఉండేది.
ఇక జియో రూ. 458 ప్లాన్ ఇప్పుడు రూ. 448కి తగ్గింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్, 1000 SMSలు ఉచితంగా పొందొచ్చు. వీటితో పాటు జియో సినిమా, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
ఎయిర్‌టెల్ రూ. 1959 ప్లాన్ ఇప్పుడు రూ. 1849గా మారింది. ఈ ప్లాన్ లో 365 రోజుల వ్యాలిడీతో అన్‌లిమిటెడ్ కాల్స్, 3600 SMSలు లభిస్తాయి. జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ వ్యాలిడిటీ తగ్గించలేదు.
ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ ఇప్పుడు రూ. 469కి తగ్గించారు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, 900 SMSలు ఉచితంగా పొందొచ్చు. వీటితో పాటు హలో ట్యూన్, అపోలో సర్కిల్ మెంబర్‌షిప్ లాంటివి ఉచితంగా పొందొచ్చు.