iPhone 17 Sales: మనదేశంలో రేపటి నుంచి ఐఫోన్ 17 అమ్మకాలు మొదలు, భారీ డిస్కౌంట్ ఆఫర్లు
భారత్‌లో రేపటి నుంచి ఐఫోన్ 17 (iphone) అమ్మకాలు మొదలవుతున్నాయి. భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. అన్ని ఆపిల్ స్టోర్లలో (Apple) ఇది అందుబాటులో ఉంటుంది. రిటైల్ అవుట్‌లెట్లు, ఇ-కామర్స్ ద్వారా కూడా ఫోన్ కొనొచ్చు.

ఐఫోన్ 17 అమ్మకాలు
ఐఫోన్ 17 ఫోన్లు అమ్మకానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అనేక దేశాల్లో దీని అమ్మకాలు జరుగుతున్నాయి. మనదేశంలో ఈ రోజు నుంచి (సెప్టెంబరు 19) ఐఫోన్ 17 అమ్మకాలు మొదలవుతాయి. యాపిల్ స్టోర్, రిటైల్ షాపులు, ఇ-కామర్స్ ద్వారా కొనొచ్చు. ఐఫోన్ 17, ప్రో, ప్రో మ్యాక్స్, ఎయిర్ మోడల్స్ లభిస్తాయి.
ఐఫోన్ 17పై భారీ ఆఫర్లు
ఆపిల్ వెబ్‌సైట్ ద్వారా ఐఫోన్ 17 కొనేవారికి కొన్ని ఆఫర్లు ఉన్నాయి. క్యాష్‌బ్యాక్ ఆఫర్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్, క్రెడిట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రకటించిన ఆఫర్లు ఇవే
ఐఫోన్ 17 కొనేవారికి ప్రధాన బ్యాంకుల నుంచి నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్, ఐసీఐసీఐ కార్డులపై రూ.10,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఆఫర్లు
ఆపిల్ ట్రేడ్ ఇన్ ద్వారా గరిష్టంగా రూ.64,000 వరకు ఆదా చేసుకోవచ్చు. క్రోమా ఇప్పటికే ఫ్లాట్ రూ.6,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 17కు భారీ స్పందన
కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఐఫోన్ 17 ఉత్పత్తిని పెంచారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఫోన్ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఈసారి భారత్‌లో రికార్డు అమ్మకాలు జరగొచ్చు.

