iPhone 15 Price Down: ఐఫోన్ 15 కొనేందుకు సిద్ధమైపోండి, తక్కువ ధరకే అమెజాన్‌లో కొనేయచ్చు
ఐఫోన్ 15 ( iphone) కొనేందుకు సిద్ధమైపోండి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ (Amazon)లో ఇప్పుడు భారీగా ధర తగ్గింది. ఈఎమ్ఐ సదుపాయంతో డిస్కౌంట్లతో దీన్ని అమ్మకానికి పెట్టారు. ఏ ధరకు ఈ ఐఫోన్ కొనవచ్చో తెలుసుకోండి.

యాపిల్ ఐఫోన్ 15
యాపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్ అంటే ఎంతో ఇష్టం. మీరు ఐఫోన్ 15 ధర అమెజాన్‌లో తగ్గింది. 128 జీబీ వేరియంట్‌పై ఇప్పుడు పెద్ద డిస్కౌంట్ వచ్చింది. మీరు కొనాలనుకుంటే ఇదే మంచి సమయం.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్
అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ రాబోతోంది. ఇందులో భాగంగా ఐఫోన్ 15, 128 జీబీ వేరియంట్ ధర రూ.59,999. ఈ ఫోన్ అసలు ధర రూ.69,999. ఇప్పుడు అమెజాన్ 14 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అంటే మీకు పదివేల తక్కువ ధరకే ఇది రాబోతోంది.
డిస్కౌంట్ కూడా
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడి కొనేవారికి వెయ్యి రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ పే ద్వారా రూ.1,799 వరకు క్యాష్‌బ్యాక్ సౌకర్యం కూడా అమెజాన్ అందిస్తోంది. అంటే ఇంకా తక్కువ ధరకే ఫోన్ కొనుక్కోవచ్చు.
ఈఎమ్ఐ సదుపాయంతో
ఒకేసారి ఎక్కువ పెట్టి ఫోన్ కొనలేని వారు నెలకు రూ.2,895తో అమెజాన్ ఈఎంఐ సౌకర్యం అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఈఎంఐ ప్లాన్‌ల ద్వారా రూ.2,701 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఐఫోన్ 15 ఫీచర్లు
ఐఫోన్ 15లో అనేక ఫీచర్లు ఉన్నాయి. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే తో ఈ ఫోన్ వస్తోంది. ఏ16 బయోనిక్ చిప్, 48 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.