MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మహిళలు మీకు జోహార్లు.. అప్పులు చెల్లించడంలో మహిళలే టాప్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందో తెలుసా?

మహిళలు మీకు జోహార్లు.. అప్పులు చెల్లించడంలో మహిళలే టాప్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందో తెలుసా?

Indian Women Financial Awareness: నగరాల్లో కంటే పల్లెలు, పట్టణాల్లో ఉండే మహిళలు ఎక్కువగా రుణాలు తీసుకొని తిరిగి సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ మాట కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. అందుకే వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి మరిన్ని రుణాలు ఇచ్చేందుకు ప్లానింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏఏ రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారో తెలుసుకుందాం రండి.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 03 2025, 09:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెట్రో నగరాల కంటే నాన్-మెట్రో ప్రాంతాలలోని ఎక్కువ మంది మహిళలు అప్పులు తీసుకుంటూ సక్రమంగా చెల్లిస్తున్నారని నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం 'రుణగ్రహీతల నుండి నిర్మాతల వరకు: భారతదేశ ఆర్థిక వృద్ధి కథలో మహిళల పాత్ర' అనే నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం నాన్-మెట్రో ప్రాంతాల్లో 48 శాతం, మెట్రో ప్రాంతాల్లో 30 శాతం మహిళలు తమ క్రెడిట్ స్కోర్ ను పెంచుకుంటున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

డిసెంబర్ 2024 నాటికి 2.7 కోట్ల మంది మహిళలు తమ క్రెడిట్‌ స్కోర్ ను గమనిస్తున్నారట. ఇది గత సంవత్సరం కంటే 42 శాతం ఎక్కువ. ఇది ఆర్థిక విషయాలపై పెరుగుతున్న అవగాహనను తెలియజేస్తోంది. ట్రాన్స్‌ యూనియన్ సిబిల్‌, నీతి ఆయోగ్ మహిళా పారిశ్రామికవేత్తల వేదిక(డబ్ల్యూఈపీ), మైక్రోసేవ్ కన్సల్టింగ్ (ఎంఎస్‌సీ) ఈ నివేదికను ప్రచురించాయి. మొత్తం సెల్ఫ్ మానిటరింగ్ బేస్‌లో మహిళల వాటా  డిసెంబర్ 2024లో 19.43 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇది 2023లో 17.89 శాతంగా ఉంది. 
 

35

2024లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 49 శాతం మహిళలు తమ క్రెడిట్ స్కోర్ లను గమనించుకుంటూ అవసరాల మేరకు అప్పులు తీసుకొని తిరిగి సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ విషయంలో దక్షిణ భారతదేశం 1.02 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. 

రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా ఉత్తర, మధ్య రాష్ట్రాలు గత ఐదేళ్లలో మహిళలు ఎక్కువగా రుణాలు తీసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. 

45

2019 నుండి వ్యాపార రుణాల మంజూరులో మహిళల వాటా 14 శాతం పెరిగింది. బంగారు రుణాలలో వారి వాటా 6 శాతం పెరిగింది. డిసెంబర్ 2024 నాటికి మహిళలు వ్యాపార రుణగ్రహీతల్లో 35 శాతంగా ఉంటారు. అయితే రుణం తీసుకోవడానికి వెనకాడటం, బ్యాంకింగ్ అనుభవాలు సరిగా లేకపోవడం, రుణం పొందడంలో అడ్డంకులు, ష్యూరిటీ సమస్యలు ఇలాంటి ఇబ్బందుల వల్ల చాలా మంది మహిళలు రుణాలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.  
 

55

అందుకే మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం చేసేందుకు రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభం చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల వేదిక (డబ్ల్యూఈపీ) మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత, రుణ సదుపాయం, మార్గదర్శకత్వం, మార్కెట్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైతం పెరుగుతున్న నేపథ్యంలో వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తే దేశ ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రభుత్వ పథకాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Recommended image2
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Recommended image3
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved