Post office: అసలు అలాగే ఉంటుంది నెలకు రూ. 9 వేలు అకౌంట్‌లోకి వస్తాయి.. బెస్ట్ స్కీమ్
Post office: డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని సరైన విధానంలో ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. పదవి విరమణ తర్వాత నిరంతరం ఆదాయం కోరుకునే వారికి ఒక బెస్ట్ ఇన్వెస్ట్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నెల నెల డబ్బు కోరుకునే వారికి
నేటి జీవన విధానంలో భవిష్యత్ అవసరాల కోసం సేవింగ్ తప్పనిసరి అయింది. ధరలు పెరగడం, అనుకోని ఖర్చులు, వైద్య అవసరాలు, పెళ్లి ఖర్చులు వంటి విషయాలు ఎప్పుడైనా భారంగా మారవచ్చు. అలాంటి వారికి నెలకు నెల ఆదాయం వచ్చే ఒక ప్రభుత్వ పథకం మంచి పరిష్కారంగా ఉంటుంది.
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఏంటి?
తపాలా శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక సేవింగ్ పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది Post Office Monthly Income Scheme (MIS). ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెడితే, దానిపై నెలకు ఒకసారి వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. పెట్టుబడి భద్రంగా ఉండటం ఈ పథకం ప్రత్యేకత.
వడ్డీ రేటు ఎంత ఉంటుంది?
ఈ నెలవారీ ఆదాయ పథకానికి ప్రస్తుతం ఏడాదికి 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇది మంచి రాబడిగా చెప్పవచ్చు. ముఖ్యంగా రిస్క్ లేకుండా స్థిర ఆదాయం కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
ఎవరు ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
* 18 ఏళ్లు దాటిన వ్యక్తి ఈ పథకంలో ఖాతా తెరవవచ్చు.
* సింగిల్ అకౌంట్ అయితే కనీసం రూ. 1,000 నుంచి గరిష్ఠంగాా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి అవకాశం ఉంటుంది.
* జాయింట్ అకౌంట్ అయితే ముగ్గురు కలిసి గరిష్ఠంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
* ఈ ఖాతాను దేశవ్యాప్తంగా ఉన్న ఏ తపాలా కార్యాలయంలోనైనా ప్రారంభించవచ్చు.
పెట్టుబడిపై నెలకు ఎంత ఆదాయం వస్తుంది?
* రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ. 3,083 వడ్డీ వస్తుంది.
* గరిష్ఠంగా రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు దాదాపు రూ. 5,500 లభిస్తుంది
* జాయింట్ అకౌంట్‌లో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ. 9,250 ఆదాయం వస్తుంది.
పెట్టుబడి పెట్టిన వెంటనే నెలవారీ ఆదాయం మొదలవుతుంది. దీర్ఘకాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు, నెలకు స్థిర ఆదాయం కోరుకునే వారు, రిస్క్ తీసుకోకుండా సేవింగ్ చేయాలనుకునే వారికి ఈ పథకం చాలా ఉపయోగకరం. పెట్టుబడీ భద్రంగా ఉంటుంది, నెలకు డబ్బు చేతికి వస్తుంది. పూర్తి వివరాల కోసం మీకు సమీపంలో ఉన్న పోస్టాఫీస్‌ను సందర్శించండి.

