MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Petrol Diesel Prices: డీజిల్, ఏటీఎఫ్‌పై పెరిగిన టాక్స్.. పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయా?

Petrol Diesel Prices: డీజిల్, ఏటీఎఫ్‌పై పెరిగిన టాక్స్.. పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయా?

Petrol Diesel Price : గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో డీజిల్, ఏటీఎఫ్‌లపై విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్రం పెంచింది. మరి దీనివల్ల దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయా? ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 16 2026, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ మంటలు
Image Credit : Getty

గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ మంటలు

అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అస్సలు బాలేవు. అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న వార్ వల్ల మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ పీక్స్‌కు చేరాయి. ఈ గొడవల వల్ల గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.73 డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది. కేవలం ఈ జూలై నెలలోనే క్రూడాయిల్ ధరలు 17 శాతం వరకు పెరిగాయి.

అమెరికా ఇరాన్‌పై మళ్లీ నావికా దళ ఆంక్షలు విధించడంతో హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఆయిల్ సప్లైకి పెద్ద బ్రేక్ పడింది. ప్రపంచంలో జరిగే ఆయిల్ సప్లైలో 20 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. రష్యా నుంచి ఎగుమతులు తగ్గడం కూడా ఆయిల్ మార్కెట్‌పై విపరీతమైన ఒత్తిడి పెంచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం
Image Credit : Gemini

రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

క్రూడాయిల్ రేట్లు ఇలా పెరిగిపోతుండటంతో మోదీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. డీజిల్, విమాన ఇంధనం ఎగుమతుల పై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌ను భారీగా పెంచేసింది. ఈ పెంచిన కొత్త రేట్లు గురువారం నుంచే అమలులోకి వచ్చాయి. అయితే, పెట్రోల్ ఎగుమతులపై విధించే టాక్స్‌ను మాత్రం కాస్త తగ్గించి కంపెనీలకు ఊరటనిచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ రేట్లు, ఆయిల్ కంపెనీల లాభాలను బట్టి ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విండ్‌ఫాల్ టాక్స్‌ను రివ్యూ చేస్తుంది. అందులో భాగంగానే ఈ కొత్త పన్ను రేట్లను అనౌన్స్ చేసింది.

Related Articles

Related image1
Bonalu: గోల్కొండ కోటలోనే తొలి బోనం.. ఈ ఆషాఢం సంబురాల వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసా?
Related image2
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
36
అసలు పన్నులు ఎంత పెరిగాయి?
Image Credit : Getty

అసలు పన్నులు ఎంత పెరిగాయి?

ప్రభుత్వం డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న పన్నును లీటరుకు 8.5 రూపాయల నుంచి ఏకంగా 15.5 రూపాయలకు పెంచింది. అంటే లీటరుకు రూ. 7 పెరిగిందన్నమాట. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై ఈ టాక్స్‌ను లీటరుకు 7.5 రూపాయల నుంచి 14.5 రూపాయలకు పెంచారు.

కానీ పెట్రోల్ ఎగుమతి చేసే కంపెనీలకు మాత్రం కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్‌పై పన్నును లీటరుకు 4 రూపాయల నుంచి 2.5 రూపాయలకు తగ్గించింది. గతంలో జూలై 1న అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఏటీఎఫ్ ధరలను లీటరుకు 5 రూపాయల వరకు తగ్గించారు. కానీ ఇప్పుడు మళ్లీ గ్లోబల్ మార్కెట్ వేడెక్కడంతో పన్నులు మార్చాల్సి వచ్చింది.

46
మన జేబులు ఖాళీ అవుతాయా? ధరలు పెరుగుతాయా?
Image Credit : Getty

మన జేబులు ఖాళీ అవుతాయా? ధరలు పెరుగుతాయా?

ఇప్పుడు అందరి మైండ్‌లో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న.. "మరి ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయా?" అని. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరల పై పెద్దగా ప్రభావం వుండదని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ లేటెస్ట్ నిర్ణయం వల్ల మన దేశంలో సామాన్యులు కొనే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు.

ఎందుకంటే ఈ విండ్‌ఫాల్ టాక్స్ అనేది కేవలం విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసే రిఫైనరీ కంపెనీలపై మాత్రమే విధిస్తారు. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు మన దేశీ కంపెనీలు ఇండియాలో అమ్మకుండా, విదేశాల్లో అమ్ముకుని భారీగా లాభాలు సంపాదించకుండా అడ్డుకోవడమే ఈ పన్ను మెయిన్ ఉద్దేశం. దీనివల్ల దేశీయ మార్కెట్లో ఇంధన కొరత రాకుండా ఉంటుంది. కాబట్టి సామాన్యుడి జేబుకు ఎలాంటి కత్తెర పడదు.

56
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి
Image Credit : Getty

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి

• న్యూఢిల్లీ: పెట్రోల్ ₹102.12, డీజిల్ ₹95.20

• కోల్‌కతా: పెట్రోల్ ₹113.48, డీజిల్ ₹99.82

• ముంబై: పెట్రోల్ ₹111.21, డీజిల్ ₹97.83

• చెన్నై: పెట్రోల్ ₹107.78, డీజిల్ ₹99.56

• హైదరాబాద్: పెట్రోల్ ₹115.69, డీజిల్ ₹103.82

66
గతంలో బల్క్ కొనుగోళ్లపై వచ్చిన ఆంక్షలు
Image Credit : Getty

గతంలో బల్క్ కొనుగోళ్లపై వచ్చిన ఆంక్షలు

నిజానికి గతంలో జూన్ 11న ప్రభుత్వం ఇండస్ట్రియల్, కమర్షియల్ బల్క్ కస్టమర్లు రిటైల్ బంకుల్లో ఇంధనం కొనకుండా తాత్కాలిక ఆంక్షలు పెట్టింది. హోల్‌సేల్ ఛానెల్స్ ద్వారానే ఆయిల్ కొనాలని రూల్ తెచ్చింది. ఎందుకంటే అప్పట్లో బల్క్ రేట్ లీటరుకు 134.50 రూపాయలు ఉంటే, రిటైల్ బంకుల్లో రేట్ మాత్రం 95.20 రూపాయలే ఉండేది. ఈ భారీ తేడా వల్ల పెద్ద కంపెనీలన్నీ బంకుల దగ్గర క్యూ కట్టాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Bonalu: గోల్కొండ కోటలోనే తొలి బోనం.. ఈ ఆషాఢం సంబురాల వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసా?
Recommended image2
South Kashmir of Andhra: దక్షిణ కాశ్మీరం.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.. పాపికొండలు ఎందుకు అంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved