RBI New rule: ఈఎమ్ఐ కట్టకపోతే మీ ఫోన్ లాక్ పడిపోతుంది.. కొత్త రూల్ తెస్తున్న ఆర్బీఐ
ఈఎమ్ఐలు చెల్లించకుండా ఎగ్గొట్టేవారి కోసం RBI కొత్త నిబంధనను తీసుకురాబోతోంది. దీని వల్ల బ్యాంకులకు భద్రత పెరుగుతుంది. కస్టమర్లపై EMIలు సకాలంలో కట్టేలా చేయడానికి కొత్త నియమం తీసుకువస్తోంది. ఈఎమ్ఐ కట్టకపోతే మీ ఫోన్ లాక్ పడిపోతుంది.

ఆర్‌బిఐ కొత్త నిబంధన
మనదేశంలో మొబైల్ మార్కెట్ చాలా విస్తారమైనది. TRAI డేటా ప్రకారం మనదేశంలో 116 కోట్లకు పైగా జనం మొబైల్ వాడుతున్నారు. అందుకే ఈ మొబైల్ నెట్ వర్క్ ఉపయోగించి కస్టమర్లు ఈఎమ్ఐ కట్టేలా చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఆ నియమాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతోంది. RBI ఈ కొత్త నిబంధనను అమలు చేస్తే బ్యాంకులకు భద్రత పెరుగుతుంది. కస్టమర్లపై EMIలు సకాలంలో చెల్లించాలనే ఒత్తిడి కూడా పెరుగుతుంది.
ఈఎమ్ఐలు కట్టకపోతే...
ఈఎమ్ఐలు సకాలంలో కట్టకపోతే ఫోన్ లాక్ అయ్యేలా నిబంధన పెట్టాలని ఆర్బీఐ పాటిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆర్థిక సంస్థలు EMI కట్టకపోతే, ఫోన్‌లో ఉన్న ప్రత్యేక యాప్ ద్వారా ఫోన్ లాక్ చేస్తారు. అయితే, గతేడాది RBI ఈ నిబంధన ఆపాలని ఆదేశించింది.
ఫోన్ లాక్ అయిపోతుంది
భారతదేశంలో ఇప్పుడు చాలా మంది మొబైల్ ఫోన్‌లు లోన్లు పెట్టి కొనుక్కుంటున్నారు. EMIల ద్వారా ఆ ఫోన్లను కొంటున్నారు. 2024లో విడుదలైన హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ అధ్యయనం ప్రకారం, ఎలక్ట్రానిక్ పరికరాల్లో మూడింట ఒక వంతు EMIల ద్వారా కొంటున్నారు. దీనివల్ల బ్యాంకులకు చిన్న మొత్తంలో రుణ భారం పెరుగుతోంది.
బ్యాంక్ గైడెన్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పుడు ఒక రూల్ ను పరిశీలిస్తోంది. అంటే, EMIతో మొబైల్ ఫోన్ కొన్న వ్యక్తి ఆ ఈఎమ్ఐ ప్రతి నెలా చెల్లించకపోతే, బ్యాంక్ ఆ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేసే అధికారాన్ని కలిగిఉంటుంది. త్వరలోనే ఈ నియమం అమల్లోకి రాబోతోంది. ఈ చర్య వల్ల బ్యాంకులపై NPA భారం తగ్గుతుంది.
కస్టమర్ అనుమతి ఉండాలి
కొత్త నిబంధన ప్రకారం, ఫోన్ కొనే కస్టమర్ ముందస్తు అనుమతిని తీసుకోవాలి. ఈఎమ్ఐ చెల్లించకపోతే ఫోన్ లాక్ చేసుకోవచ్చు అని కస్టమర్ ముందుస్తుగా ఒప్పుకోవాలి. అయితే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు ఫోన్ లాక్ చేసిన తర్వాత లోపల ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే అనుమతి మాత్రం ఉండదు. ఈ విధంగా, బ్యాంకులు తమ చిన్న రుణాలను వసూలు చేసుకునే అవకాశం లభిస్తుంది.