- Home
- Business
- ఇప్పటి వరకు ఎవరికీ తెలియని బిజినెస్ ఐడియా.. కాస్త తెలివిగా ఆలోచిస్తే నెలకు రూ. లక్ష పక్కా
ఇప్పటి వరకు ఎవరికీ తెలియని బిజినెస్ ఐడియా.. కాస్త తెలివిగా ఆలోచిస్తే నెలకు రూ. లక్ష పక్కా
Business Idea: వ్యాపారం చేయాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ బిజినెస్ మొదలు పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో తెలివిగా ఆలోచించి చేసే ఒక బెస్ట్ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లిళ్లలో రిటర్న్ గిఫ్ట్స్‌కు కొత్త ఆలోచన
భారతీయ వివాహాల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం చాలా సాధారణం. సాధారణంగా స్వీట్స్, చిన్న గిఫ్ట్స్ ఇస్తుంటారు. కానీ అవి కొంతకాలానికి మరిచిపోతాం. అయితే ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే.. దానిని ఒక వ్యాపార ఐడియాగా మార్చుకుంటే భలే ఉంటుంది కదూ. అదే పెళ్లిలో దిగిన ఫొటో. ఇది సాధారణ గిఫ్ట్ కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారుతుంది.
ఈ బిజినెస్ ఐడియా ఎలా పనిచేస్తుంది?
వివాహ స్టేజ్ పై బంధువులు, స్నేహితులు జంటతో కలిసి ఫొటోలు దిగుతారు. అక్కడే మనం ఒక సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా ఫొటో గ్రాఫర్స్ దీనిని రన్ చేయొచ్చు. లేదంటే ఫొటోగ్రాఫర్స్‌తో టై అప్ అయి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కెమెరా మ్యాన్ ఫొటో తీసిన వెంటనే ఆ ఫొటో సాఫ్ట్ కాపీ ల్యాప్‌టాప్‌లోకి వెళ్తుంది. అక్కడే ఉన్న ప్రింటర్‌లో వెంటనే ఫొటోను ప్రింట్ తీయాలి. ఆ తర్వాత ఒక అందమైన ఫ్రేమ్‌లో పెట్టి, వివాహానికి వచ్చిన వారికి అందజేయాలి. ఫొటో దిగిన కొన్ని నిమిషాల్లోనే చేతిలో ఫ్రేమ్ వస్తే, అతిథులకు వచ్చే ఆనందం వేరు. ఈ అనుభవాన్ని వారు ఎప్పటికీ మర్చిపోరు.
ఈ గిఫ్ట్ ఎందుకు ప్రత్యేకం?
ఈ రిటర్న్ గిఫ్ట్ డబ్బుతో కొనే వస్తువు కాదు, భావోద్వేగంతో కూడిన జ్ఞాపకం. ఇంట్లో గోడపై పెట్టుకునే ఒక గుర్తు. పెళ్లికి వెళ్లిన ప్రతి కుటుంబం ఇంటికి వెళ్లాక కూడా ఆ ఫొటోను చూసి ఆ పెళ్లిని గుర్తు చేసుకుంటారు. అందుకే ఇది సాధారణ గిఫ్ట్స్ కన్నా చాలా విలువైనది. పెళ్లి చేసే వారికి కూడా ప్రత్యేక గుర్తింపును తెస్తుంది.
పెట్టుబడి ఎంత కావాలి.?
ఈ బిజినెస్ మొదలుపెట్టడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. సాధారణంగా ఒక ప్రింటర్, ఒక ల్యాప్‌టాప్, ఫొటో ఫ్రేమ్‌లు అవసరమవుతాయి. పెట్టుబడి విషయానికొస్తే ల్యాప్‌టాప్, ప్రింటర్ కాకుండా.. ఫొటో ఫ్రేమ్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫ్రేమ్‌లను బల్క్‌గా తీసుకుంటే ఒక్కోటి సుమారు రూ. 50 అవుతుంది. అదే విధంగా ఒక కలర్ ప్రింట్‌కి సుమారు రూ. 10 ఖర్చవుతుంది. ఈ లెక్కన ఒక ఫ్రేమ్ సుమారు రూ. 60 నుంచి రూ. 70లో రడీ అవుతుంది.
లాభాలు ఎలా ఉంటాయి.?
ఒక్క ఫ్రేమ్‌కు రూ. 150 వరకు ఛార్జ్ చేయవచ్చు. ఉదాహరణకు పెళ్లికి 100 కుటుంబాలు వచ్చినా.. పెళ్లి చేసే వారికి ఖర్చు సుమారు రూ. 15,000 అవుతుంది. వ్యాపారం చేసే వారికి తక్కువలో తక్కువ ఒక్క రోజులో రూ. 7 వేలు లాభం పొందొచ్చు. నెల మొత్తంలో సరాసరి ఒక 10 వివాహాలు జరిగినా రూ. 70 వేలు ఆర్జించవచ్చు. పెళ్లిల సీజన్ సమయంలో కొంతమంది ఉద్యోగులను నియమించుకొని ఒకేసారి ఒకటికి మించి ఈవెంట్స్‌లో సేవలు అందించవచ్చు. దీంతో లాభం మరింత ఎక్కువగా ఉంటుంది.

