క్రెడిట్ కార్డ్ బిల్ కడుతున్నారా.. ఆర్‌బీఐ కొత్త రూల్.. ఇదొక్కటే మార్గం!

తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్  సంబంధించి ఆర్‌బీఐ కొత్త రూల్  ప్రకటించింది.
 

RBI new rule for paying credit card bills through payment apps! This is the only way!-sak

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు  సహా ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ ఉన్న కస్టమర్‌లకు ఆర్‌బీఐ ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్‌కు సంబంధించి ఆర్‌బీఐ కొత్త రూల్ ప్రకటించింది. ఈ రూల్ ప్రకారం ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం లాంటి మొబైల్ అప్లికేషన్లు ఇకపై ఈ క్రెడిట్ కార్డుల బిల్లుల పేమెంట్స్ కోసం ఉపయోగించరాదు. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అన్నీ భారత్ బిల్-పే సిస్టమ్ (BBPS) ద్వారా మాత్రమే జరగాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. 

PhonePay, Amazon Pay, Paytm లాంటి మొబైల్ పేమెంట్ యాప్స్ నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థతో ఇంటిగ్రేటెడ్ కానందున RBI ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. అందువల్ల క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తాన్ని చెల్లించే కస్టమర్లు NEFT, IMPS మొదలైన పేమెంట్ పద్ధతుల ద్వారా చెల్లించవచ్చు. లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి చెల్లించవచ్చు.

RBI కొత్త నిబంధన కారణంగా కస్టమర్లు Phone Pay, Amazon Pay, Paytm యాప్‌లను వదులుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ కంపెనీల వ్యాపారం కూడా  ప్రభావితమవుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios