ఇప్పుడు ఒక కొత్త వాదన ప్రజల్లో వినిపిస్తోంది. ఆర్బీఐ త్వరలో 500 రూపాయల నోటు రద్దు చేయబోతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

500 రూపాయల నోట్లే ఇప్పుడు చలామణిలో ఉన్న అతిపెద్ద నోటు. ఎందుకంటే 2,000 నోట్ల వాడకం ఎప్పుడో ఆగిపోయింది. 1000 రూపాయలు నోట్లు ఎప్పుడో రద్దు చేశారు. ఇప్పుడు ఏటీఎం నుంచి వచ్చే అతి పెద్ద నోట్లు 500 రూపాయలు. అయితే సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో రకరకాల వాదనలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుండి 500 రూపాయల నోట్లు ఉపసంహరించుకునేందుకు ఆదేశించిందని వినిపిస్తోంది. త్వరలో 500 రూపాయలు నోట్లు ఆర్బిఐ రద్దు చేయబోతోందని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎంత నిజమో తెలుసుకోవడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రయత్నించింది.

ఎక్స్ లో పోస్టులు

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా ఎక్స్ లో ఆర్బిఐ 500 రూపాయల నోట్లను ఉపసహరించుకోబోతోందంటూ పోస్టులు కనిపించాయి. దీన్ని పిఐబి లోని ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నిజమో కాదో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. పిఐబి చెప్పిన ప్రకారము ఆర్బిఐ ఎలాంటి సూచనలు జారీ చేయలేదు. ఇప్పటికీ కూడా 500 రూపాయలు నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ గానే చెల్లుబాటు అవుతున్నాయి.

https://twitter.com/PIBFactCheck/status/1929898698290672131

సోషల్ మీడియాలో వైరల్ అయిన దాని ప్రకారం సెప్టెంబర్ 2025 నాటికి ఏటీఎంల నుండి 500 నోట్లను నిషేధించాలని ఆర్బిఐ బ్యాంకులను ఆదేశించినట్టు ఒక సందేశం కనిపించింది. అది ఎంతోమంది షేర్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే ఆ పోస్టు పూర్తిగా అబద్ధమని పిఐబీ నిర్ధారించింది. ఆ పోస్టులో మార్చి 2026 నాటికి 75% ఏటీఎంలో 200 రూపాయల నోట్లు, వంద రూపాయలు నోట్లు మాత్రమే లభిస్తాయని ఉంది. వీలైనంత త్వరగా మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను ఖర్చు చేయమని కూడా పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఇదంతా ప్రజలను తప్పుదారి పట్టించేందుకేనని చెబుతోంది పీఐబీ.

పిఐబి ఫ్యాక్ట్స్ చెక్ యూనిట్ ఏమిటి?

భారత ప్రభుత్వ నికి చెందినది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB). దీనిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా ఉంది. నవంబర్ 2019లో దీన్ని ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం దాన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన నకిలీ వార్తల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పనిచేస్తుంది.

సోషల్ మీడియాలో ఇలా వైరల్ అయిన అబద్ధపు ప్రచారాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి, అలాగే ప్రజలకు సరైన ప్రకటనలు చేయడానికి కూడా ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పనిచేస్తుంది. ప్రజలకు ఖచ్చితమైన నమ్మదగిన సమాచారాన్ని ఇవ్వడమే ఈ యూనిట్ ప్రధాన లక్ష్యం.

యూనిట్లో ఎవరెవరు ఉంటారు?

వాస్తవ తనిఖీ విభాగమైన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కు చెందిన సీనియర్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తారు. ఇక ఆయన దగ్గర అసోసియేట్లుగా ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ జూనియర్ అధికారులు పనిచేస్తారు. ఈ యూనిట్ పిఐబి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కి రిపోర్ట్ చేస్తుంది.

2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం 1000, 500 నోట్లను రద్దు చేసింది. మహాత్మా గాంధీ సిరీస్ లో ఉన్న ఈ నోట్లన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రద్దు చేసిన నోట్లకు బదులుగా కొత్త ₹500 నోట్లు, అలాగే 2000 నోట్లను కూడా జారీ చేసింది. ఆ తర్వాత 2023 మే నెలలో 2000 రూపాయల నోట్లను కూడా ఉపసంహరించుకున్నట్టున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

2000 నోట్లు ఏమయ్యాయి?

ముద్రించిన 2000 రూపాయల నోట్లలో 98 శాతానికి పైగా నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. కానీ ఇప్పటికీ కొంతమంది 200 నోట్లను తమ దగ్గర ఉంచుకున్నారు. వాటి విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 6,017 కోట్ల రూపాయల విలువైన రెండువేల కరెన్సీ నోట్లు ఇంకా ప్రజల వద్ద ఉండిపోయినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రకటించింది. మీ దగ్గర కూడా 2,000 రూపాయల నోట్లు ఉంటే దగ్గర్లోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి వెళ్లి మార్చుకోవచ్చు. లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా ఆ నోట్లను ఆర్బిఐ కార్యాలయానికి పంపించవచ్చు.

ఆర్బిఐ కార్యాలయాలు హైదరాబాద్ తో ఫోటో పాటు అనేక చోట్ల ఉన్నాయి. ముంబై, లక్నో, ఢిల్లీ, పాట్నా, కాన్పూర్, జమ్మూ, కోల్ కతా, జైపూర్, భువనేశ్వర్, నాగపూర్, తిరువనంతపురం, చెన్నై, చండీగఢ్, బేలాపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ లలో ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. అక్కడ మీరు మీ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లోనూ మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు పోస్ట్ ద్వారా నోట్లను పంపించాలనుకుంటే మీ ఆధార్ నెంబరు, నోట్ల విలువ, బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలతో కూడిన ఫారం నింపి ఆర్బిఐ కి సీల్డ్ కవర్లో పంపించాలి. వాటిని పరిశీలించాకే ఆ మొత్తానికి డబ్బును మీ ఖాతాలో జమ చేస్తారు.