Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Home Loan: ఇల్లు కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో హోమ్ లోన్ తక్కువ వడ్డీ రేటుతోనే లభిస్తాయి. తక్కువ వడ్డీతో హోమ్ లోన్ వచ్చే బ్యాంకుల గురించి ఇక్కడ ఇచ్చాము.

రెపో రేటు తగ్గింది కాబట్టి
దేశంలోని బ్యాంకుల రుణాలపై పెద్ద ప్రభావం చూపించే రెపో రేటును భారత రిజర్వు బ్యాంక్ తాజాగా తగ్గించింది. ఈసారి రేపో రేటును 5.50 శాతం నుంచి 5.25 శాతానికి తీసుకువచ్చింది. ఈ తగ్గింపుతో దేశవ్యాప్తంగా ఇళ్ల రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. రెపో రేటు అంటే బ్యాంకులు రిజర్వు బ్యాంక్ నుండి అప్పు తీసుకునే సమయంలో చెల్లించే వడ్డీ. ఈ రేటు తగ్గితే బ్యాంకుల ఖర్చు తగ్గి, వారు ప్రజలకు ఇచ్చే రుణాలపై వడ్డీని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నవారికి ఇదే మంచి సమయం అని చెప్పాలి. ఈ తగ్గింపుతో కొత్త రుణాలు తీసుకోవడానికి మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు.
వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంకులు
రేపో రేటు తగ్గిన వెంటనే బ్యాంకులు తాము ఇస్తున్న రుణాలపై వడ్డీ రేట్లను సవరించడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఇళ్ల రుణాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది తీసుకునే ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు చాలా వరకు తగ్గుతుంది. దీని వల్ల నెలకు కట్టే ఈఎమ్ఐ మొత్తంలో నేరుగా తగ్గుతుంది. అంటే నెలసరి భారము తగ్గుతుంది. ఇంతకుముందు తీసుకున్న రుణాలకు కూడా ఈ తగ్గింపు వరిస్తుంది. రీసెట్ తేదీ వచ్చిన తర్వాత వారి వడ్డీ రేటు తగ్గవచ్చు. పెద్ద రుణాలు తీసుకున్నవారికి ఈ తగ్గింపు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కొత్తగా రుణం తీసుకునేవారికి కూడా తక్కువ వడ్డీతో రుణం లభించడం ఇల్లు కొనడానికి మంచి సమయంగా మారింది.
తక్కువ వడ్డీకే రుణాలిచ్చే బ్యాంకులు ఇవిగో
రెపో రేటు తగ్గింపుతో అనేక బ్యాంకులు తమ ఇళ్ల రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న సగటు వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా: సుమారు 7.40 శాతం దగ్గర నుంచే ఇళ్ల రుణాలు అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా: వడ్డీ రేటు సుమారు 7.30 శాతం నుంచి ప్రారంభమవుతోంది.
యూనియన్ బ్యాంక్: ఇళ్ల రుణ వడ్డీ రేటు సుమారు 7.45 శాతం పరిధిలో ఉంది.
కరూర్ వైశ్య బ్యాంక్: ఈ బ్యాంకు సుమారు 7.60 శాతం వద్ద ఇళ్ల రుణాలు ఇస్తోంది.
ఇదే మంచి సమయం
ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గడంతో ఇల్లు కొనడానికి ఇదే మంచి సమయం. రుణం తీసుకున్నప్పుడు వడ్డీ తగ్గడం వల్ల మొత్తం రుణం మీద ఖర్చు కూడా తగ్గుతుంది. ఇల్లు కొన్న తరువాత ఈఎమ్ఐ భారం తగ్గడం కుటుంబ ఖర్చులను సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇప్పటికే రుణం ఉన్నవారికి కూడా వడ్డీ తగ్గితే నెలసరి చెల్లింపులు తగ్గే అవకాశముంది. రాబోయే నెలల్లో రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో, ధరలు పెరగకముందే ఇల్లు కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

