MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Money Recovery: అప్పుగా ఇచ్చిన మీ డబ్బును ఎగ్గొట్టారా.. ఇలా చేస్తే ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు..

Money Recovery: అప్పుగా ఇచ్చిన మీ డబ్బును ఎగ్గొట్టారా.. ఇలా చేస్తే ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు..

Money Recovery: మనం మన స్నేహితులకు లేదా బంధువులకు నమ్మకంతో అప్పులు ఇస్తుంటాం. కానీ వారు తిరిగి ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఆ అప్పుగా ఇచ్చిన డబ్బును చట్టబద్ధంగా ఎలా వసూలు చేసుకోవాలో న్యాయ నిపుణులు పలు సలహాలు ఇచ్చారు.

2 Min read
Author : Pavithra D
Published : Mar 12 2026, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీ సొమ్మును ఎలా తిరిగి పొందాలి
Image Credit : Money\Twitter

మీ సొమ్మును ఎలా తిరిగి పొందాలి

సాధారణంగా ఆర్థిక అవసరాల కోసం మనకు తెలిసిన వారు అప్పు అడుగుతుంటారు. నమ్మకంతో మనం ఇచ్చే ఆ డబ్బులు కొన్నిసార్లు తిరిగి రావు. అడిగినప్పుడు తప్పించుకోవడం లేదా ఎదురు తిరగడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం మీకు ఎలా తోడ్పడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముందస్తు జాగ్రత్తలు
Image Credit : Money\Twitter

ముందస్తు జాగ్రత్తలు

ఏదైనా అప్పు ఇచ్చేటప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పు ఇచ్చే వ్యక్తి ఎంతటి సన్నిహితుడైనా ప్రామిసరీ నోట్ రాసుకోవడం ఉత్తమం. ఒకవేళ నోటు రాసుకోవడానికి సంకోచిస్తే, కనీసం డిజిటల్ లావాదేవీల(GPay, PhonePe, Net Banking) ద్వారా డబ్బు పంపాలి. దీనివల్ల బ్యాంక్ స్టేట్‌మెంట్ ఒక తిరుగులేని సాక్ష్యంగా మారుతుంది.

35
చట్టపరమైన చర్యలు
Image Credit : Money\Twitter

చట్టపరమైన చర్యలు

డబ్బు తీసుకున్న వ్యక్తి నిర్ణీత సమయంలో తిరిగి ఇవ్వకపోతే, మొదటగా ఒక న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపాలి. నోటీసు అందిన 15 రోజుల్లోగా స్పందించాలని అందులో పేర్కొనాలి. ఆ తర్వాత కూడా డబ్బు చెల్లించకపోతే, సివిల్ కోర్టులో 'మనీ రికవరీ సూట్' దాఖలు చేయవచ్చు. దీనికి అప్పు ఇచ్చిన తేదీ నుండి లేదా అగ్రిమెంట్ గడువు ముగిసిన తేదీ నుండి మూడు సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది.

45
చెక్ బౌన్స్ కేసులు
Image Credit : Money\Twitter

చెక్ బౌన్స్ కేసులు

ఒకవేళ అవతలి వ్యక్తి ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే, సెక్షన్ 138 ఎన్ఐ (NI) యాక్ట్ కింద కేసు నమోదు చేయవచ్చు. ఇది క్వాసీ-క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. చెక్ బౌన్స్ అయిన 30 రోజులలోపు నోటీసు పంపాలి, ఆపై 45 నుండి 75 రోజుల లోపు కేసు దాఖలు చేయాలి.

55
వడ్డీ, సాక్ష్యాలు
Image Credit : Money\Twitter

వడ్డీ, సాక్ష్యాలు

వ్యక్తిగత అవసరాల కోసం ఇచ్చిన అప్పుపై కోర్టు సాధారణంగా 6 శాతం నుంచి 12 శాతం వరకు వడ్డీని నిర్ణయిస్తుంది. అదే వ్యాపార అవసరాలకైతే 18 శాతం నుంచి 23 శాతం వరకు కూడా ఉండవచ్చు. ఒకవేళ ఎటువంటి కాగితాలు లేకుండా కేవలం నగదు ఇచ్చినట్లయితే, ఆ సమయంలో ఉన్న సాక్షులు, వాట్సాప్ చాట్లు, ఫోన్ రికార్డింగ్‌లు లేదా ఫోటోలను ఆధారాలుగా కోర్టుకు సమర్పించవచ్చు. సెక్యూరిటీ కింద ఇల్లు లేదా భూమి పత్రాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అగ్రిమెంట్‌లో ఆ విషయం రాసుకోవాలని న్యాయవాది సూచించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Recommended image3
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Related Stories
Recommended image1
Business Idea: బియ్యం 'బంగారం'.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 60 వేల రాబడి.. భలే గిరాకీ ఐడియా
Recommended image2
Business Ideas: తక్కువ పెట్టుబడితో ప్రతీ నెలా రూ. 50 వేలు పక్కా.. ఎవర్ గ్రీన్ బిజినెస్‌లు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved