UPI Payments: యూపీఐ పేమెంట్స్ లో భారత్ టాప్.. ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
UPI Payments: డిజిటల్‌లో చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ఎవరు ఊహించని విధంగా ఇండియాలో యూపీఐ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడింది. ఆ విశేషాలు మీ కోసం..

డిజిటల్‌లో చెల్లింపుల్లో దూసుకుపోతున్న భారత్..
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. యూపీఐ పేమెంట్స్‌లో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పేర్కొంది. తాజాగా ది రైజ్ ఆఫ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్: ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్‌ఆపరబిలిటీ’ పేరుతో ఐఎంఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రతినెలా భారత్‌లో రూ.1800 కోట్లకుపైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొంది. భారతదేశంలోని 85% డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నట్టు పేర్కొంది.
UPI అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి?
2016లో భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) ద్వారా ప్రారంభమైన UPI, డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పును తెచ్చింది. ఇది వినియోగదారుల అన్ని బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ యాప్‌లో సమగ్రంగా చేర్చి, తక్షణ డబ్బు బదిలీలు సులభతరం చేసింది. IMF గణాంకాల ప్రకారం.. జూన్ 2025లో UPI ద్వారా 18.39 బిలియన్ లావాదేవీలు, ₹24.03 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 32% అధికం. వేగం, సౌలభ్యం, విశ్వసనీయత UPIని దేశీయంగా, అంతర్జాతీయంగా ముందంజలో నిలిపాయి.
డిజిటల్ వైపు దూసుకెళ్తున్న భారత్
పత్రికా సమాచార కార్యాలయం (PIB) తాజా నివేదిక ప్రకారం.. భారతదేశం నగదు, కార్డ్ ఆధారిత చెల్లింపుల నుంచి డిజిటల్ ప్రథమ ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా దిశామార్గం అవుతోంది. లక్షలాది మంది వ్యక్తులు, చిన్న వ్యాపారాలు తక్కువ ఖర్చుతో, సురక్షితమైన లావాదేవీల కోసం UPIపై ఆధారపడుతున్నారు. ఈ మార్పు భారత్‌లో ఆర్థిక చొరవను మరింతగా విస్తరిస్తోంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ
చెల్లింపులు, లాభాదేవీలు వేగవంతం కావడంతో UPI ఆర్థిక సమ్మిళితానికి శక్తివంతమైన సాధనంగా మారింది. ప్రస్తుతం 491 మిలియన్ల మంది వ్యక్తులు, 65 మిలియన్ల వ్యాపారులు, 675 బ్యాంకులు UPI సేవలను వినియోగిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను విస్తృతంగా బలపరుస్తోంది.
డిజిటల్ ఇండియా నుంచి గ్లోబల్ ఇండియాగా..
UPI విజయం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి ఏడు దేశాల్లో UPI సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫ్రాన్స్‌లో ప్రారంభం ద్వారా UPI యూరప్‌లో తన తొలి మైలురాయిని చేరుకుంది. ఈ నిర్ణయంతో అక్కడ నివసించే లేదా భారతీయ పర్యాటకులకు సులభంగా, భద్రంగా అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి మార్గం వేస్తోంది.
గణాంకాలు
PIB నివేదిక ప్రకారం.. UPI గణాంకాలు కేవలం సంఖ్యలు కాదు, అవి నమ్మకం, సౌలభ్యం, వేగానికి నిదర్శనం. నెల నెలకు UPI వినియోగం పెరుగుతుండటంతో, భారతదేశం నగదు రహిత, తక్షణ బదిలీ సాధ్యమైన, డిజిటల్ సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ వైపు స్థిరంగా ముందుకు సాగుతోంది.

