MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Home Loan: హోమ్ లోన్‌తో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కళ్లు తెరవండి.. ఇది మీకోసమే

Home Loan: హోమ్ లోన్‌తో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కళ్లు తెరవండి.. ఇది మీకోసమే

Home Loan: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. ఉద్యోగంలో చేరగానే చాలామంది చేసే మొదటి ఆలోచన ఇల్లు కొనడం. అయితే, కెరీర్ ప్రారంభంలోనే హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం సరైన నిర్ణయమేనా? దీనిపై బిజినెస్ నిపుణులు ఏం అన్నారంటే..  

2 Min read
Author : Pavithra D
Published : Apr 26 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కల సాకారం చేసుకోవాలనుకునే వారు..
Image Credit : Gemini AI

కల సాకారం చేసుకోవాలనుకునే వారు..

సొంత ఇల్లు కల సాకారం చేసుకోవాలనుకునే వారు ముందుగా తమ అఫోర్డబిలిటీని సరిచూసుకోవాలి. మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ శాతం 30 నుంచి 40 శాతం మించకుండా ఉంటేనే లోన్ తీసుకోవడం సురక్షితం. లేదంటే అది మీ దైనందిన జీవితంపై, ఆర్థిక లక్ష్యాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి లోన్ తీసుకునే ముందు మీ ఖర్చులు, పొదుపును లెక్కించుకోవడం చాలా ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫ్లెక్సిబిలిటీ దెబ్బతింటుంది..
Image Credit : PR

ఫ్లెక్సిబిలిటీ దెబ్బతింటుంది..

కెరీర్ ప్రారంభంలోనే హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే, మొదట కొంత నిధిని సమకూర్చుకోవడం మంచిది. ఐటీ లేదా ప్రైవేట్ రంగంలో ఉండేవారు ఉద్యోగ రీత్యా తరచుగా వేర్వేరు ప్రాంతాలకు మారాల్సి ఉంటుంది. అటువంటప్పుడు స్థిరంగా ఒకే చోట ఇల్లు కొనడం వల్ల మీ ఫ్లెక్సిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఎక్కడ స్థిరపడతారో స్పష్టత వచ్చిన తర్వాతే ఇల్లు కొనడం ఉత్తమమైన నిర్ణయం అవుతుంది.

Related Articles

Related image1
Tabu Home Tour: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టబు.. రేటు తెలిస్తే కళ్తు తిరగాల్సిందే..
Related image2
Home Loan: హైద‌రాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనాలంటే.. నెల‌కు ఎంత జీతం రావాలి.?
35
గ్రోయింగ్ సిటీ అవునా కాదా..
Image Credit : Getty

గ్రోయింగ్ సిటీ అవునా కాదా..

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు అది గ్రోయింగ్ సిటీ అవునా కాదా అనేది గమనించాలి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూమి ధరలు తక్కువ కాలంలోనే రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు ఫ్యూచర్‌లో మంచి సెక్యూరిటీ లభిస్తుంది. కానీ మెచ్యూర్ అయిన సిటీలలో రేట్లు అంత వేగంగా పెరగవు కాబట్టి అటువంటి చోట్ల ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

45
లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే..
Image Credit : Getty

లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే..

హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే ముందే, మీ దగ్గర ఉన్న మనీని మ్యూచువల్ ఫండ్స్ వంటి హై-గ్రోత్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లోన్ వడ్డీ కంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ ఫండ్ ద్వారా తర్వాత ఈఎంఐలను సులభంగా చెల్లించవచ్చు. ఇది మీపై లోన్ భారాన్ని తగ్గించడమే కాకుండా, మీ సంపదను కూడా వేగంగా పెంచుకోవడానికి సహాయపడుతుంది.

55
ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే..
Image Credit : Asianet News

ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే..

చివరగా, ఒక ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే కానీ, అది అద్దె కోసమా లేక ఉండటానికా అనేది స్పష్టంగా ఉండాలి. కెరీర్ మధ్యలో లేదా రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నప్పుడు ఇల్లు కొనడం వల్ల మీకు సామాజికంగా, మానసికమైన భద్రత లభిస్తుంది. లోన్ సదుపాయం ఉంది కదా అని అప్పుల ఊబిలో పడకుండా, మీ ఆర్థిక స్తోమతను బట్టి అడుగు వేయడమే అసలైన ఆర్థిక సూత్రం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?
Recommended image2
Subhash Chandra: రూ. 22,000 కోట్ల బాకీ రూ. 6 కోట్లకు క్లియర్ ! జీ సుభాష్ చంద్ర కేసులో ఏం జరిగింది?
Recommended image3
Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !
Related Stories
Recommended image1
Tabu Home Tour: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టబు.. రేటు తెలిస్తే కళ్తు తిరగాల్సిందే..
Recommended image2
Home Loan: హైద‌రాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనాలంటే.. నెల‌కు ఎంత జీతం రావాలి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved