MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea: మహిళలకు రిస్క్ లేని బిజినెస్.. నెలకు ఈజీగా రూ. 50 వేల సంపాదన.. ఎలాగంటే.?

Business Idea: మహిళలకు రిస్క్ లేని బిజినెస్.. నెలకు ఈజీగా రూ. 50 వేల సంపాదన.. ఎలాగంటే.?

Business Idea: ఇప్పుడు ప్రతి చిన్న అకేషన్‌కు కేక్ కటింగ్ అనేది తప్పనిసరి అయింది. అయితే, ప్రతిసారీ 1kg లేదా అంతకంటే పెద్ద కేక్స్ అవసరం ఉండదు. ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తూ మినీ కేక్స్(200g - 250g) బిజినెస్ ప్రారంభించడం లాభదాయకం. ఆ వివరాలు.. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 08 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహిళల కోసం బెస్ట్ హోమ్ బిజినెస్
Image Credit : Money\Twitter

మహిళల కోసం బెస్ట్ హోమ్ బిజినెస్

వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండకుండా ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు "మినీ కేక్స్" ఒక అద్భుతమైన ఐడియా. ప్రస్తుతం బర్త్ డేలు మాత్రమే కాకుండా యానివర్సరీలు, ఫ్రెండ్స్ మీటప్‌లు, లాంగ్ డ్రైవ్స్ వంటి ప్రతి సందర్భంలోనూ కేక్ కటింగ్ సర్వసాధారణమైపోయింది. అయితే, పెద్ద కేకులు వృధా అవుతాయనుకునే వారికి ఈ మినీ కేక్స్(చిన్న సైజు కేకులు) ఒక చక్కని ప్రత్యామ్నాయం.

25
పెట్టుబడి, శిక్షణ:
Image Credit : Pinterest

పెట్టుబడి, శిక్షణ:

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు 30,000 నుంచి 50,000 రూపాయల లోపు పెట్టుబడి సరిపోతుంది. ఇందులో ఒక మంచి క్వాలిటీ ఓవెన్ కొనుగోలుకు 15,000 వరకు, బేకింగ్ క్లాసులకు మరికొంత ఖర్చు అవుతుంది. ఒకట్రెండు వారాల శిక్షణతోనే రుచికరమైన కేకులను తయారు చేయడం నేర్చుకోవచ్చు. ఇంటి నుండే ఈ పని చేయవచ్చు కాబట్టి అదనంగా షాపు రెంట్ లేదా ఇతర ఖర్చులు ఉండవు.

Related Articles

Related image1
Business Idea: కష్టపడకుండా డబ్బులు ఇలా ఈజీగా సంపాదించవచ్చు.. ఎలాగో మీరూ చూడండి
Related image2
Business Idea: తక్కువ ఖర్చు.. అదిరిపోయే లాభం.! ఈ తిరుగులేని వ్యాపారంతో నెలకు లక్షల్లో సంపాదన..
35
వ్యాపార వ్యూహం:
Image Credit : Money\Twitter

వ్యాపార వ్యూహం:

మీ సిగ్నేచర్ రెసిపీతో క్రియేటివ్ డిజైన్లను రూపొందించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు. కేవలం ఆర్డర్ల మీద మాత్రమే కాకుండా, స్థానిక బేకరీలతో టై-అప్ అయి వారికి మినీ కేకులను సరఫరా చేయవచ్చు.

45
క్లౌడ్ కిచెన్‌గా రిజిస్టర్
Image Credit : Money\Twitter

క్లౌడ్ కిచెన్‌గా రిజిస్టర్

స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా క్లౌడ్ కిచెన్‌గా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. షుగర్-లెస్ కేక్స్ లేదా హెల్తీ ఇంగ్రిడియంట్స్‌తో చేసే కేకులకు ఇప్పుడు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

55
ఆదాయం ఇలా..
Image Credit : Money\Twitter

ఆదాయం ఇలా..

ఒక మినీ కేక్ ధరను 150 నుండి 200 రూపాయల వరకు నిర్ణయించవచ్చు. మేకింగ్ ఖర్చులు పోను ఒక్కో కేక్ మీద కనీసం 150 రూపాయల లాభం ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు. రోజుకు సగటున 10 కేకులు విక్రయించినా, నెలకు 35,000 నుండి 45,000 రూపాయల వరకు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ స్థలంలో ప్రారంభించగలిగే ఈ వ్యాపారం గృహిణులకు, విద్యార్థినులకు ఎంతో లాభదాయకం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest Apple Laptops: ఆపిల్ ల్యాప్‌టాప్‌లు రూ.40,000 కంటే తక్కువ ధరకే, వీటిని చవకగా ఎక్కడ కొనాలంటే..
Recommended image2
Hydrogen Cooktop : గ్యాస్ సిలిండర్లతో పనిలేదు.. ఇక నీటితోనే వంట !
Recommended image3
Business Ideas: వేసవిలో డిమాండ్ ఉన్న టాప్ 3 బిజినెస్‌లు ఇవే.. రోజుకు రూ. 5 వేలు లాభం.!
Related Stories
Recommended image1
Business Idea: కష్టపడకుండా డబ్బులు ఇలా ఈజీగా సంపాదించవచ్చు.. ఎలాగో మీరూ చూడండి
Recommended image2
Business Idea: తక్కువ ఖర్చు.. అదిరిపోయే లాభం.! ఈ తిరుగులేని వ్యాపారంతో నెలకు లక్షల్లో సంపాదన..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved