- Home
- Business
- Haier F9 AI washing machine: 20 ఏళ్ల వారంటీ, బడ్జెట్ ధరకే ఏఐ వాషింగ్ మిషన్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Haier F9 AI washing machine: 20 ఏళ్ల వారంటీ, బడ్జెట్ ధరకే ఏఐ వాషింగ్ మిషన్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Haier F9 AI washing machine: ఏఐ అన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పుడు వాషింగ్ మెషీన్లలో కూడా ఎఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇది నీటిని శుద్ధి చేసి, బట్టలు మరింత సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. దీనికి 20 ఏళ్ల వారంటీ కూడా అందిస్తున్నారు.

ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ వాషింగ్ మెషిన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గృహోపకరణాల్లోకి ప్రవేశించింది. హైయర్ సంస్థ ( Haier ) భారతదేశంలో ఏఐ టెక్నాలజీతో కూడిన వాషింగ్ మెషిన్‌ను విడుదల చేసింది. ఈ వాషింగ్ మెషిన్ ప్రత్యేకత ఏంటంటే బట్టల రకాన్ని గుర్తించి, వాటికి అనుగుణంగా ఉతుకుతుంది. అంతేకాక, నీటిని శుద్ధి చేసి, శుద్ధ నీటితో బట్టలు శుభ్రం చేస్తుంది. భారతదేశంలో తొలిసారిగా కలర్ ఏఐ టచ్ ప్యానెల్‌తో, వన్-టచ్ టెక్నాలజీతో వచ్చిన వాషింగ్ మెషిన్ ఇదే.
స్మార్ట్ వాషింగ్ అనుభవం
వినియోగదారులకు ఎఫ్9 స్మార్ట్ వాషింగ్ అనుభవాన్ని అందిస్తోంది. బట్టల రకం, మురికి స్థాయి, బరువును గుర్తించి తగిన వాష్ విధానాన్ని ఎంచుకుని, సులభంగా బట్టలను శుభ్రం చేస్తోంది. అవసరమైన బెస్ట్ వాషింగ్ మెథడ్స్ ను ఈ మిషన్ ఆటోమెటిక్ గా ఎంచుకుంటుంది.
ప్రత్యేకతలు
కలర్ ఎఐ టచ్ ప్యానెల్: టచ్‌కు తక్షణ ప్రతిస్పందనతో వాష్ ప్రోగ్రామ్‌ల ఎంపిక మరింత సులభం.
ఎఐ వన్ టచ్ టెక్నాలజీ: బట్టల బరువు, రకం, మురికి స్థాయిని గుర్తించి స్వయంగా సరైన వాష్ పద్ధతి ఎంచుకుంటుంది.
డైరెక్ట్ మోషన్ మోటార్: బెల్ట్ లేకుండా నిశ్శబ్దంగా, శక్తివంతంగా పనిచేస్తూ విద్యుత్‌ను ఆదా చేస్తుంది.
విశాలమైన డ్రమ్: 525 మిమీ సూపర్ డ్రమ్ ఉండటం వల్ల బట్టలు సులభంగా కదులుతాయి.
AI-DBS టెక్నాలజీ: ఈ ఫీచర్ బట్టల అసమతుల బరువును గుర్తించి సరిచేస్తుంది - ఫలితంగా తక్కువ శబ్దం, ఆకస్మిక కంపనాలు లేకుండా మృదువుగా పనిచేస్తుంది.
హైజీన్ టెక్నాలజీలతో మరింత పరిశుభ్రత
స్ట్రీమ్ టెక్నాలజీ: నీటిని శుద్ధి చేసి, బట్టలను మెరుగ్గా శుభ్రం చేస్తుంది.
డ్యూయల్ స్ప్రే & లేజర్ సీమ్‌లెస్ వెల్డింగ్: డ్రమ్ క్లీనింగ్ కు ఉపయోగపడుతుంది. డ్రమ్ లో దుమ్ము, మలినాల పేరుకుపోకుండా కాపాడుతుంది.
ఎంటిబి ట్రీట్‌మెంట్ (ABT): బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది, హైజీన్‌కి ప్రాధాన్యత ఇస్తుంది.
1400 RPM స్పిన్: ఎక్కువ వేగంతో నీటిని తొలగించడం ద్వారా డ్రై టైమ్ తక్కువగా, బట్టలకు హాని లేకుండా ఉతుకుతుంది.
ధర : 12 కిలోల సామర్థ్యంతో కూడిన ఈ ఎఫ్9 ఫ్రంట్ లోడ్ మోడల్ ధర ₹59,990. దీనికి 5 ఏళ్ల పూర్తి వారంటీ, 20 ఏళ్ల మోటార్ వారంటీ ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్ షాపులు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో అందుబాటులో ఉంది.
ఎఫ్9 సిరీస్‌తో వాషింగ్‌లో విప్లవం
“ప్రతి భారతీయ ఇంటికి అధునాతన, మేధస్సుతో కూడిన బట్టల శుభ్రత అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎఫ్9 సిరీస్‌ను రూపొందించాం“ అని హైయర్ ఇండియా అధ్యక్షుడు ఎన్.ఎస్. సతీష్ తెలిపారు. “బట్టలు ఉతకడం ఇప్పుడు కేవలం అవసరంగా కాక, జీవితంలో ఒక అంతర్భాగంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, మేము కలర్ ఎఐ టచ్ ప్యానెల్ ద్వారా సులభమైన, తెలివైన, సమర్థవంతమైన అనుభవాన్ని రూపొందించాము. ఈ టెక్నాలజీ సాధారణ వాషింగ్ మెషిన్ స్థాయిని మించి, ఫ్రంట్ లోడ్ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది,” అని ఆయన పేర్కొన్నారు.