Washing Machine: వాషింగ్ మెషిన్ పాడవ్వదంటే ఏం చేయాలి?
వాషింగ్ మెషిన్ ఉంది కదా అని అన్ని రకాల దుస్తులు అందులో వేసి ఉతకకూడదు. అలా ఉతికితే.. ఆ దుస్తుల్లే కాదు.. చివరకు మిషిన్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. ముందు ఎలాంటి దుస్తులు ఉతకకూడదు అనే విషయం తెలుసుకొని ఉండాలి.

washing machine cleaning
ఈ రోజుల్లో చేతితో దుస్తులు ఉతికేవారు ఎవరూ లేరనే చెప్పాలి.ప్రతి ఒక్కరూ వాషింగ్ మెషిన్ వాడేవారే. చాలా మందికి ఇప్పుడు వాషింగ్ మెషిన్ అనేది ఒక మంచి మిత్రుడు అని చెప్పాలి. అయితే.. మనం వాషింగ్ మెషిన్ సరిగా వాడకపోతే దాని పనితీరు తగ్గిపోవచ్చు. దాని రిపేర్ చేయడానికి మళ్లీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా.. వాషింగ్ మెషిన్ ఎక్కువ రోజులు మన్నిక రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
washing machine
వాషింగ్ మెషిన్ ఉంది కదా అని అన్ని రకాల దుస్తులు అందులో వేసి ఉతకకూడదు. అలా ఉతికితే.. ఆ దుస్తుల్లే కాదు.. చివరకు మిషిన్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. ముందు ఎలాంటి దుస్తులు ఉతకకూడదు అనే విషయం తెలుసుకొని ఉండాలి.
cleaning washing machine
1.పట్టు వస్త్రాలు
మొదటగా పట్టు బట్టల గురించి చెప్పుకోవాలి. పట్టు చీరలు, సిల్క్ కుర్తాలు, మృదువైన ఫ్యాబ్రిక్స్ వగైరా చాలా డెలికేట్. వీటిని వాషింగ్ మెషిన్‌లో ఉతికితే బట్టల్లోని నాజూకైన తంతువులు తెగిపోతాయి, అందం తగ్గిపోతుంది. బట్టలో మెరుపు తగ్గిపోతుంది. అందుకే వీటిని మెషిన్ లో కాకుండా చేతితో ఉతకడం మంచిది.
2.దుప్పట్లు, బెడ్ షీట్స్..
ఇక దుప్పట్లు, దళసరి బెడ్‌షీట్లు వంటి హెవీ వస్త్రాలు గురించి మాట్లాడితే, ఇవి మెషిన్‌కు గరిష్టంగా ఒత్తిడి పెడతాయి. మెషిన్ డ్రమ్ బరువు తాళలేక తిప్పే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. దీని వలన మెషిన్ శబ్దం పెరగడం, వైబ్రేషన్ ఎక్కువ కావడం, చివరికి మెషిన్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వడం లాంటివి జరుగుతాయి.
washing machine cleaning
3.లెదర్ దుస్తులు..
లెదర్ దుస్తులు,జాకెట్లు, బ్యాగులు వంటి వస్తువులు కూడా వాషింగ్ మెషిన్‌కు నష్టం కలిగించేవే. లెదర్ నీటిని తట్టుకోదు. వీటిని వేయడం వల్ల కూడా మెషిన్ పాడైపోతుంది.
ఇంకా వాటర్‌ప్రూఫ్ దుస్తులు.. ఉదాహరణకి రెయిన్ కోట్స్, షవర్ కర్టెన్లు వంటి వస్త్రాలు. వాషింగ్ మెషిన్‌లో ఉతకడం వల్ల నీరు అవతలికి పోకుండా లోపలే నిలుస్తుంది. దీంతో డ్రమ్‌లో నీటి నిల్వ పెరిగి, మోటర్‌కి అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మెషిన్ డ్యామేజ్ అవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. కొన్ని సందర్భాల్లో మెషిన్ ఆగిపోవడం లేదా స్పిన్ సైకిల్ పూర్తికాకపోవడం జరుగుతుంది.
washing machine
మరి వాషింగ్ మెషిన్ ఎక్కువ రోజులు పని చేయాలంటే ఏం చేయాలి.?
ప్రతి వారం లేదా పదిరోజులకు ఒకసారి టబ్ వాష్ చేయాలి. అంతేకాదు.. వాషింగ్ మెషిన్ లో దుస్తులను వేసే ముందు వాటిపై ఉండే లేబుల్స్ ని చెక్ చేయాలి. మెషిన్ వాషబుల్ అని ఉన్నది మాత్రమే అందులో ఉతకాలి. హ్యాండ్ వాష్ అని రాసి ఉన్నవి వేయకూడదు.షూస్, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న డ్రెస్‌లు, హ్యాండ్ వర్క్ బట్టలు వంటి వాటినీ మెషిన్‌లో ఉతకడం మంచిది కాదు.
అంతిమంగా చెప్పాలంటే, వాషింగ్ మెషిన్ మనకు ఎంత పనికి వస్తుందో, దాని కాపాడే బాధ్యత కూడా మనదే. కొంత జాగ్రత్తగా, అవగాహనతో వాడితే, ఇది చాలా సంవత్సరాల పాటు మేలుగా పనిచేస్తుంది. అలాంటి స్మార్ట్ వాడకంతోనే మనం బట్టల్ని కూడా నయంగా ఉంచుకోవచ్చు, మెషిన్ ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు.